E-Paper
Advertisement

రూ.4,000 లోపు బెస్ట్ BLDC ఫ్యాన్లు.. 60 శాతం వరకు కరెంటును ఆదా చేసుకోవచ్చు!

రూ.4,000 లోపు బెస్ట్ BLDC ఫ్యాన్లు.. 60 శాతం వరకు కరెంటును ఆదా చేసుకోవచ్చు!
Advertisement

Best BLDC fans: ఒకప్పుడు ఫ్యాన్ కొనాలంటే షాపుకెళ్లి కంపెనీ పేరు, చూడటానికి బాగుందా? లేదా? అని చూసి ధర అడిగి కొనేవాళ్లం. కానీ ఈ టెక్నాలజీ యుగంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి కదా అని ఏది పడితే అది కొనేస్తున్నాం. దీంతో ప్రతినెలా వచ్చే కరెంటు బిల్లు సామాన్యులను భయాందోళనకు గురిచేస్తోంది. అందుకే కరెంటు బిల్లు సమస్యకు చెక్ పెడుతూ ఇప్పుడంతా BLDC ఫ్యాన్లను ఎంచుకుంటున్నారు.

ఏంటి వీటి స్పెషాలిటీ అనుకుంటున్నారా? మామూలు ఫ్యాన్లతో పోలిస్తే ఇవి దాదాపు 60 శాతం దాకా కరెంటును ఆదా చేస్తాయి.తద్వారా కరెంటు బిల్లు సగానికి పైగా తగ్గుతుందన్నమాట. అంతేకాదు.. ఇన్వర్టర్ మీద కూడా ఇవి చాలా సేపు తిరుగుతాయి. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో దొరికే టాప్ ఫ్యాన్లు ఏవో ఓసారి చూసేద్దాం రండి..

మీ ఇంటి హాల్ పెద్దదా?

Advertisement

వేస్తే ఒక మూలకే గాలి తగులుతుంది. అలాంటి వారు ‘అటమ్ బెర్గ్ రెనెసా ఎంజెల్’ ఫ్యాన్లను ఎంచుకోవడం ఉత్తమం. దీని రెక్కల సైజు (1400mm) పెద్దది కాబట్టి గది మొత్తం గాలిని వీస్తుంది. ఇన్ని ఫీచర్లు ఉన్నా ఇది కేవలం 35 వాట్ల కరెంటునే వాడుకుంటుంది. దీనికి ఉండే స్మార్ట్ రిమోట్‌తో హాయిగా సోఫాలో కూర్చుని స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. డిజైన్ కూడా చూడటానికి చాలా రిచ్‌గా ఉంటుంది.

అస్సలు దుమ్ము పట్టని ఫ్యాన్..

మంచి ఫ్యాన్‌ను కొంటే సరిపోదు.. దాన్ని అప్పుడప్పుడూ తుడవటమూ పెద్ద తలనొప్పి. ఈ గోల ఉండొద్దు అనుకుంటే.. గోల్డ్‌మెడల్ ఓపస్ ప్రైమ్ మోడల్‌ను ఎంచుకోవాలి. దీనిలోని యాంటీ డస్ట్ కోటింగ్ వలన దుమ్ము అంత త్వరగా అంటుకోదు. ఇక క్రాంప్టన్ ఎనర్జియన్ క్రోమైర్ విషయానికొస్తే.. ఇది చాలా బ్యాలెన్స్‌డ్‌గా పనిచేస్తుంది. వోల్టేజ్ అటు ఇటు అయినా గాలి మాత్రం తగ్గదు. మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే, సాధారణ ఫ్యాన్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ సేపు తిరుగుతుంది.

Advertisement

Also Read: కరెంటు ఆదా చేసే బెస్ట్ ఇన్వర్టర్ ఏసీలు.. ధర కూడా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌లోనే!

తక్కువ కరెంటుతో ఎక్కువ గాలి..

అస్సలు కరెంటు బిల్లు పెరగకూడదు అనుకునే వారికి బజాజ్ ఎనర్జీ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం 26 వాట్ల పవర్‌ను మాత్రమే తీసుకుంటుంది. దీంతో మనం ఇంట్లో వాడే చిన్న ఎల్ఈడి బల్బ్ లాగే చాలా తక్కువ పవర్‌తోనూ తిరుగుతుంది. గాలి కూడా ఎక్కడా తగ్గకపోవడమే కాకుండా.. అస్సలు సౌండ్ కూడా రాదు. ఫ్యాన్ నుంచి ఎలాంటి సౌండ్ రాకూడదు అనుకునే వారి బెడ్ రూమ్స్‌లోకి ఇది సూపర్‌గా సెట్ అవుతుంది.

మంచి బ్రాండెడ్ ఫ్యాన్స్ కావాలంటే?

చాలా మందికి ఫ్యాన్ స్పీడ్‌గా తిరిగితేనే తృప్తిగా ఉంటుంది. అలాంటి వారి కోసం హావెల్స్ ఆంబ్రోస్ స్లిమ్, యాక్టివా జెట్టా ఉన్నాయి. హావెల్స్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని సర్వీస్ చాలా బాగుంటుంది. దీని రిమోట్ కూడా ఎటు నుంచి నొక్కినా పనిచేస్తుంది. ఇక యాక్టివా జెట్టా అయితే ఈ లిస్టులోనే ఫుల్ స్పీడ్‌గా తిరిగే ఫ్యాన్. వేసవిలో ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్యాన్ గాలి చాలా హాయిగా అనిపిస్తుంది.

ఏది కొంటే మంచిది?

మార్కెట్లో ఇవే కాకుండా పాలీక్యాబ్, ఓరియంట్ లాంటి కంపెనీల్లో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి. మీరు ఫ్యాన్ కొనే ముందు 5-స్టార్ రేటింగ్ ఉందో లేదో చూసుకోండి. గది చిన్నగా ఉంటే 1200mm సరిపోతుంది. అదే పెద్ద హాల్ అయితే 1400mm తీసుకోండి. ఒక్కసారి ఈ బిఎల్డిసి ఫ్యాన్ల మీద పెట్టుబడి పెడితే.. మీరు వాడే కరెంటు బిల్లులో ఆ డబ్బులు ఈజీగా వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి స్మార్ట్‌గా ఆలోచించి మంచి ఫ్యాన్ తెచ్చేసుకోండి.

Also Read: Find X9 Ultra లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 

Related News

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!

ట్రెండీ కలర్, టెర్రిఫిక్ ఫీచర్స్.. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో బోల్ట్ Z60 పింక్ ఇయర్‌బడ్స్!

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

Big Stories

Advertisement
×