E-Paper
Advertisement

బిగ్ స్క్రీన్ లవర్స్ కోసం..అద్భుతమైన స్మార్ట్ టీవీ

బిగ్ స్క్రీన్ లవర్స్ కోసం..అద్భుతమైన స్మార్ట్ టీవీ
Advertisement

Acerpure Nitro 100 inch TV: ప్రస్తుత కాలంలో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చిన్న స్క్రీన్‌ల రోజులు పోయి, ఇళ్లలోనే పెద్ద థియేటర్ లాంటి ఫీల్ పంచే భారీ సైజ్ స్మార్ట్ టీవీల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో టెక్నాలజీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఏసర్ బ్రాండ్ నుంచి వస్తున్న ‘acerpure NITRO 253 cm (100 inch)’ టెలివిజన్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా లవర్స్, గేమర్స్‌ను దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే, విజువల్స్:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని భారీ సైజ్,డిస్‌ప్లే క్వాలిటీ. ఇందులో 253 సెంటీమీటర్లు .. అనగా దాదాపు 100 అంగుళాల QLED అల్ట్రా HD (4K) డిస్‌ప్లేను అందించారు. అంతే కాకుండా ఇది 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలోని క్వాంటం డాట్ టెక్నాలజీ కారణంగా ప్రతి రంగు చాలా సహజంగా, స్పష్టంగా , ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల హెచ్‌డీఆర్ కంటెంట్ చూస్తున్నప్పుడు విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వలన వేగంగా కదిలే యాక్షన్ సీన్లు లేదా స్పోర్ట్స్ మ్యాచ్‌లులాగ్ లేకుండా చూడొచ్చు.

సౌండ్ సిస్టమ్:

Advertisement

పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు సౌండ్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ విషయంలో ఏసర్ పర్ఫెక్ట్ కాంబినేషన్‌ను అందించింది. ఇందులో పవర్ షుల్ 65W స్పీకర్లను అమర్చారు. ఇవి డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో పనిచేస్తాయి. థియేటర్లలో లభించే సరౌండ్ సౌండ్ ఫీల్ ఇది నేరుగా మీ ఇంట్లోనే అందిస్తుంది. అదనంగా, ఇందులో బిల్ట్-ఇన్ కరాకోకే ఫీచర్ కూడా ఉంది, ఇది ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

స్మార్ట్ ఫీచర్స్, గేమింగ్:

ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీని వల్ల ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక గేమర్స్ కోసం ఇందులో ప్రత్యేకంగా ఆటో లో లాటెన్సీ మోడ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ , గేమ్ ఆప్టిమైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 2 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం వల్ల టీవీ ఫర్ఫామెన్స్ ఎంతో వేగంగా ఉంటుంది. కనెక్టివిటీ కోసం తగినన్ని హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులతో పాటు వైఫై, బ్లూటూత్ సపోర్ట్ లభిస్తుంది.

Advertisement

Also Read: రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

ధర:

మార్కెట్లో లభించే .. ఇతర ప్రీమియం 100-ఇంచ్ టీవీలతో పోలిస్తే.. దీని ధరను ఎంతో ఆకర్షణీయంగా ఉంచారు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర మార్కెట్లో రూ. 3,49,999 వరకు ఉండగా.. ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్ల తరువాత కేవలం రూ. 1,49,999 ధరకే లభిస్తోంది. భారీ స్క్రీన్‌పై అద్భుతమైన ఫీచర్లు కోరుకునే వారికి ఇది ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

మీ ఇంటి లివింగ్ రూమ్‌ను నిజమైన సినిమా హాల్‌గా మార్చుకోవాలనుకుంటే, లేటెస్ట్ టెక్నాలజీతో…వస్తున్న ఈ ఏసర్ ప్యూర్ నిట్రో 100 ఇంచ్ QLED టీవీ ఒక గొప్ప ఆప్షన్. దీని ప్రీమియం లుక్, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ,గూగుల్ టీవీ ఫీచర్లు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ధర, ఫీచర్ల పరంగా ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించుకుంటుంది.

Related News

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్రిక్!

చలికాలంలో గీజర్ ఆన్ చేస్తున్నారా? ఈ సీక్రెట్ ట్రిక్స్ పాటిస్తే.. పవర్ బిల్లు భయమే ఉండదు!

వన్ ప్లస్‌లో అతిపెద్ద పండుగ సేల్.. ఫోన్లు, ట్యాబ్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

AI వల్ల జాబ్స్ పోవడం కాదు.. రూ. 1 కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ కొత్త జాబ్స్ గురించి తెలుసా?

రూ.908కే అద్భుతమైన సౌండ్..బడ్జెట్ ధరలో సూపర్ బేస్

గడియారాన్ని ఒక గంట వెనక్కి తిప్పుకుంటున్న యూకే ప్రజలు.. ఇదో వింత చరిత్ర

Big Stories

Advertisement
×