E-Paper
Advertisement

ఏసీని మాటిమాటికీ ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఏసీని మాటిమాటికీ ఆన్, ఆఫ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Advertisement

AC Usage Tips: ఎండలు మండిపోతున్న వేళ ఏసీ కింద కూర్చోవడం ఎంత హాయిగా ఉంటుందో.. నెలాఖరున వచ్చే కరెంటు బిల్లు చూస్తే అంత భయమేస్తుంది. బిల్లును తగ్గించుకోవాలనే తాపత్రయంతో చాలా మంది గది చల్లబడగానే ఏసీని ఆఫ్ చేసి, మళ్ళీ చెమటలు పట్టగానే ఆన్ చేస్తూ ఉంటారు. ఇలా పదే పదే చేయడం వల్ల కరెంటు ఆదా అవుతుందని వారు భావిస్తారు. కానీ.. వాస్తవానికి ఈ పద్ధతి ఏసీపై భారం పెంచడమే కాకుండా.. మీ జేబుకు చిల్లు పెట్టేలా.. ఎక్కువ  కరెంట్ బిల్లులకు దారితీస్తుంది. దీని వెనక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు చూద్దాం.

ఏసీని పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల కలిగే నష్టాలు:

Advertisement

1. కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి:
ఏసీలో కీలకమైన భాగం ‘కంప్రెసర్.మీరు ఏసీని ఆన్ చేసిన ప్రతిసారీ, కంప్రెసర్ చల్లబరచడానికి ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. మీరు పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల కంప్రెసర్ తరచూ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. దీని వల్ల కంప్రెసర్ త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి కంప్రెసర్ పాడైతే.. దాన్ని మార్చడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది.

2. కరెంట్ బిల్లు పెరగడం:
“ఏసీ ఆఫ్ చేస్తే కరెంటు సేవ్ అవుతుంది కదా?” అనే సందేహం మీకు రావచ్చు. కానీ.. మీరు ఏసీ ఆఫ్ చేసినప్పుడు గది ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. మళ్ళీ ఆన్ చేసినప్పుడు.. ఆ పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఏసీ రెట్టింపు వేగంతో.. ఎక్కువ పవర్ ఉపయోగించి పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ఆదా చేద్దామనుకున్న కరెంటు కంటే..ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది.

Advertisement

3. తేమ నియంత్రణలో ఇబ్బందులు:
ఏసీ కేవలం గాలిని చల్లబరచడమే కాదు. గదిలోని తేమను కూడా తగ్గిస్తుంది. మీరు ఏసీని ఆఫ్ చేసిన వెంటనే.. గదిలోకి తేమ మళ్ళీ చేరుతుంది. మీరు పదే పదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల గదిలో ఉక్కపోతగా అనిపిస్తుంది తప్ప.. హాయిగా ఉండదు. దీని వల్ల ఏసీ తన పూర్తి సామర్థ్యంతో పని చేయలేక పోతుంది.

4. ఇన్వర్టర్ ఏసీల ప్రాముఖ్యత:
ఒకవేళ మీరు వాడుతున్నది ‘ఇన్వర్టర్ ఏసీ’ అయితే.. దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇన్వర్టర్ ఏసీలు గది చల్లబడగానే పూర్తిగా ఆఫ్ అవ్వకుండా.. కంప్రెసర్ వేగాన్ని తగ్గించుకుని తక్కువ పవర్‌తో నడుస్తూ ఉంటాయి. ఇది కరెంట్ ఆదా చేయడానికి సరైన పద్ధతి.

సరైన ఏసీ వాడకం కోసం చిట్కాలు:

సరైన ఉష్ణోగ్రత సెట్ చేయండి: ఏసీని 24 ∘C నుంచి 26∘C వద్ద ఉంచడం ఆరోగ్యానికి, జేబుకు మంచిది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

టైమర్ వాడండి: రాత్రిపూట ఏసీ వాడేటప్పుడు టైమర్ సెట్ చేసుకోండి. దీని వల్ల గాఢ నిద్రలో ఉన్నప్పుడు గది మరీ చల్లగా అవ్వకుండా.. ఏసీ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది.

సీలింగ్ ఫ్యాన్ ఉపయోగించండి: ఏసీతో పాటు తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ వేయడం వల్ల చల్లని గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది. దీని వల్ల ఏసీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు.

గదిని ఇన్సులేట్ చేయండి: కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచండి. పరదాలు వాడటం వల్ల బయట వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది.

ఏసీని పదేపదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల సౌకర్యం కంటే.. సమస్యలే ఎక్కువ. కరెంటు బిల్లు తగ్గించుకోవాలంటే.. ఏసీని మితమైన ఉష్ణోగ్రత వద్ద నిరంతరాయంగా నడపడమే బెస్ట్. క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయించడం వల్ల అది ఎక్కువ కాలం మన్నుతుంది. కరెంట్ వాడకం కూడా తగ్గుతుంది. ఈ వేసవిలో స్మార్ట్‌గా ఆలోచించి, మీ ఏసీని జాగ్రత్తగా వాడుకోండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×