E-Paper
Advertisement

Best Ceiling Fans 2026: ఏఐతో పనిచేసే స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్స్.. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్.. ఏమున్నాయ్ బాసు!

Best Ceiling Fans 2026: ఏఐతో పనిచేసే స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్స్.. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్.. ఏమున్నాయ్ బాసు!
Advertisement

Best Ceiling Fans 2026: సాధారణంగా వేసవిలో ఏసీ, కూలర్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లకు సైతం మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ లో మంచి గాలిని ఇచ్చే టాప్ కంపెనీల ఫ్యాన్స్ కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే రెగ్యులర్ ఫ్యాన్లకు బదులు లెటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన వాటిని ఇక్కడ అందించడం జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ ఫ్యాన్లు.. స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండటంతో పాటు విద్యుత్ ను సైతం ఆదా చేస్తాయి.

Atomberg – Best BLDC Ceiling Fan

ఆటంబెర్గ్ కంపెనీకి చెందిన బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్స్ మార్కెట్ లో మంచి గుడ్ విల్ కలిగి ఉన్నాయి. రూ.3,500-10,500 మధ్య 2-3 ఏళ్ల వారంటీతో ఇవి లభిస్తున్నాయి. BLDC మోటార్ (10-20 వాట్స్), AI ఆధారిత శక్తి ఆప్టిమైజేషన్, రిమోట్ + మొబైల్ యాప్ నియంత్రణ, ఇన్వర్టర్ ఫ్రెండ్లీ ఆపరేషన్, వాయిస్ కంట్రోల్ (అలెక్సా, గూగుల్) ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Havells – Premium Ceiling Fans

Advertisement

హవెల్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫ్యాన్లకు సైతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. రూ.3,000-11,000 రేంజ్ లో BLDC మోటార్లతో వర్క్ చేసే స్టైలిష్ సీలింగ్ ఫ్యాన్‌లను అందిస్తోంది. తక్కువ శబ్దం కలిగిన BLDC మోటార్, ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాన్ స్పీడును సర్దుబాటు చేసే ఏఐ టెక్నాలజీ, రిమోట్ – స్మార్ట్ యాప్ కంట్రోల్, ఏరోడైనమిక్ బ్లేడ్ డిజైన్లతో హవెల్స్ సీలింగ్ ఫ్యాన్స్ లభిస్తున్నాయి.

Crompton – Best Value Ceiling Fans

సీలింగ్ ఫ్యాన్ల రంగంలో క్రాంప్టన్ కు మంచి పేరుంది. రూ.2,500-9,000 మధ్య ఈ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫ్యాన్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. అధిక గాలి ప్రసరణ, పవర్ ఫుల్ – సమర్థవంతమైన మోటార్లు, స్మూత్ రన్నింగ్, స్మార్ట్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఈ ఫ్యాన్ లోని ముఖ్యమైన ఫీచర్లుగా చెప్పవచ్చు.

Orient Electric – Stylish & Smart Ceiling Fans

Advertisement

ఓరియంట్ కంపెనీకి చెందిన ఏఐ స్మార్ట్ ఫ్యాన్లు.. రూ.2,500-13,000 మధ్య లభిస్తున్నాయి. BLDC మోటర్లు, హై-స్పీడ్ గాలి, యాప్ ఆధారిత నియంత్రణ, ఏఐ ఎయిర్ ఫ్లో ఆప్టిమైజేషన్, ఆకర్షణీయమైన లుక్ ను ఓరియంట్ స్మార్ట్ ఫ్యాన్లలో కనిపిస్తాయి.

Also Read: Split AC vs Window AC: ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తేడాలు తెలియకుండా కొంటే నష్టపోతారు!

Usha – Durable Ceiling Fans

మార్కెట్ లో మన్నిక కలిగిన ఫ్యాన్లలో ఉషా సీలింగ్ ఫ్యాన్లు తప్పకుండా ఉంటాయి. ఈ కంపెనీ నుంచి సైతం స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.2,400-9,500 ప్రైస్ రేంజ్ లో లభిస్తున్నాయి. హీట్ సెన్సింగ్ స్పీడ్ కంట్రోల్, స్ట్రాంగ్ కాపర్ మోటర్స్, వైడ్ సర్వీస్ నెట్ వర్క్ ఈ ఫ్యాన్లకు ఉన్న అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు.

Also Read: Dog Robot Controversy: AI సమ్మిట్‌లో రోబో డాగ్ వివాదం.. స్వదేశీ టెక్నాలజీ అంటూ మోసం

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×