E-Paper
Advertisement

Airtel Vs Jio: జియోపై ఎయిర్‌టెల్ విజయం? రూ.200 బడ్జెట్ ప్రిపెయిడ్‌ ప్లాన్‌లో అద్భుత బెనిఫిట్స్

Airtel Vs Jio: జియోపై ఎయిర్‌టెల్ విజయం? రూ.200 బడ్జెట్ ప్రిపెయిడ్‌ ప్లాన్‌లో అద్భుత బెనిఫిట్స్
Advertisement

Airtel Vs Jio| ఇండియన్ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మధ్య చాలా కాలంగా గట్టి పోటీ నడుస్తోంది. ఎప్పుడూ ఈ రెండు కంపెనీలు బడ్జెట్ యూజర్ల కోసం తరచూ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ పోటాపోటీగా లాంచ్ చేస్తుంటాయి. తరుచూ జియో ముందంజలో ఉంటుంది. చాలా తక్కువ ధరలో ఎక్కువ డేటా జియో ఇస్తుంది. అయితే ఎయిర్‌టెల్ కొన్ని ప్లాన్స్‌లో దీర్ఘకాలిక విలువను బాగా ఇస్తుంది. అలాంటి ఒక బెస్ట్ ప్లాన్ ఎయిర్‌టెల్ రూ.199 రీఛార్జ్.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్‌టెల్ ప్లాన్ ధర జియో రూ.198 ప్లాన్ కంటే కేవలం ఒక రూపాయి ఎక్కువ. కానీ ఎయిర్‌టెల్ ఇందులో చాలా బెటర్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇందులో అతి పెద్ద బెనిఫిట్ ఎక్కువ వాలిడిటీ. జియో ప్లాన్ కంటే దాదాపు రెండింతలు ఎక్కువ వాలిడిటీ. నెలలో తక్కువ సార్లు రీఛార్జ్ చేయాలనుకునే వాళ్లకు ఇది చాలా బాగుంటుంది.

Advertisement

ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ (అన్ని నెట్‌వర్క్‌లకు) ఉంటుంది. రోజుకు పెద్ద సంఖ్యలో SMSలు కూడా పంపవచ్చు. అలాగే డిజిటల్ బోనస్‌గా చాలా మంచి ఆఫర్ ఉంది.

ఉచితంగా పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌తో పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.17,000 ఖర్చు అవుతుంది. పెర్‌ప్లెక్సిటీ ప్రో అనేది చాలా పవర్‌ఫుల్ AI సెర్చ్, రీసెర్చ్ టూల్. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్, కంటెంట్ రైటర్లకు ఇది చాలా ఉపయోగకరం. ఈ AI సబ్‌స్క్రిప్షన్ వల్ల ఈ ప్లాన్ విలువ ఇంకా ఎక్కువ అవుతుంది. జియో రూ.198 ప్లాన్‌లో అలాంటి ప్రీమియం AI సర్వీస్ ఏమీ లేదు.

జియో రూ.198 ప్లాన్ ఏమిటి?

Advertisement

జియో రూ.198 ప్లాన్ డేటా ఎక్కువగా వాడే వాళ్లకు చాలా పాపులర్. ఇది 14 రోజుల వాలిడిటీ ఇస్తుంది. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా (మొత్తం 28GB) ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఇస్తారు. జియోటీవీ ఎంటర్‌టైన్‌మెంట్, జియో AI క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటాయి.

ఎయిర్‌టెల్ vs జియో: ఏది బెటర్?

ఎయిర్‌టెల్ ప్లాన్ ఎక్కువ వాలిడిటీ, ప్రీమియం డిజిటల్ సర్వీసెస్ మీద దృష్టి పెడుతుంది. జియో ప్లాన్ రోజుకు ఎక్కువ డేటా, తక్కువ వాలిడిటీ మీద దృష్టి పెడుతుంది. నెలలో తక్కువ రీఛార్జ్‌లు చేయాలనుకునేవాళ్లు ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవాళ్లు జియో రూ.198 తీసుకోవచ్చు. కానీ ఎయిర్‌టెల్‌లోని ఉచిత AI సబ్‌స్క్రిప్షన్ వల్ల విలువ చాలా ఎక్కువ.

ఫైనల్ విన్నర్ ఎవరు?

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ దీర్ఘకాలిక విలువలో జియో రూ.198 కంటే బెటర్‌ ఆప్షన్‌గా ఉంది. స్థిరత్వం, ప్రీమియం బెనిఫిట్స్, తక్కువ రీఛార్జ్ ఆలోచనలు కావాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచి ఆప్షన్.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×