E-Paper
Advertisement

Gold Rate Hike: ఒడియమ్మ బంటి.. బంగారం మళ్లీ కొండెక్కి కూర్చుందిరోయ్! నేడు ఎంత పెరిగిందంటే?

Gold Rate Hike: ఒడియమ్మ బంటి.. బంగారం మళ్లీ కొండెక్కి కూర్చుందిరోయ్! నేడు ఎంత పెరిగిందంటే?
Advertisement

Gold Rate Hike: వామ్మో.. నిన్న మొన్నటి వరకు కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వెరసి పసిడిని మళ్లీ పైపైకి తీసుకెళ్తున్నాయి. తగ్గినట్టే తగ్గి అకస్మాత్తుగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కోసం వేచి చూస్తున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడప దాటి వెళ్లాలంటేనే భయపడేలా ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుడికి ‘బంగారు కల’ కష్టతరంగా మారుతోంది.

అయితే, ఇదే సమయంలో పెట్టుబడిదారులకు మాత్రం ఈ పరుగు పండగలా కనిపిస్తోంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇప్పుడు భారీ లాభాలను తెచ్చిపెడుతుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న ప్రతిసారీ మదుపర్లు పసిడి వైపు మొగ్గు చూపడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు సామాన్యుడి కంట కన్నీరు, ఇటు ఇన్వెస్టర్ల మోములో చిరునవ్వు.. వెరసి పసిడి మార్కెట్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది.

Advertisement

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. బుధ‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,200 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,490 వద్ద ఉంది. అలాగే బుధ‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,350 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,290 పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,56,490 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 వద్ద ఉంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,490 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,490 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,450 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,640 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,600 వద్ద ఉంది.

Also Read: దేశంలో రూ.40 లక్షల కోట్ల కరెన్సీ.. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా రూ.100 నోట్లు

నేటి సిల్వ‌ర్ ధ‌ర‌లు ఇలా..
నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు నిశ్చ‌లంగా ఉన్న సిల్వ‌ర్ ధ‌రలు మ‌ళ్లీ నేడు భారీగా పెరిగాయి. అయితే నిన్న బుధ‌వారం కేజీ సిల్వ‌ర్ ధ‌ర రూ. 2,60,000 ఉండ‌గా.. నేడు గురువారం కేజీ సిల్వ‌ర్ పై రూ. 2,70,000 వ‌ద్ద ఉంది.. అంటే నేడు ఒక్క‌రోజే కేజీ సిల్వ‌ర్ పై రూ. 10,000 పెరిగింది. అలాగే క‌ల‌క‌త్తా, ముంభై, కేర‌ళ ప్రాంతంలో కేజీ సిల్వ‌ర్ ధ‌ర రూ. 2,70,000 వ‌ద్ద ప‌లుకుతుంది.

Related News

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

పర్సనల్ లోన్ EMI కట్టలేకపోయారా? క్రెడిట్ స్కోర్‌ తగ్గకుండా ఎలా సరిచేయాలి?

పండుగ షాపింగ్ అంతంతమాత్రమే.. వెనుకడుగు వేస్తున భారతీయులు.. కారణాలివే

మళ్లీ రీఛార్జ్ ధరలు పెంచనున్న జియో.. అంబానీ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×