E-Paper
Advertisement

ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు

ఇల్లే ఏసీలా మారుతుంది! లివింగ్ రూమ్ కోసం.. తక్కువ ధరలో సీలింగ్ ఫ్యాన్లు
Advertisement

Best Ceiling Fans: ఎండాకాలం వచ్చిందంటే.. చాలు ఉక్క పోతతో జనాలు అల్లాడిపోతుంటారు. ఇలాంటి సమయంలో ఇళ్లను, ముఖ్యంగా ఇంటి గుండె లాంటి లివింగ్ రూమ్ (హాల్)ను చల్లగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఏసీలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా కరెంట్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే బెస్ట్ కూలింగ్ అందించే మంచి బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్‌ను ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో లేటెప్ట్ టెక్నాలజీతో తక్కువ కరెంట్ ఖర్చు చేసే అనేక ఆప్షన్లు అందుబాటులో.. ఉన్నాయి. మీ లివింగ్ రూమ్ కోసం ఉపయోగపడే టాప్ 5 బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

5 బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్లు:

Advertisement

1.ఆటంబర్గ్ రెనెసా బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ (Atomberg Renesa BLDC Fan):
ప్రస్తుత రోజుల్లో కరెంట్ ఆదా చేసే స్మార్ట్ ఫ్యాన్లలో ఆటంబర్గ్ (Atomberg) బ్రాండ్ సరి కొత్త విప్లవాన్ని సృష్టించింది. మీ లివింగ్ రూమ్ కోసం ఆటంబర్గ్ రెనెసా 1200mm బిఎల్డిసి ఫ్యాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కేవలం 28 వాట్ల కరెంట్ మాత్రమే వినియోగిస్తుంది, దీని వల్ల సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే.. ఏడాదికి దాదాపు రెండు వేల రూపాయల వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. ఈ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇందులో.. బూస్ట్ మోడ్, స్లీప్ మోడ్, టైమర్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. దీని స్టైలిష్ ఎల్‌ఈడీ లైట్ ఇండికేటర్లు మీ హాల్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.

2. క్రాంప్టన్ ఎనర్జియాన్ హెచ్ఎస్ బిఎల్డిసి ఫ్యాన్ (Crompton Energion HS BLDC):
ఎలక్ట్రికల్ రంగంలో దశాబ్దాల నమ్మకమైన చరిత్ర కలిగిన బ్రాండ్ క్రాంప్టన్. వారి ఎనర్జియాన్ సిరీస్ ఫ్యాన్లు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ గాలిని ఇచ్చేందుకు ప్రసిద్ధి చెందాయి. లివింగ్ రూమ్ కోసం డిజైన్ చేయబడిన ఈ మోడల్ 370 RPM హై-స్పీడ్ మోటార్‌తో వస్తుంది. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉండి.. కేవలం 35 వాట్ల పవర్‌తోనే పని చేస్తుంది. పెద్ద హాల్స్ లో కూడా మూలమూలకూ గాలిని సమానంగా వ్యాపింపజేయడంలో ఇది టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సింపుల్, క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే వారికి ఇది సరైన ఛాయిస్.

Advertisement

3.హావెల్స్ గ్లేజ్ బిఎల్డిసి సీలింగ్ ఫ్యాన్ (Havells Glaze BLDC Fan):
మీ లివింగ్ రూమ్ కేవలం చల్లగా ఉండటమే కాకుండా.. లేటెస్ట్ ఇంటీరియర్‌కు తగ్గట్టుగా అందంగా కనిపించాలనుకుంటే.. హావెల్స్ గ్లేజ్ మోడల్ వైపు మొగ్గు చూపవచ్చు. దీని ఏరోడైనమిక్ బ్లేడ్ డిజైన్ ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా నడుస్తూ రూమ్‌ను చల్ల బరుస్తుంది. ఆర్ఎఫ్ రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ ఉండటం వల్ల రెగ్యులేటర్ అవసరం లేకుండానే ఫ్యాన్ స్పీడ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇది 350 RPM వేగంతో బెస్ట్ ఎయిర్ డెలివరీని అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఇన్వర్టర్ కనెక్షన్‌పై ఎక్కువ సమయం బ్యాకప్ ఇస్తుంది.

4.ఉషా బ్లూమ్ సీలింగ్ ఫ్యాన్ (Usha Bloom Ceiling Fan):
సాంప్రదాయ మోటార్లతో పాటు వినూత్నమైన డిజైన్లను ఇష్టపడే వారి కోసం ఉషా బ్లూమ్ సిరీస్ మార్కెట్లో ట్రెండ్ అవుతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి యాంటీ-డస్ట్ , స్క్రాచ్-రెసిస్టెంట్ కోటింగ్ ఉంటుంది. దీని వల్ల ఫ్యాన్ బ్లేడ్లపై దుమ్ము త్వరగా పేరుకుపోదు, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ఇది 380 RPM అత్యధిక వేగంతో.. 235 CMM ఎయిర్ డెలివరీని అందిస్తుంది. మీ లివింగ్ రూమ్ పెద్దదిగా ఉన్నప్పటికీ.. ఈ ఫ్యాన్ వేగ వంతమైన గాలిని అందిస్తూ ఉష్ణోగ్రతను వెంటనే తగ్గిస్తుంది.

Also Read: బడ్జెట్‌లోనే ఆటో క్లీన్ చిమ్నీలు.. అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మిస్ అవ్వొద్దు

5. ఓరియంట్ ఎలక్ట్రిక్ అపెక్స్ ఎఫ్ఎక్స్ (Orient Electric Apex FX):
మీరు బడ్జెట్ ధరలో అత్యంత నమ్మకమైన , మన్నికైన బ్రాండెడ్ ఫ్యాన్ కోసం చూస్తుంటే.. ఓరియంట్ అపెక్స్ ఎఫ్ఎక్స్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇందులో అమర్చిన పవర్‌ఫుల్ రాగి మోటార్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. తక్కువ వోల్టేజ్ ఉన్న సమయాల్లో కూడా ఇది స్థిరమైన వేగంతో గాలిని అందిస్తుంది. డబుల్ బాల్ బేరింగ్ టెక్నాలజీ వల్ల ఫ్యాన్ తిరిగేటప్పుడు ఎలాంటి కిచకిచ శబ్దాలు రావు. తక్కువ మెయింటెనెన్స్‌తో.. ఎక్కువ కాలం పనిచేసే ఫ్యాన్ కావాలనుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది ఎంతో అనువైంది.

లివింగ్ రూమ్ ఫ్యాన్ కొనేటప్పుడు ఇవి గమనించండి:
మీ హాల్ కోసం ఫ్యాన్ కొనే.. ముందు రూమ్ సైజును బట్టి బ్లేడ్ సైజును ఎంచుకోవాలి. సాధారణంగా 150 నుంచి 300 చదరపు అడుగుల వైశాల్యం గల లివింగ్ రూమ్‌ల కోసం 1200mm (48 ఇంచులు) లేదా 1400mm ఫ్యాన్లు సరి పోతాయి. ఒకవేళ మీ హాల్ చాలా పెద్దదిగా ఉంటే.. ఒకే పెద్ద ఫ్యాన్ కంటే రెండు 1200mm ఫ్యాన్లను అమర్చడం వల్ల రూమ్ అంతటా చల్లదనం సమానంగా అందుతుంది. అలాగే కరెంట్ ఆదా కోసం.. ఎల్లప్పుడూ 5-స్టార్ రేటింగ్ లేదా బిఎల్డిసి (BLDC) టెక్నాలజీ ఉన్న ఫ్యాన్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×