E-Paper
Advertisement

Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!

Jio Plans: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో 13 ఓటీటీ యాప్స్ ఫ్రీ!
Advertisement

Jio Plans: రిలయన్స్ జియో ఇటీవల ప్రవేశపెట్టిన రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ టెలికాం మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఓటీటీ (OTT) ప్రియులను రోజూ ఎక్కువ డేటా వినియోగించే వారిని టార్గెట్ చేస్తూ జియో ఈ ప్లాన్‌ను డిజైన్ చేసింది. కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా ఏకంగా 13 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్లను ఇందులో ఉచితంగా ఇస్తుండటం విశేషం.

రోజూ 2GB డేటా.. అపరిమిత కాల్స్

28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మాట్లాడుకునే సదుపాయం జియో కల్పిస్తోంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ (SMS) లు కూడా లభిస్తాయి.

13 ఓటీటీ యాప్‌లు ఫ్రీ!

Advertisement

రూ. 448 ప్లాన్ లో ప్రధాన ఆకర్షణగా ఉచిత ఓటీటీ బెనిఫిట్స్ నిలుస్తున్నాయి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఏకంగా 13 ఓటీటీలకు యాక్సెస్ లభిస్తుంది. సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్‌కోడ్ తదితర ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.

ఉచిత 5G డేటా కూడా..

ఈ ప్లాన్ కింద అపరిమిత 5G డేటాను పొందే ఛాన్స్ ను కూడా జియో కల్పిస్తోంది. మీరు జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అర్హులై ఉండి మీ ప్రాంతంలో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటే.. ఈ ప్లాన్‌తో మీరు అన్‌లిమిటెడ్ 5G డేటాను పూర్తిగా ఉచితంగా వాడుకోవచ్చు. దీనికి రోజూవారి 2GB లిమిట్‌తో సంబంధం ఉండదు.

Advertisement

Also Read: జియో సూపర్ ఆఫర్.. సంవత్సరం పాటు.. రోజూ 2.5GB డేటా, నాన్ స్టాప్ వినోదం!

ఎవరికి ఇది బెస్ట్?

సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూస్తూ.. వినోదం కోసం విడివిడిగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కొనుక్కోవడానికి ఇష్టపడని వారికి ఈ రూ. 448 ప్లాన్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. రీఛార్జ్ ధర కొంచెం ఎక్కువే అనిపించినా.. 13 ఓటీటీల ఖర్చుతో పోలిస్తే ఇది ఖచ్చితంగా లాభదాయకమైన డీల్ అని చెప్పవచ్చు.

Also Read: వాట‌ర్ బాయ్ గా వాడుకున్నారు, ఇప్పుడు డ్రెస్సింగ్ రూంలో వెలివేశారు..దీన స్థితిలో అర్జున్ టెండూల్క‌ర్

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×