RAW NTR: జులై 18న అసలేం జరుగుతుందా అని వెయిట్ చేసిన వారందరికి సమాధానం ఇస్తూ ‘ఊరు వాడా’ పోస్టర్ లాంచ్ చేసింది రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్.ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.అవును తమ అభిమాన నటుడైన తారక్ ని ఆకాశానికి ఎత్తుతూనే ఆయన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులపై మండిపడ్డారు.
ముగ్గురు వ్యక్తులు ఒక కోటరీలా ఏర్పడి
తమకు తారక్ అంటే ప్రాణంతో సమానమని,తమకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా తారక్ పేరు ప్రతిష్టలకి భంగం కలిగించమని తేల్చి చెప్పారు.అయితే తమను ఎన్టీఆర్ ని కలవనీయకుండా ముగ్గురు వ్యక్తులు ఒక కోటరీలా ఏర్పడి తారక్ ని మా నిజమైన అభిమానులని కలవనీయకుండా దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తాము ఎప్పుడు ఎన్టీఆర్ ని కలుద్దామని ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా తమకు ఎన్టీఆర్ ని కలవనీకుండా అడ్డం పడుతున్నారని ఆరోపించారు.
also read:ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. పోస్టర్ విడుదల చేసిన RAW NTR ఆర్గనైజేషన్!
మీడియా ముందు వచ్చేకన్నా ముందే తారక్ ని కలిసి
అయితే ఈ ఆరోపణలని తాము ఊరికే చేయట్లేదని, వీటికి తమ వద్ద స్క్రీన్ షాట్స్ వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.ఇక తాము మీడియా ముందు వచ్చేకన్నా ముందే తారక్ ని కలిసి ఈ సమస్యని వివరిద్దామని అనుకున్నామని,ఫ్యాన్స్ గ్రూపుల్లో ఈ విషయం స్ప్రెడ్ అయి రచ్చ కాకముందే ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ ని కలిసి అసలు విషయం చెప్పేందుకు ప్రయత్నించామని,కానీ వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని,ఇక తారక్ చుట్టూ ఉన్న ఆ ముగ్గురి నుండే ఈ పరిస్థితి ఎదురవుతుందని అసలు విషయం చెప్పుకొచ్చారు.
విమర్శలని తారక్ ఎలా హ్యాండిల్ చేస్తాడో !
అయితే గత కొన్ని రోజుగా మీడియాలో ఇంత జరుగుతున్నా తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ ని కలవకపోవడం తమని బాధిస్తుందని తెలిపారు.ఇక బయట తమ మీద ఎంత నెగెటివ్ ప్రచారం జరిగినా,తమని ఎన్ని కాంట్రవర్సీలు చుట్టు ముట్టినా తారక్ పేరుని అసలేమాతరం డ్యామేజ్ చేయమని, ,కాని తమ మనసులోని బాధని, ఆవేదనని, అలాగే ఆ ముగ్గురు వ్యవహరిస్తున్న తీరునే తారక్ దగ్గరికి తీసుకెళ్లాలన్నదే తమ తాపత్రయమని కుండబద్దలు కొట్టారు. చూడాలి మరి అభిమానులే , అభిమానులపై చేస్తున్న విమర్శలని తారక్ ఎలా హ్యాండిల్ చేస్తాడో !
also read:రకుల్ పాప రూట్ మార్చిందిగా…. టాలీవుడ్‌లో చాన్సుల కోసమేనా?