Basara IIIT: దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి లాక్‌డౌన్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఈసారి ఎల్‌నినో కారణంగా మంచినీటి కొరత వేధిస్తోంది. ఫలితంగా కాలేజీలకు సెలవు ఇవ్వడం మొదలైంది. తెలంగాణలోని బాసర ఐఐఐటీ నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. దసరా సెలవులను నవంబర్ 17వరకు పొడిగిస్తూ ఓ ప్రకటన వెలువడింది. గోదావరి నది సమీపంలో పరిస్థితి ఇలా ఉంటే, మిగతా ప్రాంతాల్లో ఇంకెంత దారుణంగా ఉందో?
ఎల్ నినో ప్రభావం క్రమంగా తెలుగు రాష్ట్రాలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీపై దాని ప్రభావం పడింది. క్యాంపస్‌లో నీటి కొరత ఏర్పడడ గమనించిన యూనివర్సిటీ అధికారులు, దసరా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, సిబ్బందికి అవసరమైన నీటిలో సగం సరఫరా కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దసరా సెలవుల తర్వాత శుక్రవారం నుంచి విద్యాసంస్థలు రీ ఓపెన్ కానున్న నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సెలవులు కంటిన్యూ చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో సుమారు 9 వేల మంది విద్యార్థులు ఉండగా, 1000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. అందరి అవసరాల కోసం రోజుకు సుమారు 20 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, గోదావరి నది నుంచి ఇన్‌టేక్ వెల్ నుంచి రోజుకు కేవలం 10 లక్షల లీటర్ల నీరు అందుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్ చెబుతున్నమాట.
విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయంటూ సర్కిలర్ జారీ చేసింది. 2026-27 సెమిస్టర్-1కి సంబంధించిన సవరించిన అకాడమిక్ షెడ్యూల్ విడుదల చేసింది. నీటి కొరత నేపథ్యంలో దసరా సెలవులను నవంబర్ 17 వరకు పొడగించిన బాసర ట్రిపుల్ ఐటీ యాజమాన్యం తెలిపింది. అకాడమిక్ ఈయర్ లాస్ కాకుండా ఆన్ లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 26 అనగా సోమవారం నుండి ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. నవంబర్ 17 వరకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయని తెలియజేసింది.
ALSO READ: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రీ-యూనివర్సిటీ కోర్సు-PUC ఫస్టయిర్, సెకండ్ ఇయర్ నుంచి ఇంజినీరింగ్ కోర్సుల్లో E1 నుంచి E4 వరకు స్టూడెంట్స్ చదువుతున్నారు. పియుసి-1, 2 విద్యార్థులు నవంబర్ 10 వరకు,E -1 నుండి E4 విద్యార్థులు నవంబర్ 18 న క్యాంపస్ లో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.