E-Paper
Advertisement

కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు

కొత్త ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ సేల్‌లో ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లపై భారీ తగ్గింపు
Advertisement

Triple door fridge offers: ఇంట్లో వంటగది లుక్ మారుతున్న కొద్దీ, మనకు కావలసిన వస్తువులను కూడా అప్డేట్ చేస్తుంటాం . అందులోనూ రిఫ్రిజిరేటర్ అనేది ప్రతి ఇంటికి అత్యంత ముఖ్యమైంది. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలన్నా, కూరగాయలు ఎప్పటికీ తాజాగా ఉండాలన్నా మంచి ఫ్రిడ్జ్ ఉండాల్సిందే. సాధారణ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌ల కంటే.. ఇప్పుడు మార్కెట్‌లో ‘ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌ల’హవా నడుస్తోంది. వేర్వేరు కంపార్ట్‌మెంట్లు ఉండటం వల్ల ఫుడ్ ఐటమ్స్ విడివిడిగా ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుత కాలానికి తగినట్టుగా ఇవి కిచెన్‌కు మంచి లుక్ ఇవ్వడంతో పాటు, కరెంట్ బిల్లును కూడా ఆదా చేసే ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తున్నాయి.

ప్రస్తుతం షాపింగ్ లవర్స్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2026’జరుగుతోంది. ఈ పండగ సీజన్ సేల్‌లో భాగంగా కస్టమర్లు తమ డ్రీమ్ హోమ్ అప్లయన్సెస్ పై ఊహించని డిస్కౌంట్లు పొందొచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ , లార్జ్ అప్లయన్సెస్ కేటగిరీలో ధరలు అమాంతం తగ్గడంతో కస్టమర్లు ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అదనం కావడంతో ఫ్రిడ్జ్ కొనడం ఇప్పుడు మరింత ఈజీ అని చెప్పొచ్చు.

టాప్ ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ మోడల్స్ , వాటి ఫీచర్లు :

1.Bosch 303L Triple Door Refrigerator:

Advertisement

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది బాష్ బ్రాండ్ గురించే. అద్భుతమైన జర్మన్ టెక్నాలజీతో వస్తున్న ఈ 303 లీటర్ల త్రీ-డోర్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు పెర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని వేరియో ఇన్వెర్టర్ కంప్రెసర్ సౌండ్ లేకుండా పని చేస్తూ తక్కువ కరెంట్ తో పనిచేస్తుంది. అలాగే కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి విటాఫ్రెష్ ఆప్షన్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సేల్‌లో ఈ మోడల్ ధర సుమారు రూ.37,490 వరకు అందుబాటులో ఉంది. దీనికి తోడు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.

2.Haier 445L Bottom Freezer Refrigerator:

పెద్ద ఫ్యామిలీలు లేదా ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వారి కోసం హైయర్ బ్రాండ్ ఈ అద్భుతమైన ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 445 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ ఫ్రిడ్జ్ బాటం ఫ్రీజర్ (కింది భాగంలో ఫ్రీజర్) డిజైన్‌తో వస్తుంది. దీని వల్ల పదే పదే వంగాల్సిన పని లేకుండా పై భాగంలో ఉండే ఆహార పదార్థాలను ఈజీగా తీసుకోవచ్చు. మల్టిపుల్ కన్వర్టబుల్ మోడ్స్ ఉన్న ఈ ఫ్రిడ్జ్ ధర అమెజాన్ సేల్‌లో సుమారు రూ. 47,990 వరకు ఉంది. సెలవుల ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్లు పోను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Advertisement

సాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ కంపెనీలు కూడా తమ త్రీ-డోర్ , మల్టిపుల్ డోర్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్‌లపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సాంసంగ్ అందిస్తున్న ఫ్రిడ్జ్‌లు స్మార్ట్ కనెక్టివిటీ, కన్వర్టబుల్ మోడ్స్‌తో వస్తుండగా, ఎల్జీ ఫ్రిడ్జ్‌లు స్టేబులైజర్ లేకుండా, డ్యూయల్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కొనే వారికి అదనంగా 10 శాతం వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తోంది.

Also Read: ఇక నుంచి మీ కిచెన్ పని ఈజీ..డిష్ వాషర్‌పై అదిరిపోయే డిస్కౌంట్!

అమెజాన్ సేల్‌లో ఫ్రిడ్జ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1.మీ ఇంట్లో ఉండే సభ్యుల సంఖ్యను బట్టి సరైన కెపాసిటీ (లీటర్లు) ఉన్న ఫ్రిడ్జ్‌ను ఎంచుకోండి.

2.ఎనర్జీ రేటింగ్ (స్టార్ రేటింగ్) ఎక్కువగా ఉన్న మోడల్స్ ఎంచుకుంటే.. కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది.

3.కొనే ముందే అమెజాన్ పేజీలో అందుబాటులో.. ఉన్న బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లను చెక్ చేయడం మర్చిపోవద్దు.

మీరు గనక కొత్త ఫ్రిడ్జ్ కొనాలని ఆలోచిస్తుంటే.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కంటే మంచి అవకాశం మళ్లీ రాదు. తక్కువ బడ్జెట్‌లో.. లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్‌ను ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే సరైన టైం. స్టాక్ అయిపోకముందే మీకు నచ్చిన మోడల్‌ను ఆర్డర్ చేయండి!

Related News

ఇక వాట్సప్ చాట్ నుంచే డైరెక్ట్‌గా రీల్స్ షేరింగ్.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది మామా!

అమెజాన్ సేల్ ధమాకా..రూ.10వేలలోపే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు!

కొత్త ఫోన్ కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి.. ఎన్నేళ్ల వరకు విడిభాగాలు దొరుకుతాయంటే?

వాట్సప్, టెలిగ్రామ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. జనవరి 1 నుంచి ఆ రూల్స్ నిజమేనా? కేంద్రం క్లారిటీ!

యాపిల్, శాంసంగ్‌లకు దీటుగా స్వదేశీ మొబైల్ బ్రాండ్.. కేంద్రం సంచలన ప్రకటన!

మీ బ్యాంక్ అకౌంట్‌లో AI ఏజెంట్లు! పొరపాటున పాస్‌వర్డ్ ఇస్తే డబ్బులు మాయమేనా?

ఐఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అమెజాన్ సేల్‌లో ఈ 4 మోడళ్లలో ఏది బెటరో తెలుసుకోండి!

Big Stories

Advertisement
×