BigTV English

Amazing Deal: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

Amazing Deal: ఐఫోన్ లాంటి ఫోన్.. రూ.6,500కే.. డబుల్ ధమాకా!

Amazing Deal: టెక్ మార్కెట్ బిజీబిజీగా మారింది. కంపెనీలు వరుసగా బడ్జెట్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను వరుసగా లాంచ్ చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆఫర్డ్‌బుల్ ప్రైస్‌లోనే ప్రీమియం లుక్‌, ఫీచర్లతో కూడిన ఫోన్లను దక్కించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లు సైతం స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమోజాన్ ఇండియా మంచి డీల్‌ను తీసుకొచ్చింది. మీరు ఈ డీల్‌లో 6,499 రూపాయలకు 12GB RAM కలిగిన స్మార్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ మొబైల్ ప్రియులు itel A70ని చాలా తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


స్మార్ట్‌ఫోన్ మేకర్ Itel A70 చాలా ప్రత్యేకమైన ఫోన్. ఇందులో మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీతో దాని RAM సామర్థ్యం 12GBకి పెరుగుతుంది. ఇది కాకుండా ఫోన్ డిజైన్ వెనుక నుండి ఐఫోన్‌ను పోలి ఉంటుంది. ఇది అదే విధంగా కనిపించే కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఐటెల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ ఫీచర్ తరహాలో డైనమిక్ బార్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ itel A70 రూ. 6,499 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అయితే ఇది అనేక బ్యాంక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందుతోంది. ఇది కాకుండా పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే వినియోగదారులకు గరిష్టంగా రూ. 6,100 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ పొందుతారు. దీని విలువ పాత ఫోన్ మోడల్, పర్ఫామెన్స్, కంపెనీ పాలసీ‌పై ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ ఫోన్ అజూర్ బ్లూ, బ్రిలియంట్ గోల్డ్, ఫీల్డ్ గ్రీన్, స్టార్లిష్ బ్లాక్ వంటి కలర్స్ ఆప్ఫన్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


Also Read: మతిపోతుంది భయ్యా.. మోటో నుంచి కొత్త ఫోన్.. ఇది చాలా స్పెషల్!

itel A70 స్పెసిఫికేషన్‌లు విషయానికి వస్లే ఇందులో 6.6-అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంటుంది. ఇది డైనమిక్ బార్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్‌లో పవర్ ‌ఫుల్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 13MP డ్యూయల్ కెమెరా సెటప్ చూడొచ్చు. అదే సమయంలో ఫోన్‌లో ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఫోన్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది USB టైప్-C సపోర్ట్‌తో 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఫినిషింగ్ చాలా ప్రీమియంగా బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది.

Related News

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

OnePlus 24GB RAM Discount: వన్ ప్లస్ 24GB RAM ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ.33000 వరకు డిస్కౌంట్

Youtube Ad free: యూట్యూబ్‌లో యాడ్స్ తో విసిగిపోయారా?.. ఈ సింపుల్ ట్రిక్ తో ఉచితంగా యాడ్స్ బ్లాక్ చేయండి

iPhone 16 vs Pixel 10: రెండూ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు.. ఏది బెస్ట్?

itel ZENO 20: రూ.5999కే స్మార్ట్ ఫోన్.. 5,000mAh భారీ బ్యాటరీతో ఐటెల్ జెనో 20 లాంచ్

New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్

Big Stories

×