E-Paper
Advertisement

Simhadri Film: సింహాద్రి సినిమాకు రాజమౌళి డైరెక్టర్ కాదా.. అసలు డైరెక్టర్ ఎవరో తెలుసా?

Simhadri Film: సింహాద్రి సినిమాకు రాజమౌళి డైరెక్టర్ కాదా.. అసలు డైరెక్టర్ ఎవరో తెలుసా?
Advertisement

Simhadri film: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎక్కువగా టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)తో సినిమాలు చేశారని చెప్పాలి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి ,యమదొంగ, RRR లాంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పవన్ శ్రీధర్ దర్శకత్వంలో సింహాద్రి..

భూమిక ఎన్టీఆర్ అంకిత హీరో హీరోయిన్లుగా యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ముందుగా రాజమౌళిని దర్శకుడిగా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. రాజమౌళి కంటే ముందుగా ఈ సినిమాకు పవన్ శ్రీధర్ అనే డైరెక్టర్ పని చేసినట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభమైన తరువాత 40 రోజుల పాటు షూటింగ్ పూర్తి చేశారట అయితే 40 రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా కథలేదని చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ ఆపేసినట్టు సమాచారం.

ఎన్టీఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు..

Advertisement

ఇలా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత తిరిగి రాజమౌళిని సంప్రదించి ఎన్టీఆర్ ఇమేజ్ కు అనుగుణంగా ఈ సినిమా కథలో మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇలా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో యమదొంగ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇటీవల RRR సినిమా ద్వారా ఎన్టీఆర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతర్జాతీయ స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.

వారణాసి పనులలో బిజీగా రాజమౌళి..

Advertisement

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉండగా, రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇక వారణాసి సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని రాజమౌళి కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో ఆత్రత కనబరుస్తున్నారు.

Also Read: Nagarjuna: గుడ్ న్యూస్ చెప్పబోతున్న అక్కినేని హీరో.. తాత కాబోతున్న నాగార్జున!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×