E-Paper
Advertisement

షాపింగ్ ప్రియులు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్.. Amazon Alexa AI వచ్చేసింది, ఇక డీల్స్ వెతకడం వెరీ ఈజీ!

షాపింగ్ ప్రియులు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్.. Amazon Alexa AI వచ్చేసింది, ఇక డీల్స్ వెతకడం వెరీ ఈజీ!
Advertisement

Amazon Alexa AI: ఆన్‌లైన్ షాపింగ్ అంటే గంటల తరబడి వెతకడం, రేట్లు పోల్చి చూడటం.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మనందరి కోసం ఓ పర్సనల్ షాపింగ్ ఎక్స్‌పర్ట్ రాబోతున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తమ వాయిస్ అసిస్టెంట్ ‘Alexa’ను సరికొత్త AI టెక్నాలజీతో అప్‌గ్రేడ్ చేసింది. ఇది కేవలం పాటలు పాడటమో, అలారాలు పెట్టడమో మాత్రమే కాకుండా.. మనకు నచ్చిన వస్తువులను తక్కువ ధరకు ఎంచుకోవడంలో కూడా సహాయపడుతుంది. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే భారత్‌లోకి రానుంది.

స్మార్ట్ షాపింగ్ అసిస్టెంట్:

సాధారగా మనం ఏదైనా వస్తువు కొనాలంటే సెర్చ్ బార్‌లో టైప్ చేసి వందల కొద్దీ రిజల్ట్స్ చూస్తుంటాం. కానీ కొత్త అలెక్సా షాపింగ్ అసిస్టెంట్ అలా కాదు. ఒక అనుభవజ్ఞుడైన సేల్స్ పర్సన్ లాగా మీతో మాట్లాడుతుంది. ఉదాహరణకు, “నాకు బడ్జెట్ ధరలో మంచి కెమెరా ఉన్న ఫోన్ కావాలి” అని మీరు అడిగితే, అది మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆప్షన్లను పోల్చి చూపిస్తుంది. స్పెసిఫికేషన్ల మధ్య తేడాలను వివరిస్తూ, మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన సలహాలిస్తుంది.

ధరల వేటలో తోడుగా:

Advertisement

చాలామంది వస్తువుల ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తుంటారు. ఈ సమస్యకు అలెక్సా చక్కని పరిష్కారం చూపుతోంది. మీరు కొనాలనుకునే వస్తువును విష్‌లిస్ట్‌లో పెట్టుకుంటే, దాని ధర తగ్గిన వెంటనే అలెక్సా మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. ప్రత్యేక ఆఫర్లు లేదా డీల్స్ ఉన్నప్పుడు కూడా అలర్ట్ చేస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా.. కష్టపడి సంపాదించిన డబ్బు కూడా ఆదా అవుతుంది.

Also Read: 7000mAh భారీ బ్యాటరీతో మోటో సెన్సేషన్.. మిడిల్‌క్లాస్ యూజర్లకు పండగే!

సహజమైన సంభాషణ:

Advertisement

ఈ ఏఐ అసిస్టెంట్ ప్రత్యేకత ఏంటంటే.. దీనికి ప్రత్యేకమైన కీవర్డ్స్ అవసరం లేదు. మనం మనుషులతో ఎలా మాట్లాడతామో అలాగే అలెక్సాతో మాట్లాడవచ్చు. ‘గత నెలలో నేను కొన్న ఛార్జర్ ఏది?’ లేదా ‘ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ వాచ్ ఏది?’ అని సహజంగా అడిగినా అది వెంటనే అర్థం చేసుకుని సమాధానం ఇస్తుంది. ఈ ఫీచర్ వల్ల టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారు కూడా చాలా సులభంగా ఆన్‌లైన్ షాపింగ్ చేయవచ్చు.

షాపింగ్ లో కొత్త మార్పులు:

అమెజాన్ తీసుకొచ్చిన ఈ మార్పు ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచంలోనే కొత్త విప్లవానికి నాంది పలకనుంది. కేవలం స్క్రోలింగ్ చేయడం కంటే.. ఒక అసిస్టెంట్ సాయంతో నిర్ణయాలు తీసుకోవడం వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తుంది. గూగుల్, వాల్‌మార్ట్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్లను త్వరలో తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, భవిష్యత్తులో మన షాపింగ్ అనుభవం పూర్తిగా ఏఐ చుట్టూనే తిరగబోతోందని ఈ అప్‌డేట్ స్పష్టం చేస్తోంది.

Also Read: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.25వేల లోపు 4K QLED టీవీలు.. శాంసంగ్, షావోమీల మోడల్స్‌పై కళ్లుచెదిరే ఆఫర్స్!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×