E-Paper
Advertisement

కూలర్ గాలి చల్లగా రావడం లేదా? మీరు చేస్తున్న పొరపాటే ఇందుకు కారణం!

కూలర్ గాలి చల్లగా రావడం లేదా? మీరు చేస్తున్న పొరపాటే ఇందుకు కారణం!
Advertisement

Air Cooler Tips: సమ్మర్‌లో ఎయిర్ కూలర్లు మనకు చల్లదనాన్ని ఇస్తాయి. అయితే.. చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వల్ల కూలర్ ఉన్నా కూడా గదిలో ఉక్కపోత, ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం కూలర్ వాడే పద్ధతి తెలియకపోవడమే.. ఏసీకి భిన్నంగా పని చేసే కూలర్‌ను మూసి ఉన్న గదిలో వాడటం వల్ల కలిగే నష్టాలు , వాడాల్సిన సరైన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ కూలర్ ఏసీలా చల్లగా మార్చాలంటే ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి.

మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి మిడిల్ క్లాస్ ఇళ్లలో కూలర్ అవసరం. కానీ.. తరచుగా మనం గమనించేది ఏంటంటే.. కూలర్ ఆన్ చేసిన కాసేపటికే గదిలో గాలి బరువుగా మారి, మరకు ఊపిరాడనట్లు అనిపిస్తుంది. చెమట ఆవిరి కాకుండా శరీరం జిగటగా మారుతుంది. దీనికి కారణం కూలర్ గురించి మనకు అవగాహన లేకపోవడమే.

Advertisement

ఏసీకి, కూలర్‌కు తేడా ఏంటి?
ఏసీ గదిలోని గాలినే మళ్ళీ మళ్ళీ చల్లబరుస్తుంది. అందుకే ఏసీ ఉన్నప్పుడు గదిని పూర్తిగా మూసి ఉంచాలి. కానీ కూలర్ అలా కాదు. కూలర్ బయటి నుంచి తాజా గాలిని తీసుకుని, తడిచిన ప్యాడ్‌ల ద్వారా ఆ గాలిని చల్లబరిచి లోపలికి పంపిస్తుంది. ఇది ఎవాపరేటివ్ కూలింగ్ సూత్రంపై పని చేస్తుంది.

మూసి ఉన్న గదిలో కూలర్ వాడితే ఏమవుతుంది?
మీరు గది తలుపులు, కిటికీలు గట్టిగా మూసి కూలర్ వేస్తే.. కూలర్ పంపిస్తున్న తేమ గదిలోనే పేరుకుపోతుంది. గాలి బయటకు వెళ్ళడానికి మార్గం లేకపోవడం వల్ల గదిలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. గాలిలో తేమ పెరిగినప్పుడు మన శరీరంలోని చెమట త్వరగా ఆవిరి కాదు. దీనివల్ల చల్లదనం అందకపోగా, ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది.

Advertisement

చల్లదనం పెరగాలంటే ఏం చేయాలి?

క్రాస్-వెంటిలేషన్: కూలర్ ఎప్పుడూ కిటికీ దగ్గర లేదా బయటి గాలి తగిలేలా ఉంచాలి. కూలర్ నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న కిటికీ లేదా తలుపును కొంచెం తెరిచి ఉంచాలి. దీని వల్ల పాత గాలి బయటకు వెళ్లి.. తాజా చల్లని గాలి లోపలికి వస్తుంది.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడకం: ఒకవేళ గదిలో కిటికీలు లేకపోతే.. కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్ చేయడం వల్ల గదిలోని తేమ బయటకు వెళ్లిపోతుంది.

Also Read: ఏసీని మాటిమాటికీ ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ప్యాడ్‌ల శుభ్రత: కూలర్ గడ్డి లేదా హనీకోంబ్ ప్యాడ్‌లపై దుమ్ము చేరితే గాలి సరిగ్గా రాదు. వీటిని తరచుగా శుభ్రం చేసుకోవాలి.

వాటర్ ట్యాంక్: ట్యాంక్‌లోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నీరు తాజాగా ఉంటేనే.. చల్లదనం ఎక్కువగా ఉంటుంది.

కూలర్ అనేది తాజా గాలి ప్రసరణ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని ఏసీ లాగా మూసి ఉన్న గదిలో వాడితే ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి.. తలుపులు కొద్దిగా తెరిచి ఉంచి, సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేసుకుంటేనే మీరు కూలర్ నుంచి పూర్తి స్థాయి చల్లదనాన్ని పొందగలరు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×