Best BLDC Kitchen Chimney: సాధారణంగా వంటల్లో తాలింపులు, మసాలాలు, డీప్ ఫ్రైలు చాలా ఎక్కువ. దీని వల్ల కిచెన్ అంతా పొగ, జిడ్డు పేరుకుపోతుంటాయి. అయితే.. వీటన్నింటిని క్లీన్ చేయడానికి పాత కాలం చిమ్నీలు వాడితే.. అవి చేసే పెద్ద పెద్ద శబ్దాలకు ప్రశాంతంగా వండడమే మర్చిపోవాలి. అందుకే మార్కెట్లోకి వచ్చాయి సరికొత్త BLDC మోటార్ కిచెన్ చిమ్నీలు. ఇవి కరెంట్‌ను ఆదా చేయడమే కాకుండా, ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా నడుస్తూ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మీ కిచెన్ కోసం అమెజాన్‌లో లభిస్తున్న టాప్ 5 BLDC చిమ్నీల వివరాలు వాటి ధరలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం.
కిచెన్ అప్లయన్సెస్ లో ఫేబర్ బ్రాండ్‌కు తిరుగులేదు. ఇందులోని 1500 m³/hr పవర్‌ఫుల్ సక్షన్ కెపాసిటీ హెవీ తాలింపు పొగను కూడా క్షణాల్లో పీల్చేస్తుంది. దీని 9-స్పీడ్ బ్రష్‌లెస్ డీసీ మోటార్ చాలా తక్కువ శబ్దంతో పనిచేస్తుంది.
దీనిలోని ఫిల్టర్‌లెస్ టెక్నాలజీ, మోషన్ సెన్సార్ చేతి సైగలతో కంట్రోల్ చేయవచ్చు. ఇదిలా ఉంటే దీని ధర రూ.16,000 నుంచి రూ.18,500 వరకు ఉంటుంది.
బ్రాండ్ స్టైలిష్ లుక్, ప్రీమియం క్వాలిటీకి కేరాఫ్ అడ్రస్. ఈ టీ-షేప్ కాంపాక్ట్ డిజైన్ చిమ్నీ చిన్న , మీడియం కిచెన్లకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇందులో.. 1500 m³/hr సక్షన్ పవర్ ఉంది. అంతే కాకుండా దీనిలోని హీట్ ఆటో క్లీన్ టెక్నాలజీ, టచ్ అండ్ జెస్టర్ కంట్రోల్, మోటార్‌పై లైఫ్‌టైమ్ వారంటీ. ఇదిలా ఉంటే దీని ధర రూ.13,999 నుంచి రూ.15,500 వరకు ఉంటుంది.
హ్యావెల్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ చిమ్నీ కిచెన్‌కు రాయల్ లుక్ ఇస్తుంది. దీని సౌండ్ లెవెల్ కేవలం 48 డెసిబెల్స్ మాత్రమే.. అంటే వంట చేస్తున్నప్పుడు పక్కవారితో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. 1600 m³/hr సక్షన్ కెపాసిటీతో.. ఇది చాలా వేగంగా పొగను క్లియర్ చేస్తుంది. ఫీచర్స్: 9-స్పీడ్ కంట్రోల్, ఆయిల్ కలెక్టర్, 15 ఏళ్ల మోటార్ వారంటీ. దీని ధర రూ.16,599 నుంచి 18,000 వరకు ఉంటుంది.
మీ ఫ్లాట్ లేదా ఇంట్లో పైప్ పెట్టడానికి ప్లేస్ లేదా? అయితే.. ఈ ప్లగ్ అండ్ ప్లే డక్ట్‌లెస్ చిమ్నీ మీ కోసమే. పైపులు పెట్టే తలనొప్పి లేకుండా, గోడకు తగిలించి డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. 5-స్టేజ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫిల్టర్ ద్వారా గాలిని పూర్తిగా ప్యూరిఫై చేస్తుంది. దీని ఫీచర్స్.. పోర్టబుల్ డిజైన్, 1400 CMH సక్షన్, 48dB లో-నాయిస్. ఇదిలా ఉంటే దీని ధర రూ. 11,999 నుంచి రూ.13,500 వరకు ఉంటుంది.
గ్లెన్ బ్రాండ్ బడ్జెట్ ధరలో.. బెస్ట్ ఫీచర్స్ అందిస్తుంది. ఈ కర్వ్‌డ్ గ్లాస్ చిమ్నీ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటుంది. 1400 m³/hr సక్షన్ కెపాసిటీతో పాటు, 180 వాట్ల పవర్‌ఫుల్ BLDC మోటార్ దీని సొంతం. అంతే కాకుండా ఫీచర్స్ డిజిటల్ డిస్ప్లే, మోషన్ సెన్సార్, ఈజీ క్లీన్ ఆయిల్ ట్రే. ఇదిలా ఉంటే అంచనా ధర రూ.13,995 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది.
BLDC చిమ్నీల వల్ల ఉపయోగాలు:
నో నాయిస్ : సాధారణ చిమ్నీలతో పోలిస్తే ఇవి 50% తక్కువ శబ్దం చేస్తాయి.
పవర్ సేవింగ్: బ్రష్‌లెస్ మోటార్ టెక్నాలజీ వల్ల కరెంట్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది.
మన్నిక : ఈ మోటార్లలో రాపిడి తక్కువ కాబట్టి, ఇవి చాలా ఏళ్ల పాటు ఎలాంటి రిపేర్లు లేకుండా పనిచేస్తాయి.