E-Paper
Advertisement

బాంబులా పేలుతున్న ఏసీలు.. ఈ పరిస్థితి రావొద్దంటే.. వెంటనే ఇలా చేయండి!

బాంబులా పేలుతున్న ఏసీలు.. ఈ పరిస్థితి రావొద్దంటే.. వెంటనే ఇలా చేయండి!
Advertisement

AC Safety Tips: సమ్మర్ లో ఏసీలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కొందరైతే ఏసీ గది నుంచి బయటకు రావడానికే ఇష్టపడరు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు గంటల తరబడి ఏసీ కిందే పడుతుంటారు. అయితే ఏసీలు వాడుతున్నప్పుడు బాగానే ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు పాటించకపోయే ప్రాణాలకే ముప్పు రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల పెరిగిపోతున్న ఏసీ పేలుళ్ల ఘటనలే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. కాబట్టి ఏసీ పేలుళ్లను నివారించేందుకు అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఏవో ఈ కథనంలో పరిశీలిద్దాం.

క్రమం తప్పకుండా సర్వీసింగ్

ఏసీలను సర్వీసింగ్ చేయించే విషయంలో ఏమాత్రం అలసత్వం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనీసం ఏడాదికి రెండుసార్లు నిపుణులైన టెక్నీషియన్లతో సర్వీసింగ్ చేయించాలని సూచిస్తున్నారు. అలా చేయకపోతే ఏసీ మోటారుపై దుమ్ము పేరుకుపోయి.. ఒత్తిడి పెరగొచ్చని అంటున్నారు. దీనివల్లే ఏసీల నుంచి మంటలు, పొగ రావొచ్చని హెచ్చరిస్తున్నారు.

వైరింగ్ చెకింగ్

Advertisement

ఏసీకి కనెక్ట్ చేసిన వైర్లు ఎప్పుడు నాణ్యమైనవిగా ఉండాలి. ఒకవేళ ఆ వైర్లు పాతబడినా లేదంటే కాలిపోయినా వెంటనే వాటిని టెక్నిషియన్ల ద్వారా మార్పించాలి. అదే విధంగా ఏసీ సాకెట్, ప్లగ్ పాయింట్లు లూజ్‌గా ఉండకుండా చూసుకోవాలి.

స్టెబిలైజర్ వాడకం

వోల్టేజ్ హెచ్చుతగ్గుల (Voltage Fluctuations) వల్ల కంప్రెసర్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మంచి నాణ్యత కలిగిన స్టెబిలైజర్‌ను తప్పనిసరిగా వాడాలి. అయితే ప్రస్తుతం స్టెబిలైజర్ అవసరం లేని ఏసీలు మార్కెట్లోకి వస్తున్నాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయడం వల్ల.. బ్లాస్టింగ్ సమస్యల నుంచి బయటపడొచ్చు.

గ్యాస్ లీకేజీని గమనించడం

Advertisement

ఏసీకి తరుచూ వచ్చే సమస్యల్లో గ్యాస్ లీకేజీ ఒకటి. ఏసీ ఆన్ చేసినప్పుడు చెడువాసన వచ్చినా, కూలింగ్ రాకపోయినా.. వెంటనే ఆఫ్ చేసి టెక్నిీషియన్ ను సంప్రదించాలి. గ్యాస్ లీకేజీ సమస్య సెట్ అయ్యేవరకూ ఆ ఏసీని వాడకపోవడమే మంచిది.

ఫిల్టర్ల క్లీనింగ్

నెలకు ఒకసారైనా ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల గాలి ప్రసరణ బాగా జరిగి.. మిషన్‌పై భారం తగ్గుతుందని అంటున్నారు. అలాగే అవుట్‌డోర్ యూనిట్ (Outdoor Unit) చుట్టూ గాలి ఆడేలా తగినంత ఖాళీ ఉంచాలని, దానిపై ఎండ నేరుగా పడకుండా షెడ్ ఉంటే ఇంకా మంచిదని పేర్కొంటున్నారు.

Also Read: సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? కొంపలు అంటుకుంటాయ్.. ఇవి గుర్తుపెట్టుకోండి!

మరికొన్ని చిట్కాలు..

ఏసీ కోసం ప్రత్యేకమైన హై కెపాసిటీ ఎంసీబీని అమర్చుకోవాలని నిపుణులు అంటున్నారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు పవర్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుందని తెలియజేస్తున్నారు. మరోవైపు 10 ఏళ్ల కంటే పాతదైన ఏసీలను వాడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. వాటి కంప్రెసర్లు త్వరగా వేడెక్కే ప్రమాదం ఉంటుంది. వీలైతే వాటి స్థానంలో లేటెస్ట్ మోడల్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కొత్త ఫోన్ కావాలా? ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైనవి ఇవే.. లిస్ట్ చూస్తే షాకే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×