E-Paper
Advertisement

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్
Advertisement

Apple Smart Glasses : ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వినూత్న గాడ్జెట్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్న ప్రముఖ స్మార్ట్ గాడ్జెట్స్ తయారీ సంస్థ ఆపిల్.. మరో కొత్త ప్రయోగానికి తెర తీయనుంది. స్మార్ట్ గ్లాసెస్ కెమెరాతో ఎయిర్ పాడ్స్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని బ్లూమ్స్ బర్గ్ మార్క్ నివేదిక స్వయంగా వెల్లడించింది.

ఆపిల్ కంపెనీ త్వరలోనే స్మార్ట్ గ్లాసెస్ కెమెరాతో ఎయిర్ పాడ్స్ ను తీసుకురావటానికి సన్నాహాలు చేస్తుందని.. బ్లూమ్స్ బర్క్ నివేదిక తెలిపింది.  ప్రస్తుతం ఈ గ్లాసెస్ ప్రయోగ దశలోనే ఉన్నాయని… త్వరలోనే వీటిపై ఒక క్లారిటీ రానుందని చెప్పుకొచ్చింది. మెటా కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ ను పోలి ఉండే స్మార్ట్ గ్లాసెస్ తయారీకి ఆపిల్ ప్రయత్నిస్తుందని తెలిపిన ఈ నివేదిక…  2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

ఇక ఆపిల్ కంపెనీ విజన్ ప్రో విజువల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తన ఇతర ప్రొడక్ట్స్ లో సైతం చేర్చాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఐఫోన్ 16లో కెమెరా నియంత్రణ ప్రక్రియను డెవలప్ చేసిన ఆపిల్… మెటా తయారు చేసిన రేబాన్ గ్లాసెస్ మాదిరిగా సన్ గ్లాసెస్ తీసుకురావాలని.. ఇందులో హై టెక్నాలిజీని ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సన్ గ్లాసెస్ లో కెమెరాస్ తో పాటు స్పీకర్లు, మైక్రోఫోన్స్ సైతం పరిచయం చేయాలని ఆపిల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఈ సన్ గ్లాసెస్ లో ఆగ్మెంటెడ్ రియాలిటీ డిస్‌ప్లేను సైతం ఆపిల్ అందించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ టెక్నాలజీ రియాలిటీ విజువల్ ఇంటెలిజెన్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

కొన్నేళ్ల క్రితమే ఆపిల్ కంపెనీ కెమెరాతో ఇయర్ బర్డ్స్ ను తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఈ కెమెరా ఇయర్ బర్డ్స్ పైన కనిపించే అవకాశం ఉందని… ఈ డిజైన్ గోప్యతను ఛాలెంజ్ చేసే విధంగా ఉందని వాదనలు వినిపించటంతో ఈ డిజైన్ ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ సన్ గ్లాసెస్ పై ఆపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ALSO READ : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

ఏది ఏమైనా ఆపిల్ కంపెనీ తన కస్టమర్స్ ను ఆకర్షించడానికి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐ ఫోన్ 16 సిరీస్ విడుదలై వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సిరీస్ విడుదలైన వెంటనే హాట్ కేక్స్ లా అమ్ముడయిపోయాయి. తాజాగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ తో పాటు ఆపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఫెస్టివల్ సెల్ లో సైతం ఆపిల్ ప్రొడక్ట్స్ కు భారీ డిమాండ్ కనిపించింది. దీంతో ఆపిల్ కంపెనీకి భారీగానే లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ముందు ముందు సైతం గ్యాడ్జెట్స్ రంగంలో దూసుకుపోతూ తనదైన ముద్ర వేయటానికి ఆపిల్స్ సన్నాహాలు ముమ్మరం చేస్తుంది. వచ్చే ఏడాది ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ తో పాటు ఈఎస్ 4 సైతం మార్కెట్లోకి రాబోతుంది. వీటితో పాటు మరిన్ని వినూత్న గ్యాడ్జెట్స్ తీసుకురావటానికి ఆపిల్ సన్నాహాలు చేస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×