E-Paper
Advertisement

Smart Watch At Rs 999: ఆన్‌లైన్ మార్కెట్లో అమెజాన్ సేల్ హైలైట్.. జస్ట్ రూ.999కే ఫైర్-బోల్ట్ వాచ్

Smart Watch At Rs 999: ఆన్‌లైన్ మార్కెట్లో అమెజాన్ సేల్ హైలైట్.. జస్ట్ రూ.999కే ఫైర్-బోల్ట్ వాచ్
Advertisement

Smart Watch At Rs 999: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఎక్కువగా నమ్మకం ఉన్న ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్‌‌. ప్రతిరోజూ కొత్త ఆఫర్స్, తక్కువ ధరలు, వేగంగా వచ్చే డెలివరీ కారణంగా చాలా మంది ముందుగా చూసేది ఇదే. ముఖ్యంగా వాచ్‌లు, మొబైల్ యాక్సెసరీస్, గాడ్జెట్‌ల మీద అమెజాన్‌ పెట్టే ఆఫర్లు వెంటనే ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఫైర్-బోల్ట్ టాక్ వాచ్‌ కూడా అలాంటి కేటగిరీలోకి వస్తుంది. ఈ వాచ్ ధర ఎంత తగ్గింది? అసలైన ధర ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జస్ట్ ఈ వాచ్‌ రూ.999 ధరలో..

Advertisement

ఇప్పుడు ఈ వాచ్‌ రూ.999 ధరలో ఇది బడ్జెట్‌ రేంజ్‌లో ఉపయోగించడానికి సరిగ్గా సరిపోయే వాచ్‌. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్‌, మెటల్ బాడీ, మంచి బ్రైట్నెస్ స్క్రీన్ ఈ మూడు కారణాల వల్ల ఈ ధరలో దీన్ని తీసుకోవడం ఓకే అనిపిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌ ఇచ్చిన ఈ ఆఫర్‌లో ధర తగ్గి ఉండటం వల్ల బేసిక్ వాచ్‌గా వాడాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉన్న ఆప్షన్‌గా మారింది.

వాచ్‌ డిజైన్ మెటల్‌ బాడీ లుక్స్

Advertisement

ఈ వాచ్‌ డిజైన్ విషయానికి వస్తే మెటల్‌ బాడీ ఉండటం వల్ల లుక్స్ బాగుంటాయి. చేతికి వేసుకున్నప్పుడు చవకగా కనిపించదు. ముందున్న స్క్రీన్‌ 1.39 ఇంచుల టిఎఫ్‌టి ఫుల్ టచ్ డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లేలో 650 నిట్స్ బ్రైట్నెస్ ఉంది, అంటే బయట సూర్యరశ్మిలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి చిన్న గీతలు తక్కువగా పడతాయి.

బ్లూటూత్ కాలింగ్‌

ఈ వాచ్‌ హైలైట్ ఫీచర్‌ అంటే బ్లూటూత్ కాలింగ్‌. ఫోన్‌ని బయటకు తీసే పని లేకుండా నేరుగా వాచ్ నుంచే మాట్లాడొచ్చు. లోపల చిన్న స్పీకర్, మైక్ ఇచ్చారు. కాంటాక్ట్స్, రీసెంట్ కాల్స్ అన్నీ వాచ్‌లోనే కనిపిస్తాయి. ఇంట్లో ఉన్నప్పుడు, రోడ్డుపై చిన్న చిన్న కాల్స్ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది.

Also Read: IRCTC Shri Jagannath Yatra: ఐఆర్‌సిటిసి ప్రత్యేక శ్రీ జగన్నాథ యాత్ర .. కేవలం రూ.20,210తో భక్తి ప్రయాణం ప్రారంభం

120 స్పోర్ట్స్‌ మోడ్‌

ఫిట్‌నెస్ విషయంలో 120 స్పోర్ట్స్‌ మోడ్‌లు ఉన్నాయి. రోజులో ఎంత నడిచారు, చాలా బేసిక్ కాలరీ ఖర్చు ఎంత, హార్ట్‌రేట్ ఎంత ఇవన్నీ సాధారణ స్థాయిలో రికార్డ్ చేస్తుంది. ఇవాళ్టి బడ్జెట్ వాచ్‌లు ఇచ్చే ట్రాకింగ్ ఈ స్థాయిలోనే ఉంటుంది. నిద్ర ట్రాకింగ్ కూడా ఉంటుంది కానీ అది పూర్తిగా అక్యురేట్‌‌గా ఉంటుందని ఆశించరాదు. ఈ వాచ్‌లో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది. చిన్న ఆదేశాలు ఇవ్వడానికి, వాతావరణం తెలుసుకోవడానికి, మొబైల్‌లోని చిన్న చిన్న పనులను చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీకు వచ్చే నోటిఫికేషన్స్, మెసేజ్ అలర్ట్స్, అలారం అన్నీ ఒకే దాంట్లో కనిపిస్తాయి.

ఫుల్ చార్జింగ్ జస్ట్ మూడు గంటలు

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మూడు రోజులు అలా చెప్పినా, మీరు కాన్స్టెంట్ కాలింగ్ వాడితే రోజు రోజుకే చార్జ్ అవుతుంది. ఫుల్ చార్జ్ కావడానికి మూడు గంటలు పడుతుంది. వాచ్‌ పై వర్షం పడినప్పుడు లేదా చేతులు కడుగుతున్నప్పుడు తగిలే నీటి చినుకులు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది సేఫ్.

ఆఫర్ ఎప్పటి వరకు?

ఇన్ని విషయాలు చూసుకుంటే 999 ధరలో ఇది ఓకే బడ్జెట్ వాచ్‌. ప్రత్యేకంగా బ్లూటూత్ కాలింగ్, మెటల్ బాడీ, మంచి బ్రైట్నెస్ స్క్రీన్ ఈ మూడు కారణాలకే ఈ ధరలో తీసుకోవచ్చు. కానీ ఇది 11,999 విలువ ఉన్న ప్రీమియం వాచ్‌ ఇంత తక్కువ ఆఫర్‌లో రావడం వాచ్ లవర్స్‌కి పండగే.. బేసిక్ యూజ్‌, కాలింగ్ కోసం ఒక్క వాచ్‌ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్. కానీ ఎప్పటి వరకు ఈ ఆఫర్ ఉంటుందో కొద్ది రోజులు మాత్రమే అనిపిస్తుంది. అందుకే ఆఫర్ ఉన్నప్పుడే తీసుకుంటే వినియోగదారులకు మంచి అవకాశం.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×