BigTV English

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Kamal Haasan: హీరోలంటే సినిమా సినిమాకు లుక్ మార్చాల్సిందే. స్టార్ హీరోలు అయినా, యంగ్ హీరోలు అయినా ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తేనే ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్‌గా వారి సినిమాలు చూస్తారు. అయితే యంగ్ హీరోలతో పోటీపడుతూ కొందరు సీనియర్లు సైతం వెరైటీ లుక్స్‌తో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) ముందుంటారు. సినిమాల పట్ల ఆయన డెడికేషన్ చూస్తే ప్రేక్షకులు షాక్ అవ్వక తప్పదు. తన సినిమాల్లో కొత్తగా కనిపించడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు కమల్. తాజాగా ఒక కొత్త లుక్‌తో ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తూ దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.


కష్టమంతా వేస్ట్

కమల్ హాసన్ చివరిగా ‘ఇండియన్ 2’ అనే సినిమాలో నటించారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయినా కూడా థియేటర్లలో మాత్రం డిశాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా ఈ సినిమా కోసం కమల్ చాలానే కష్టపడ్డారు. వృద్ధుడిగా కనిపించడం కోసం దాదాపు మూడు గంటలు మేకప్‌కే కేటాయించారు. గత నాలుగేళ్ల నుండి ‘ఇండియన్ 2’ షూటింగ్ మెల్లగా జరుగుతున్నా కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోకుండా ఓపికగా ఎదురుచూశారు. అయితే ఫలితం దక్కలేదు. అందుకే ఇప్పుడు లుక్ మార్చి కొత్త లుక్‌తో కొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ కొత్త లుక్‌ను సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.


Also Read: “కంగువ” ఆడియో లాంచ్ కు గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్

షూటింగ్ ముగిసింది

కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’.. ఈ సీనియర్ హీరో కొత్త లుక్‌ను బయటపెట్టింది. ఈ లుక్‌లో కమల్ చాలా స్టైలిష్‌గా ఉన్నారని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. అయితే అసలు ఈ లుక్ దేనికోసం అనే వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ‘ఇండియన్ 2’ విడుదల తర్వాత దాని రిజల్ట్ గురించి బాధపడకుండా వెంటనే మణిరత్నంతో చేస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీ సెట్‌లో అడుగుపెట్టారు కమల్ హాసన్. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్‌లో అడుగుపెట్టిందని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. కమల్ కొత్త లుక్ ‘థగ్ లైఫ్’కు సంబంధించిందేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

ఎందుకిలా

‘థగ్ లైఫ్’ తర్వాత మరొక సినిమాను సైన్ చేశారు కమల్ హాసన్. ఇది ఆయన కెరీర్‌లో 237వ చిత్రంగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కోసమే కమల్ ఇలా స్టైలిష్‌గా తయారయ్యారని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. ఒకవేళ ‘థగ్ లైఫ్’లో లుక్ అనుకుందామంటే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇలాంటి టైమ్‌లో లుక్ ఎందుకు రిలీజ్ చేస్తారని సందేహపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే అసలు ఇది సినిమాల కోసమే కాదని అనుకుంటున్నారు. శివకార్తికేయన్, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అమరన్’ను కమల్ హాసనే నిర్మించారు. అందుకే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆయన కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకవేళ ‘అమరన్’కు హైప్ క్రియేట్ చేయడం కోసమే కమల్ ఇలా రెడీ అయ్యారేమో అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×