E-Paper
Advertisement

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!

రూ.2.99 లక్షల iPhone Duo.. బ్యాటరీ విషయంలో యాపిల్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే!
Advertisement

iPhone Duo: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. తమ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూతో కొత్త మార్కెట్‌లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి బ్యాటరీకి సంబంధించిన కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. యూరప్‌కు చెందిన అధికారిక సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ పనితీరుకు సంబంధించిన సమాచారం కనిపించింది. ఈ ఫోన్ అక్టోబర్ 23 నుంచి అమ్మకానికి రానుంది. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి.

4,883mAh బ్యాటరీ..

యాపిల్ iPhone Duoను యూరప్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబెలింగ్ (EPREL) వెబ్‌సైట్‌లో A3720 మోడల్ నంబర్‌తో నమోదు చేసింది. ఈ వివరాల ప్రకారం ఫోన్‌లో 4,883mAh రేటెడ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక సైకిల్‌కు 51 గంటల 30 నిమిషాల బ్యాటరీ పనితీరు ఉంటుందని కూడా ఈ లిస్టింగ్ పేర్కొంది. అయితే, వాస్తవ వినియోగంలో బ్యాటరీ ఎంతసేపు వస్తుందనేది ఫోన్ వాడే విధానంపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: 12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

వీడియోలకు ఎక్కువ బ్యాకప్:

యాపిల్ లాంచ్ సమయంలో iPhone Duo బ్యాటరీ పనితీరుపై కొన్ని వివరాలు వెల్లడించింది. లోపలి పెద్ద స్క్రీన్‌పై 31 గంటల వరకు వీడియోలు చూడొచ్చని కంపెనీ తెలిపింది. బయట ఉండే కవర్ స్క్రీన్‌పై వీడియోలు చూస్తే 44 గంటల వరకు బ్యాకప్ వస్తుందని పేర్కొంది. రెండు స్క్రీన్లను కలిపి ఉపయోగించే విధానంలో మాత్రం 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటల వీడియో ప్లేబ్యాక్ లభిస్తుందని తెలిపింది.

EU రేటింగ్స్ ఎలా ఉన్నాయి?

Advertisement

బ్యాటరీ వివరాలతో పాటు ఫోన్‌కు సంబంధించిన ఇతర రేటింగ్స్ కూడా బయటపడ్డాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీ విషయంలో iPhone Duoకు A గ్రేడ్ లభించింది. డ్రాప్ రెసిస్టెన్స్‌కు B, రిపేరబిలిటీకి C రేటింగ్ ఇచ్చారు. ఈ ఫోన్‌కు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. యూరప్ నిబంధనలను పాటించేందుకు యాపిల్ ఈ వివరాలను అందించింది.

ధర, ఫీచర్లు ఇవే:

భారత్‌లో iPhone Duo ధర 256GB స్టోరేజ్ వేరియంట్‌కు రూ.2,99,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 2nm టెక్నాలజీతో రూపొందించిన A20 Pro చిప్‌సెట్ ఉంది. వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. లోపల 7.6 అంగుళాల సూపర్ రెటినా XDR ఫోల్డబుల్ డిస్‌ప్లే, బయట 5.4 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. అక్టోబర్ 23న అమ్మకాలు ప్రారంభం కానుండటంతో, ఈ ఫోన్ బ్యాటరీ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూడాలి.

Also Read: యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

Tags

Related News

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

12 జీబీ ర్యామ్, సరికొత్త ఆండ్రాయిడ్‌తో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!

యాపిల్ లవర్స్‌కు పండగలాంటి వార్త.. వచ్చే వారమే మార్కెట్లోకి 4 సరికొత్త గ్యాడ్జెట్స్!

క్రియేటర్లకు బంపరాఫర్.. 15 వీడియోలు పెట్టు, లక్షలు సొంతం చేసుకో! ‘ఎక్స్’ ఆఫర్ వెనుక..

Big Stories

Advertisement
×