E-Paper
Advertisement

Budget 5G Phones: గెట్ రెడీ.. తక్కువ ధరకే 5G ఫోన్లు.. మనందరికోసమే!

Budget 5G Phones: గెట్ రెడీ.. తక్కువ ధరకే 5G ఫోన్లు.. మనందరికోసమే!
Advertisement

Budget 5G Phones: అమోజాన్ ఇండియా స్మార్ట్‌ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ డీల్‌లో మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో 5G మొబైల్స్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. Amazon 5G సూపర్‌స్టోర్‌లో మీరు టాప్ బ్రాండెడ్ కంపెనీల నుంచి 5G ఫోన్‌లను రూ. 10,000 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లపై బలమైన బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్‌లో మీరు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

POCO M6 Pro 5G
4 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ పోకో ఫోన్ ధర రూ.9499. మీరు దీన్ని దాదాపు రూ. 475 క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. 461 రూపాయల ప్రారంభ EMI వద్ద కూడా ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.9 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఫోన్‌లో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.

Advertisement

Also Read: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

Redmi 13C 5G
4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ. 10,499 సేల్‌లో అందుబాటులో ఉంది. ఫోన్‌పై రూ.1,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఈ డిస్కౌంట్ కోసం మీరు SBI లేదా ICICI కార్డ్ ఉపయోగించాలి. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లో మీరు రూ. 525 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.9,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. మీరు దీన్ని రూ. 509 ప్రారంభ EMIతో  కొనుగోలు చేయవచ్చు. ఈ Redmi ఫోన్ 6.74 అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Advertisement

Samsung Galaxy M15 5G
ఈ సామ్‌సంగ్ ఫోన్ సేల్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. మీరు 4 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ని సేల్‌లో రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు HDFC లేదా ICICI కార్డ్ ద్వారా చెల్లించాలి. ఈ సామ్‌సంగ్ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.12,300 వరకు తగ్గింపు లభిస్తుంది. ఫోన్‌పై రూ.650 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు ఫోన్‌లో 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ 6000mAh.

Also Read: మతిపోతుంది భయ్యా.. మోటో నుంచి కొత్త ఫోన్.. ఇది చాలా స్పెషల్!

Nokia G42 5G
6 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ Amazon 5G స్టోర్‌లో రూ. 10,499కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.525 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. మీరు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ. 509 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌సై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ రూ. 9,850 వరకు లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఈ నోకియా ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 480+ 5G చిప్‌సెట్‌ను చూడవచ్చు. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Tags

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×