E-Paper
Advertisement

AC Safety Tips: నిద్రలోనే ప్రాణాలు తీస్తున్న ఏసీలు.. మీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలంటే ఈ మార్పులు చేసుకోండి!

AC Safety Tips: నిద్రలోనే ప్రాణాలు తీస్తున్న ఏసీలు.. మీ ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలంటే ఈ మార్పులు చేసుకోండి!
Advertisement

AC Safety Tips: వేసవి అప్పుడే మొదలైంది.. ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే కూలర్లు, ఏసీలను వాడాల్సిందే. కానీ, అదే ఏసీ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. తాజాగా శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో ఏసీ పేలి భారీ అగ్నిప్రమాదం జరగడం భక్తులను, ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినా, ఈ ఘటన ఏసీల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

ఇటీవల ఫరీదాబాద్‌లో జరిగిన విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, వారి పెంపుడు కుక్క ఏసీ పేలుడు కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీలు ఎందుకు పేలుతాయి?

Advertisement

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏసీ పేలుళ్లకు అత్యధికంగా వేడెక్కడం ప్రధాన కారణం. ఎండలు 45 డిగ్రీలు దాటుతున్నప్పుడు, మనం ఏసీని గ్యాప్ లేకుండా గంటల తరబడి వాడటం వల్ల కంప్రెషర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు పాతబడిన వైరింగ్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. చాలా సందర్భాల్లో అనుభవం లేని టెక్నీషియన్లతో సర్వీసింగ్ చేయించడం, నాణ్యత లేని విడిభాగాలు వాడటం లేదా గ్యాస్ రీఫిల్లింగ్‌లో పొరపాట్లు చేయడం వల్ల అంతర్గత ఒత్తిడి పెరిగి యూనిట్ పేలిపోతుంది.

Also Read: ఈ తప్పులు చేస్తున్నారా? జాగ్రత్త, ఫ్రిడ్జ్ పేలిపోతుంది!

పాత ఏసీలతో ముప్పు ఎక్కువ:

Advertisement

ఏసీలోని రిఫ్రిజెరెంట్ గ్యాస్ లీకై గాలితో కలిసినప్పుడు అది మండే స్వభావాన్ని పొందుతుంది. చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా అది పెద్ద పేలుడుకు దారితీస్తుంది. అలాగే, ఇంట్లో చేసుకున్న వైరింగ్ ఏసీ లోడ్‌ను తట్టుకోలేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటే.. విద్యుత్ లోపం ఉన్నట్లు సంకేతం. ముఖ్యంగా పాత ఏసీ యూనిట్లలో ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

⇒ ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయించాలి.
⇒ ఏసీని ఎప్పుడూ 16 లేదా 18 డిగ్రీల వంటి అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉంచకూడదు.
⇒ గంటల తరబడి అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల కంప్రెషర్ వేడెక్కుతుంది.
⇒ బయట ఉండే అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా కనీసం రెండు అడుగుల ఖాళీ ఉండాలి.
⇒ ఏసీ ఉన్నచోట పెయింట్ డబ్బాలు, గ్యాసోలిన్ వంటి మండే వస్తువులను ఉంచకూడదు.

గమనించాల్సిన సంకేతాలు:

⇒ ఏసీ నుంచి శబ్దాలు వచ్చినా, మాడిపోయిన వాసన వస్తున్నా వెంటనే స్విచ్ ఆఫ్ చేసి సర్వీసింగ్ చేపించాలి.
⇒ ఎక్స్‌టెన్షన్ బోర్డులను ఏసీ కోసం అస్సలు వాడకూడదు.
⇒ రాత్రిపూట ఏసీ వాడేటప్పుడు గదిలో కిటికీని తెరవాలి లేదా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
⇒ ఏసీలోని ఫిల్టర్‌లను శుభ్రం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు.
⇒ అలాగే గది బాగా కూల్‌ అయిన తర్వాత ఏసీని ఓ అరగంట పాటు ఆఫ్‌ చేయడం ఉత్తమం.

Also Read: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తేడాలు తెలుసుకోకుండా కొంటే నష్టపోతారు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×