E-Paper
Advertisement

సమ్మర్‌లో దోమల బెడదా? కూలర్ ట్యాంకులో ఈ ఆయిల్ వేస్తే సమస్య దూరం

సమ్మర్‌లో దోమల బెడదా? కూలర్ ట్యాంకులో ఈ ఆయిల్ వేస్తే సమస్య దూరం
Advertisement

Cooler tips: సమ్మర్‌లో ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి మనం కూలర్లను ఎక్కువగా వాడుతుంటాం. అయితే.. కొన్ని సార్లు కూలర్ ట్యాంకులో నిల్వ ఉండే నీరు దోమలకు ప్రధాన ఆవాసంగా మారుతుంది. దీని వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దోమల నివారణకు మార్కెట్లో.. దొరికే కెమికల్స్ వాడటం వల్ల శ్వాస కోశ సమస్యలు రావచ్చు. కానీ.. కేవలం రెండు చుక్కల సహజ సిద్ధమైన నూనెను కూలర్ నీటిలో వేయడం ద్వారా దోమల బెడద నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

కూలర్ ట్యాంకులో ఏ నూనె వేయాలి?

Advertisement

సమ్మర్‌లో కూలర్లు మనకు చల్లదనాన్ని ఇస్తాయి కానీ.. వాటి నిర్వహణ సరిగ్గా లేకపోతే, అనారోగ్యానికి కారణమవుతాయి. కూలర్ ట్యాంకులో నీరు నిరంతరం నిల్వ ఉండటం వల్ల దోమలు అందులో గుడ్లు పెడతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి.. కొన్ని రకాల నూనెలు అద్భుతంగా పని చేస్తాయి.

1.వేప నూనె-ప్రకృతి ప్రసాదించిన వరం:
దోమలను తరిమికొట్టడంలో వేప నూనెను మించినది లేదు. దీనిలోని యాంటీ-బ్యాక్టీరియల్,యాంటీ-ఫంగల్ గుణాలు దోమల గుడ్లను నాశనం చేస్తాయి.

Advertisement

ఎలా వాడాలి?: కూలర్ ట్యాంకు నిండా నీరు నింపిన తర్వాత అందులో.. 2 నుంచి 5 చుక్కల వేప నూనె వేయండి.

లాభం: వేప నూనె వాసన దోమలకు పడదు.ఇది నీటి ఉపరితలంపై ఒక పొరలా ఏర్పడి దోమల లార్వా శ్వాస తీసుకోకుండా చేస్తుంది. తద్వారా అవి చనిపోతాయి.

2.యూకలిప్టస్ ఆయిల్ :
యూకలిప్టస్ ఆయిల్‌కు ఉన్న ఘాటైన వాసన దోమలను దరి చేరనీయదు.

ఎలా వాడాలి?: కూలర్ నీటిలో రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేయండి.

అదనపు ప్రయోజనం: ఇది దోమలను తరిమడమే కాకుండా.. కూలర్ నుంచి వచ్చే గాలిని సువాసన భరితంగా మారుస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ గాలి ఉపశమనాన్ని ఇస్తుంది.

3. సిట్రోనెల్లా ఆయిల్ :
చాలా రకాల కాయిల్స్ , దోమల వికర్షకాల్లో సిట్రోనెల్లాను వాడుతుంటారు. ఇది దోమల నుంచి రక్షణ కల్పించడంలో చాలా శక్తివంతమైంది.

ఎలా వాడాలి?: ప్రతి రోజూ నీరు మార్చినప్పుడు లేదా కొత్తగా నీరు నింపినప్పుడు 2 చుక్కల సిట్రోనెల్లా ఆయిల్ వేయండి. ఇది సహజసిద్ధమైన ‘మస్కిటో రిపెల్లెంట్’గా పని చేస్తుంది.

Also Read: స్మార్ట్ ఫీచర్లతో అదిరిపోయే డబుల్ డోర్ ఫ్రిజ్‌లు..ఈ సమ్మర్‌కు ఇవే బెస్ట్ ఛాయిస్!

కూలర్ నిర్వహణలో పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:

కేవలం నూనె వేయడమే కాకుండా.. ఈ కింది జాగ్రత్తలు కూడా పాటించాలి.

నీటిని మార్చడం: వారానికి కనీసం రెండు సార్లు కూలర్ ట్యాంకులోని నీటిని పూర్తిగా తీసేసి.. శుభ్రం చేసి కొత్త నీటిని నింపాలి.

బ్లీచింగ్ పౌడర్: నూనెలు అందుబాటులో లేనప్పుడు, కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల కూడా బ్యాక్టీరియా, దోమల నివారణ జరుగుతుంది.

నెట్ వాడటం: కూలర్ గాలి వచ్చే కిటికీలకు లేదా వెనక భాగంలో దోమలు లోపలికి వెళ్లకుండా సన్నని నెట్ అమర్చుకోవడం మంచిది.

ఎండిపోనివ్వాలి: కూలర్ వాడనప్పుడు (ఉదాహరణకు వర్షాకాలం మొదలైనప్పుడు) ట్యాంకులో చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా ఎండబెట్టాలి.

దోమల వల్ల వచ్చే వ్యాధులు ప్రాణాంతకం కావచ్చు. రసాయనాలతో కూడిన స్ప్రేలు వాడటం కంటే..ఇలాంటి సహజ సిద్ధమైన నూనెలను వాడటం, ఆరోగ్యానికి ఎంతో మేలు. పైన చెప్పిన వేప నూనె లేదా యూకలిప్టస్ నూనెను వాడి చూడండి. ఇది మీ కూలర్ చల్లని గాలితో పాటు సురక్షితమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. ఇల్లు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ చిన్న చిట్కాను తప్పక పాటించండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×