E-Paper
Advertisement

iPhone SE 2026: పెద్ద ఫోన్లకు పోటీగా చిన్న ఐఫోన్ ఎస్ఈ 2026.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు బాస్..

iPhone SE 2026: పెద్ద ఫోన్లకు పోటీగా చిన్న ఐఫోన్ ఎస్ఈ 2026.. ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు బాస్..
Advertisement

iPhone SE 2026: ఆపిల్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది క్వాలిటీ, స్మూత్ అనుభవం, ఎక్కువకాలం అప్డేట్స్. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫోన్లకు ఉన్న నమ్మకం వేరే స్థాయిలో ఉంటుంది. అయితే ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది యూజర్లు యాపిల్ ఫోన్ కొనాలనే ఆలోచనను పక్కన పెడతారు. అలాంటి వారికి అందుబాటులో ఉండేలా  ఆపిల్ తీసుకొచ్చిన సిరీస్‌నే ఐఫోన్ ఎస్ఈ. ఈ సిరీస్‌లో బయట లుక్ సింపుల్‌గా ఉన్నా లోపల ఇచ్చే టెక్నాలజీ మాత్రం ప్రీమియం మోడల్స్‌కు దగ్గరగా ఉంటుంది. పెద్ద ఫోన్లు నచ్చని వారికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్‌గా మారే అవకాశం ఉంది. చిన్నగా కనిపించినా వాడేటప్పుడు మాత్రం యాపిల్ అసలు పవర్ తెలుస్తుంది.

డిజైన్ – డిస్‌ప్లే.. ఐఫోన్ 8 లుక్‌

Advertisement

ఐఫోన్ ఎస్ఈ 3rd జెన్‌లో 4.7-అంగుళాల రెటీనా హెచ్‌డి డిస్‌ప్లే వచ్చింది. ఇదే డిస్‌ప్లే స్టైల్ ఐఫోన్ ఎస్ఈ 2026 లో కూడా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ స్క్రీన్ ట్రూ టోన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి లైటింగ్ మారినప్పటికీ రంగులు నేచురల్‌గా కనిపిస్తాయి. హెచ్‌డిఆర్ సపోర్ట్ వల్ల వీడియోలు క్లియర్‌గా, షార్ప్‌గా కనిపిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే ఇది పాత ఐఫోన్ 8 లుక్‌ను గుర్తుకు తెస్తుంది. మందపాటి బెజెల్స్, ముందు భాగంలో టచ్ ఐడి హోమ్ బటన్ ఉండటం వల్ల చాలా మందికి ఇది ఫ్యామిలియర్ ఫీల్ ఇస్తుంది. గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్‌తో ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు సాలిడ్‌గా అనిపించే ఫినిష్ ఉంటుంది.

పర్‌ఫార్మెన్స్‌పై యాపిల్ ఫోకస్

Advertisement

ఐఫోన్ ఎస్ఈ సిరీస్‌లో ప్రతి మోడల్‌లోనూ ఆపిల్ తాజా చిప్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 2026 లో కూడా ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌కు దగ్గరగా ఉండే చిప్ ఇచ్చే అవకాశం ఉంది. దీని వల్ల యాప్స్ ఓపెన్ అవడం, మల్టీ టాస్కింగ్ చేయడం, వీడియోలు ఎడిట్ చేయడం లాంటి పనులు స్మూత్‌గా సాగుతాయి. చిన్న ఫోన్ అయినా స్పీడ్ విషయంలో యూజర్లకు ఎలాంటి అసంతృప్తి ఉండకుండా చూడాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది.

Also Read: Amazon Offers: అమెజాన్‌లో మహిళల బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ ఆఫర్లు.. తక్కువ ధరలో అందం పెంచే డీల్స్

కెమెరా విషయానికి వస్తే

ఐఫోన్ ఎస్ఈ 2026 లో కెమెరా నంబర్లు పెద్దగా కనిపించకపోయినా ఫోటో అవుట్‌పుట్ మాత్రం నమ్మకంగా ఉంటుంది. ఒకే కెమెరా ఉన్నా కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ వల్ల ఫోటోలు క్లియర్‌గా వస్తాయి. పాడరింగ్ సమయంలో రంగులు నేచురల్‌గా ఉండటం, డే లైట్‌లో షార్ప్ ఫొటోలు అందుతాయి. వీడియోలు కూడా స్టేబుల్‌గా ఉంటాయి. ఐఫోన్ ఎస్ఈ 2026 లో కూడా ఇదే కెమెరా అనుభవం కొనసాగుతుందని అంచనా.

2018mAh బ్యాటరీ వివరాలు

బ్యాటరీ గురించి మాట్లాడితే, ఇందులో 2018 mAh బ్యాటరీని అందించారు. ఆపిల్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ కారణంగా బ్యాటరీ వినియోగం కంట్రోల్‌లో ఉంటుంది. కాల్స్ చేయడం, సోషల్ మీడియా యాప్స్ వాడడం, వీడియోలు చూడడం లాంటి రోజువారీ అవసరాలకు ఈ బ్యాటరీ సాధారణ యూజ్‌లో ఒక రోజు వరకు సపోర్ట్ ఇవ్వగలదని చెప్పొచ్చు. గత SE మోడల్స్‌తో పోలిస్తే బ్యాటరీ మేనేజ్‌మెంట్ మరింత స్థిరంగా, నమ్మకంగా ఉండేలా యాపిల్ ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఇండియా ధరపై అంచనాలు..

ధర విషయానికి వస్తే, ఐఫోన్ ఎస్ఈ 3rd జెన్ అమెరికా మార్కెట్‌లో USD 429 ధరతో లాంచ్ అయింది. అదే సమయంలో ఇండియా మార్కెట్‌లో ఈ ఫోన్ ధర దాదాపు రూ.43,000గా ఉంది. అమెరికా ధరతో పోలిస్తే ఇండియాలో టాక్సులు, దిగుమతి ఖర్చులు కారణంగా ధర కొంత ఎక్కువగా ఉంటుంది. స్టోరేజ్ వేరియంట్స్, బ్యాంక్ ఆఫర్లు, సీజనల్ డిస్కౌంట్స్ ఆధారంగా ఇండియాలో ధర మారుతూ ఉన్నా, ఆపిల్ లైనప్‌లో తక్కువ ధరలో లభించే ఐఫోన్‌గా ఇది ఇప్పటికీ గుర్తింపు పొందింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఐఫోన్ ఎస్ఈ 2026 కూడా అమెరికాలో ఒక ధర శ్రేణిలో లాంచ్ అయి, ఇండియాలో కొంచెం ఎక్కువ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న సైజ్ ఫోన్ కావాలనుకునే వారు, తక్కువ బడ్జెట్‌లో ఆపిల్ అనుభవం కోరుకునే వారు ఐఫోన్ ఎస్ఈ 2026 వైపు తప్పకుండా చూడొచ్చు. డిజైన్ సింపుల్‌గా ఉన్నా స్పీడ్, కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అనుభవం విషయంలో ఆపిల్ ప్రత్యేకత స్పష్టంగా అనుభూతి కలిగించే ఫోన్‌గా ఇది నిలిచే అవకాశం ఉంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×