Best AC under 40000: ఒకప్పుడు ఏసీ అంటే బాగా డబ్బున్న వాళ్ల ఇంట్లోనే ఉండేది కానీ, ఇప్పుడు పెరుగుతున్న ఉక్కపోతకు ప్రతి ఇంట్లో ఏసీ ఉండటం చాలా అవసరం అయిపోయింది. అయితే మధ్యతరగతి కుటుంబాలు ఏసీ కొనాలంటే ముందుగా ఆలోచించేది.. వాటి ధరల గురించే. అందుకే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వంటి సైట్లలో రూ.40వేల లోపు దొరికే బెస్ట్ ఇన్వర్టర్ ఏసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా మంచి ఏసీ కావాలనుకుంటే హైసెన్స్ కంపెనీ ఏసీలు తీసుకోవచ్చు. దీనిలో ఇంటెల్లీ కూల్ ప్రో మోడల్ రూ.28,990కే దొరుకుతోంది. ఇది గదిని త్వరగా చల్లబరచడమే కాకుండా.. ఏసీని దానంతట అదే క్లీన్ చేసుకునే సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే మనందరికీ బాగా తెలిసిన వోల్టాస్ 1.5 టన్ ఏసీ కూడా 31 వేల లోపు ధరకే అందుబాటులో ఉంది. ఇది 52 డిగ్రీల ఎండలో కూడా గదిని కూల్‌గా ఉంచుతుందని కంపెనీ చెబుతోంది. గాలిలోని దుమ్మును వడకట్టడానికి ఇందులో ప్రత్యేకమైన ఫిల్టర్లు కూడా ఉన్నాయి.
టెక్నాలజీ పెరిగిపోయాక ఇప్పుడు ఏసీలు కూడా చాలా తెలివైనవి మారిపోయాయి. శాంసంగ్ సంస్థ రూ.35వేల లోపు బిస్పోక్ ఏఐ ఇన్వర్టర్ ఏసీని తీసుకొచ్చింది. ఈ ఏసీని మీరు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేలోపే ఫోన్‌లోని యాప్‌తో ఆన్ చేసుకోవచ్చు. ఇక గూగుల్ అసిస్టెంట్ లేదంటే అలెక్సాను అడిగినా ఇది వింటుంది. అలాగే హయర్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఏసీలు కూడా రూ.35,480 ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటిలోని ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ అనే ఫీచర్ ఏసీ లోపల పేరుకుపోయిన దుమ్మును ఐస్ గడ్డల రూపంలో మార్చి క్లీన్ చేసేస్తుంది.
Also Read: షావోమీ నుంచి 100 ఇంచుల భారీ స్మార్ట్ టీవీ.. తక్కువ ధరలో హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్!
చాలామందికి ఏసీ వేస్తే కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని టెన్షన్ ఉంటుంది. దీనికోసం ఇప్పుడు కన్వర్టబుల్ ఏసీలు వచ్చాయి. గదిలో తక్కువ మంది ఉంటే ఏసీ తన సామర్థ్యాన్ని తగ్గించుకుని కరెంటును ఆదా చేస్తుంది. ఎల్‌జీ 1.5 టన్ ఏసీలో ఇలాంటి 6 రకాల మోడ్స్ ఉన్నాయి. దీని ధర రూ.35,990 వరకు ఉంటుంది. ఇకపోతే హయర్ ఏసీలో అయితే ఏకంగా 7 రకాల మోడ్స్ ఉన్నాయి. ఇది గాలిని గదిలోని మూలమూలల వరకు పంపిస్తుంది. ఇలాంటి ఏసీల వల్ల మన అవసరాన్ని బట్టి కూలింగ్‌ను మార్చుకోవచ్చు. దీంతో డబ్బులు కూడా ఆదా అవుతాయి.
ఏసీ కేవలం చల్లదనం ఇవ్వడమే కాదు.. మనం పీల్చే గాలిని కూడా శుభ్రంగా ఉంచాలి. పానాసోనిక్ ఏసీలు గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలను కూడా క్లీన్ చేస్తాయి. దీని ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఫీచర్లు మాత్రం అదుర్స్. ఇక డైకిన్ కంపెనీ ఏసీలు రూ.39,200కు దొరుకుతున్నాయి. ఇందులో కోండా ఎయిర్‌ఫ్లో అనే స్పెషల్ ఫీచర్ ఉంటుంది. ఇది గాలి నేరుగా మన మొహం మీద కొట్టకుండా గది మొత్తం ఒకేలా చల్లబడేలా చేస్తుంది. వీటన్నింటిలో కాపర్ కండెన్సర్లు ఉండటం వల్ల ఏసీలు ఎక్కువ కాలం మన్నుతాయి.
ఆఫర్లలో తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఏది పడితే అది కొనకూడదు. ముందుగా మీ గది సైజుకు 1 టన్ సరిపోతుందా లేదా 1.5 టన్ కావాలా అనేది చూసుకోండి. ఎలక్ట్రిసిటీ ఆదా కావాలంటే 3 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలనే ఎంచుకోవడం తెలివైన పని. అలాగే మీ ఏరియాలో ఆ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రూ.40వేల లోపు బడ్జెట్‌లో పైన చెప్పుకున్న కంపెనీలన్నీ నమ్మదగ్గవే, కాబట్టి మీ అవసరానికి తగ్గట్టుగా ఒక మంచి ఏసీని కచ్చితంగా కొనుగోలు చేయొచ్చు.
Also Read: ఐఫోన్ యూజర్లకు షాక్.. యాపిల్ నుంచి ఊహించని నిర్ణయం, ఇంతకీ ఏమైందంటే?