E-Paper
Advertisement

Jubilee Hills Ferrari Car Accident: జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం.. మూడు కార్లను గుద్ది..!

Jubilee Hills Ferrari Car Accident: జూబ్లీహిల్స్ లో  ఫెరారీ కారు బీభత్సం..  మూడు కార్లను గుద్ది..!
Advertisement

Jubilee Hills Ferrari Car Accident: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో ఆదివారం ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుండి మాదాపూర్ వైపు అతివేగంతో వెళ్తున్న ఒక ఫెరారీ కారు (TS07HK 8797) అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు ముందుగా డివైడర్‌ను, ఆపై ఒక విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి గాలిలోకి ఎగిరి పక్క రోడ్డులోకి (దుర్గం చెరువు నుండి చెక్‌పోస్ట్ వైపు వచ్చే దారిలోకి) దూసుకెళ్లింది.

పక్క రోడ్డులోకి దూసుకొచ్చిన ఫెరారీ.. ఎదురుగా వస్తున్న మూడు కార్లను ఒకదాని తర్వాత ఒకటి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా తుక్కు తుక్కు అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. హెడ్ లైట్స్, విండ్ షీల్డ్ చెల్లాచెదురయ్యాయి. కారు ఢీకొన్న ధాటికి కరెంట్ పోల్ పూర్తిగా వంగిపోయి వైర్లు తెగిపడ్డాయి.

Advertisement

ఫెరారీ కారులో డ్రైవర్‌తో పాటు ఒక మహిళ ఉన్నారు. వీరిద్దరికీ తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ కారు వెంకట రాజారెడ్డి అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫెరారీ ఢీకొట్టిన మొదటి కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో కారులో ఉన్న కుటుంబం మాత్రం స్వల్ప గాయాలతో బయటపడటం పెద్ద ఊరట.

జూబ్లీ హిల్స్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. క్రేన్ల సహాయంతో ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నారా లేక కేవలం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: Jodhpur Crime: వివాహానికి కొన్ని గంటల ముందు.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య, కొత్త కోణం ఏంటి?

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×