E-Paper
Advertisement

Mega Vs Nandamuri: ఈసారి మెగాస్టార్ దే పై చేయిలా కనిపిస్తుందే.. బాలయ్య పరిస్థితి ఏంటో ..?

Mega Vs Nandamuri: ఈసారి మెగాస్టార్ దే పై చేయిలా కనిపిస్తుందే.. బాలయ్య పరిస్థితి ఏంటో ..?

Mega Vs Nandamuri: ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఒకేసారి రావడం లేదు. సంక్రాంతి రేసులో చిరు , బాలయ్య పోటీకి దిగుతారేమో అనుకున్నారు. కానీ, జస్ట్ మిస్ లో తప్పిపోయింది. ఈసారి బాలయ్య కొద్దిగా ముందు వస్తున్నాడు.. చిరంజీవి సంక్రాంతి రేసులో దిగుతున్నాడు. అయితే ప్రస్తుతం బాలయ్య కన్నా చిరునే టాప్ లో ఉన్నాడు అనే మాట వినిపిస్తుంది. ఎందుకు అంటే అఖండ 2 బిజినెస్ కన్నా మన శంకర వరప్రసాద్ గారు బిజినెసే బాగా గట్టిగా జరిగిందని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే అఖండ లాంటి సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెల్సిందే. కరోనా తరువాత అభిమానులను థియేటర్ వరకు తీసుకొచ్చిన సినిమా అంటే అఖండ అని చెప్పాలి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో బిజినెస్ అవుతుందో అనుకున్నారు.

సింగిల్ సినిమాగా చెప్పాలంటే అఖండ 2 కి భారీగానే బిజినెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 120 కోట్ల బిజినెస్ చేసింది. నిజాం – 42 కోట్లు, ఆంధ్రా- 55 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 8 కోట్లు రాగా.. ఓవర్సిస్ లో 15 కోట్లు పలికింది. అఖండ విజయం, బోయపాటి – బాలయ్య కాంబో, థమన్ మ్యూజిక్ అనేసరికి అభిమానులు కూడా సినిమాపై మంచి అంచనాలానే పెట్టుకున్నారు. అయితే అఖండ 2 ఈసారి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం బాలయ్య ప్రమోషన్స్ చేయకపోవడం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన జాజికాయ సాంగ్ అస్సలు ఎందుకు పెట్టారు.. థమన్ రొటీన్ రొట్ట కొట్టుడు అని పెదవి విరిచారు. ట్రైలర్ లో కూడా సేమ్ కథ, బాలయ్య యాక్షన్ అంతగా సెట్ అవ్వలేదని మాటలు వచ్చాయి. వీటిని దాటుకొని బాలయ్య అఖండ తాండవం రూ. 120 కోట్లను రాబట్టగలదా అంటే కష్టమే అని చెప్పాలి.

మొదటి షో ఎలాంటి నెగిటివిటీ కానీ, మిక్స్డ్ టాక్ కానీ లేకపోతే తప్ప అఖండ 2 అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బాలయ్యతో పోలిస్తే చిరంజీవికి ఎక్కువనే బిజినెస్ అయ్యిందని చెప్పొచ్చు. సంక్రాంతి బరిలో దిగుతున్న  చిరు మన శంకరవరప్రసాద్ గారు బిజినెస్  మొత్తం కలిపి రూ. 160 – 175 కోట్లు అయ్యిందని టాక్. అందులో  నిజాం – 40 కోట్లు, ఆంధ్రా- 70 కోట్లు, సీడెడ్- 25 కోట్లు  రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు రాగా.. ఓవర్సిస్ లో 18 కోట్లు వచ్చాయి. ఇది చాలా అంటే చాలా మంచి బిజినెస్. చిరు చివరి సినిమా భోళా శంకర్ ఏ రేంజ్ డిజాస్టర్ అందుకుందో అందరికీ తెల్సిందే. గతేడాది చిరు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ మధ్యలో విశ్వంభర వస్తుంది అనుకుంటే అది కూడా వెనక్కి పోయింది.

ఇక ఇప్పుడు సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతోనే మల్లి చిరు తెరపై కనిపిస్తున్నాడు. అందులోనూ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా కావడంతో మరింత హైప్ పెరిగింది. అంతేనా ప్రమోషన్స్ లో అనిల్ ని కొట్టేవారే లేరు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ చేసినంత రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో సినిమాపై పాజిటివిటీ పెరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం చిరు ఈజీగా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతాడని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి మాత్రం  బాలయ్య కన్నా చిరు డామినేషనే ఎక్కువ కనిపిస్తుంది. మరి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది చూడాలి.

Related News

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Big Stories

×