E-Paper
Advertisement

వేసవి తాపానికి చెక్ పెట్టే.. బెస్ట్ కూలర్స్ ఏవి?

వేసవి తాపానికి చెక్ పెట్టే.. బెస్ట్ కూలర్స్ ఏవి?
Advertisement

Best Air Cooler for Dry Heat: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడు భగభగలాడిపోతాడు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గాలిలో.. అస్సలు తేమ లేకుండా విపరీతమైన పొడి వాతావరణం ఉంటుంది. ఇలాంటి డ్రై హీట్ ఉన్నప్పుడు ఏ కూలర్ వాడితే ఇల్లు చల్లగా.. మారుతుందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మార్కెట్లో మనకు డెజర్ట్, టవర్, పర్సనల్ అని మూడు రకాల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. డ్రై హీట్ వాతావరణానికి ఏది బెస్ట్, వాటి ప్రత్యేకతలు, ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై హీట్ కోసం ఏ కూలర్ బెస్ట్?
డ్రై హీట్ లేదా పొడి వాతావరణం ఉన్నప్పుడు గాలిలో తేమను పెంచుతూ.. ఎక్కువ విస్తీర్ణంలో చల్లదనాన్ని ఇచ్చే కూలర్ అవసరం అవుతుంది. ఈ విషయంలో డెజర్ట్ కూలర్ (Desert Cooler) అన్నింటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇవి పొడి గాలిని పీల్చుకుని, ఎక్కువ నీటిని ఆవిరి చేయడం ద్వారా గదిని ఐస్ లాగా మారుస్తాయి. ఇందులో పెద్ద ఫ్యాన్, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటాయి. చుట్టూ లావు పాటి హనీకూంబ్ లేదా ఆస్పెన్ ప్యాడ్‌లు ఉండటం వల్ల ఎక్కువ గాలిని చల్లబరిచి చాలా దూరం వరకు విసురుతుంది. ఇది గాలిలో తేమను పెంచి, గది ఉష్ణోగ్రతను 10 డిగ్రీల వరకు తగ్గించగలదు. అయితే సైజ్ చాలా పెద్దగా ఉండి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం దీని మైనస్ పాయింట్. ఈ డెజర్ట్ కూలర్ల సుమారు ధర రూ.9,500 నుంచి రూ. 16,000 వరకు బ్రాండ్ , కెపాసిటీని బట్టి మార్కెట్లో ఉంటుంది.

Advertisement

టవర్ కూలర్ల ప్రత్యేకతలు,ధరలు:
మీ ఇంట్లో స్థలం తక్కువగా ఉండి, మోడ్రన్ లుక్ కావాలనుకునే వారికి టవర్ కూలర్లు (Tower Cooler) పక్కా ఛాయిస్ అని చెప్పొచ్చు. ఇవి నిలువుగా పొడవుగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఫ్యాన్‌కు బదులుగా పవర్‌ఫుల్ బ్లోయర్ ఉంటుంది. ఇది గాలిని స్ట్రెయిట్‌గా మీ ఒంటి మీదకు ఫోకస్ చేస్తుంది. చాలా తక్కువ స్థలం తీసుకుంటుంది కాబట్టి కిచెన్ లో వంట చేసేటప్పుడు పక్కన పెట్టుకోవడానికి లేదా బెడ్ పక్కన పెట్టుకోవడానికి సూపర్ గా సూట్ అవుతుంది. డ్రై హీట్‌లో ఇది బాగానే పని చేస్తుంది కానీ.. డెజర్ట్ కూలర్ అంత ఎక్కువ ఏరియాను చల్లబరచలేదు. దీని ధర రూ. 12,000 వరకు ఉంటుంది.

పర్సనల్ కూలర్ల ఫీచర్లు, బడ్జెట్:
మీరు ఒక చిన్న రూమ్‌లో ఒంటరిగా ఉంటున్నా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మీ టేబుల్ దగ్గర మాత్రమే చల్లదనం కావాలనుకుంటే.. పర్సనల్ కూలర్ (Personal Cooler) మీకోసమే డిజైన్ చేయబడింది. ఇవి సైజులో చాలా చిన్నగా ఉంటాయి. వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా 20 నుంచి 30 లీటర్లే ఉంటుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో పనిచేసే ఇవి బరువు తక్కువగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు. సౌండ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అయితే డ్రై హీట్‌లో ఇది కేవలం కూలర్ ముందు కూర్చున్న వ్యక్తికి మాత్రమే చల్లటి గాలిని ఇస్తుంది. కానీ ఇల్లంతా చల్లబడాలని ఆశిస్తే ఇది వర్కవుట్ అవ్వదు. దీని  ధర రూ. 5,000 నుంచి రూ.8,500 లోపే దొరుకుతుంది.

Advertisement

Also Read: క్విక్ వాష్’వాడుతున్నారా ? ఇలా ఉతికితే బట్టలు గోవిందా..!

రూమ్ సైజ్ బట్టి సరైన కూలర్ :
రూమ్ సైజ్ బట్టి చూస్తే.. పెద్ద హాల్ లేదా పెద్ద రూమ్స్ (300+ sq.ft) ఉండి డ్రై హీట్ ఎక్కువగా ఉంటే డెజర్ట్ కూలర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మీడియం రూమ్స్ ఉండి తక్కువ స్థలం ఉన్నచోట టవర్ కూలర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అదే చిన్న స్టడీ రూమ్ లేదా సింగిల్ బెడ్ రూమ్ ఉండి తక్కువ బడ్జెట్‌లో కరెంట్ ఆదా అవ్వాలనుకుంటే.. పర్సనల్ కూలర్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

మీరు ఉండే ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉండి, గాలి పొడిగా ఉంటే కళ్ళు మూసుకుని డెజర్ట్ కూలర్ తీసుకోండి. స్థలం సమస్య ఉంటేనే టవర్ కూలర్ జోలికి వెళ్ళండి. బడ్జెట్ తక్కువగా ఉండి, కేవలం మీ ఒక్కరికే చల్లదనం కావాలనుకుంటే.. పర్సనల్ కూలర్ బెస్ట్ ఆప్షన్. కొనేటప్పుడు హనీకూంబ్ ప్యాడ్స్ ఉన్న మోడల్స్ ఎంచుకుంటే కూలింగ్ ఇంకా అదిరిపోతుంది.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×