E-Paper
Advertisement

Plastic eating fungi:- ప్లాస్టిక్స్‌ను తినేసే ఫంగస్.. అయిదేళ్ల టార్గెట్‌తో నిర్మూలన..

Plastic eating fungi:- ప్లాస్టిక్స్‌ను తినేసే ఫంగస్.. అయిదేళ్ల టార్గెట్‌తో నిర్మూలన..
Advertisement

Plastic eating fungi:– ప్లాస్టిక్స్‌ను పూర్తిగా అంతరించేలా చేయడానికి, దాని వల్ల మానవాళికి జరుగుతున్న నష్టాన్ని అదుపు చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ రీసైకిల్ అనే పద్ధతి చురుగ్గా ముందుకు వెళ్తోంది. దాంతో పాటు మరెన్నో విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తాజాగా ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి, రీసైకిల్ చేయడానికి మరో కొత్త పద్ధతిని కూడా శాస్త్రవేత్తలు కనుక్కున్నట్టు తెలుస్తోంది.

ప్లాస్టిక్‌ను తయారు చేసే పాలిప్రాపిలిన్‌ను తినే రెండు రకాల ఫంగస్‌ను శాస్త్రవేత్తలు ఇటీవల కనిపెట్టారు. పాలిప్రాపిలిన్ అనేది ప్లాస్టిక్ కంటైనర్స్, క్రీమ్ ట్యూబ్స్, క్లింజ్ ఫిల్మ్ లాంటి వాటిని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ రెండు రకాల ఫంగస్‌ను ఆస్పర్గిల్లస్ టెర్రియస్, ఎంజియోడాటియమ్ ఆల్బమ్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ముఖ్యంగా మట్టిలో, మొక్కలపై కనిపిస్తాయని వారు చెప్తున్నారు.

Advertisement

అల్ట్రావైలెట్ రేస్‌లో ఉంచిన ప్లాస్టిక్‌ను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఈ ఫంగస్‌కు 140 రోజులు పట్టిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు చేసిన పరిశోధనల్లో ప్లాస్టిక్ గురించి, ఫంగస్ గురించి క్షుణ్ణంగా పరీక్షలు జరిగాయని వారు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రీసైకిల్ కాని ప్లాస్టిక్ ఎంతో ఉందని వారు బయటపెట్టారు. ఆస్ట్రేలియాలో ప్రతీ సంవత్సరం దాదాపు 13, 500 టన్నుల రీసైకిల్ కాని ప్లాస్టిక్ ఉండిపోతుందని వారు గమనించారు. ఇది ఇతర మెటిరియల్స్‌తో కలిసి బయటికి వస్తుందని అంటున్నారు.

ఇప్పటికే ఫంగస్‌తో ప్లాస్టిక్‌ను నిర్మూలించే పద్ధతిని పలు ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయని, దీని ద్వారా ప్లాస్టిక్ చాలావరకు నిర్మూలించబడుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ప్లాస్టిక్‌ను నిర్మూలించడం కోసం పలు ప్రాజెక్ట్స్ కూడా ప్రారంభమయ్యాయి. అందులో ఒకటైన రెడ్ సైకిల్ అనే ప్రాజెక్ట్ తగినంత రిజల్ట్‌ను సాధించలేకపోయింది. ఇది సాఫ్ట్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడానికి ప్రారంభమయిన కూడా ఆ విషయంలో సక్సెస్ సాధించలేకపోయింది.

Advertisement

ఫంగస్ ద్వారా ప్లాస్టిక్ డీగ్రేడేషన్‌ను చేయాలని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు నిర్ణయించుకొని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 3 నుండి 5 సంవత్సరాల లోపు ఈ ప్రక్రియలో పూర్తిగా సక్సెస్ సాధించాలని వారు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇన్నేళ్లలో పరిష్కారం కాని సమస్య అయిదేళ్లలో పరిష్కారం అవుతుందా అని కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో నమ్మకంగా ఉన్నారు. అయిదేళ్ల లోపే తాము అనుకున్నది సాధిస్తామని అంటున్నారు.

Astronauts:- కొత్త బ్లాక్ హోల్ ఇమేజ్.. ఈసారి స్పష్టంగా

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×