E-Paper
Advertisement

6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!

6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!
Advertisement

India’s Longest Train Route: దేశాన్ని రైలు కిటికీలోంచి చూస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే వారికి వివేక్ ఎక్స్‌ ప్రెస్ ఓ స్పెషల్ ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సాగే ఈ రైలు ప్రయాణం సుమారు 4,188 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 75 గంటల పాటు సాగే ఈ ప్రయాణం పలు ప్రాంతాలు, సంస్కృతులు, భాషలు, ఆహారపు అలవాట్లను పరిచయం చేస్తుంది. తాజాగా ఓ ప్రయాణికుడు ఈ సుదూర ప్రయాణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ రైల్వే రూట్ మరోసారి చర్చల్లోకి వచ్చింది.

దేశంలోనే సుదూర రైలు ప్రయాణం

దిబ్రూగఢ్‌-కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ ప్రెస్ దూరం పరంగా దేశంలోనే అత్యంత పొడవైన రైలు సర్వీసుగా గుర్తింపు పొందింది.  ఈ ప్రయాణం పూర్తి కావడానికి ఏకంగా మూడు రోజుల సమయం పడుతుంది. మార్గమధ్యంలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, రద్దీ నగరాలు, చిన్న పట్టణాలు, పచ్చని పొలాలు ఈ ప్రయాణాన్న మరింత అందంగా మార్చుతాయి.

తేయాకు తోటల నుంచి గడ్డి మైదానాల వరకు..

Advertisement

ఈ ప్రయాణం అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ప్రారంభమవుతుంది. తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం నుంచి రైలు గౌహతి మీదుగా పశ్చిమ బెంగాల్ వైపు కొనసాగుతుంది. ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ ఈశాన్య భారతం  పచ్చని ప్రకృతి దృశ్యాలు, గ్రామీణ ప్రాంతాలు, విస్తారమైన పొలాలు ఆకట్టుకుంటాయి. న్యూ జల్పైగురి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లు ఈ మార్గంలో ఉంటాయి.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా..   

దక్షిణ దిశగా ప్రయాణించే రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల గుండా వెళ్తుంది. భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలు ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఒక్కో రాష్ట్రంలో భాష, ఆహారం, సంప్రదాయాలు, జీవనశైలిలో కనిపించే మార్పులను ప్రయాణికులను అలరిస్తాయి. అయితే, రైలు నుంచి కనిపించే దృశ్యాలు ప్రయాణ సమయం, మార్గంలోని ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.

కన్యాకుమారితో ప్రయాణానికి ముగింపు

Advertisement

ప్రయాణం దక్షిణం వైపు సాగేకొద్దీ కేరళలోని పచ్చని ప్రాంతాలు, కొబ్బరి చెట్లు, పట్టణ పరిసరాలు కనిపిస్తాయి. అనంతరం తమిళనాడులోకి ప్రవేశించిన రైలు చివరకు కన్యాకుమారికి చేరుకుంటుంది. సముద్ర తీరాలు, వివేకానంద రాక్ మెమోరియల్, సూర్యోదయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన కన్యాకుమారి ఈ సుదీర్ఘ యాత్రకు చివరి మజిలీగా నిలుస్తుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడమే కాదు.. దేశంలోని భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకే జర్నీలో ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకునే వారికి అరుదైన అవకాశం కూడా.

Read Also: 24 గంటల ప్రయాణం ఇక 16 గంటల్లోనే.. రెండో వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

Tags

Related News

ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు ఈజీగా రీఫండ్ అవుతాయి!

ఏపీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

24 గంటల ప్రయాణం ఇక 16 గంటల్లోనే.. రెండో వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

రైలు ప్రయాణంలో విండో సీటు కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి

మారనున్న పానగల్ ఆలయ రూపురేఖలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

రైలు ప్రయాణంలో మీ సీటు వేరే వ్యక్తి ఆక్రమించారా? గొడవ పడొద్దు.. వెంటనే ఈ పని చేయండి

Big Stories

Advertisement
×