E-Paper
Advertisement

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!
Advertisement

Laptops with Long Battery: ల్యాప్‌ టాప్ వాడే ప్రతి ఒక్కరికీ బ్యాటరీ లైఫ్ అనేది చాలా ముఖ్యం. కొద్దిసే సేపు వాడగానే చార్జింగ్ అయిపోతే.. చాలా ఇబ్బంది కలుగుతుంది. అసలు మీ ల్యాప్‌ టాప్ బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో ఎప్పుడైనా గమనించారా? విండోస్ , మ్యాక్ ల్యాప్‌ టాప్‌లలో బ్యాటరీ ఆరోగ్యాన్ని ఈజీగా ఎలా చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే.. మార్కెట్లో ఏకధాటిగా 8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే అద్భుతమైన టాప్-5 ల్యాప్‌టాప్‌ల వివరాలు , వాటి ధరలు కూడా తెలుసుకుందాం.

ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయడం ఎలా?

విండోస్ ల్యాప్‌టాప్‌లో : మీ కీబోర్డ్‌పై Windows + R బటన్‌లను నొక్కి, ఓపెన్ అయిన రన్ బాక్స్‌లో cmd అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ powercfg /batteryreport అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే.. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీకి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ఒక HTML ఫైల్‌గా సేవ్ అవుతుంది. దాన్ని ఏదైనా బ్రౌజర్‌లో ఓపెన్ చేసి బ్యాటరీ ఒరిజినల్ కెపాసిటీ, ప్రస్తుత కెపాసిటీని చెక్ చేయొచ్చు.

Advertisement

మ్యాక్‌బుక్‌లో (MacBook): స్క్రీన్ పైనున్న ఆపిల్ లోగోపై క్లిక్ చేసి System Settingsలోకి వెళ్లండి. అక్కడ Battery ఆప్షన్‌ను సెలక్ట్ చేసే.. Battery Health కనిపిస్తుంది. ఇది మీ బ్యాటరీ నార్మల్‌గా ఉందా లేదా సర్వీస్ అవసరమా అనే పూర్తి వివరాలను ఇది తెపుతుంది.

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే టాప్-5 ల్యాప్‌టాప్‌లు:

రోజంతా ఆఫీస్ పనులు లేదా కాలేజ్ క్లాసుల కోసం చార్జర్ వెంట పెట్టుకుని తిరగలేము.  కాబట్టి మీకు ఉపయోగపడే మార్కెట్లో.. 8 గంటలకు పైగా పవర్ బ్యాకప్ ఇస్తూ ట్రెండింగ్‌లో ఉన్న టాప్ ల్యాప్‌టాప్‌లు ఇవే..

1. Apple MacBook Air (M-Series / M4 / M5):

Advertisement

బ్యాటరీ బ్యాకప్ విషయంలో.. మ్యాక్‌బుక్ ఎయిర్‌కు సాటి ఏదీ లేదు. ఒక్క సారి చార్జ్ చేస్తే ఇది ఈజీగా 15 నుంచి 18 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్‌కు ఇది బెస్ట్ ఛాయిస్.

ధర: సుమారు రూ.99,999 నుంచి ప్రారంభమవుతుంది.

2. HP 14 / OmniBook సిరీస్:

హెచ్‌పీ నుంచి వస్తున్న ఈ లేటెస్ట్ సిరీస్ ల్యాప్‌ టాప్‌లు పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో పాటు 8 నుంచి 10 గంటల నిరంతర బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. దీనిలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది.

ధర: సుమారు రూ.74,990 నుంచి లభిస్తుంది.

3. ASUS Vivobook S16 / 14 Flip:

బెస్ట్ OLED డిస్‌ప్లే, అద్భుతమైన పవర్ ఎఫీషియెన్సీతో.. ఆసుస్ వివోబుక్ సిరీస్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఇది రోజంతా (8-10 గంటలు) చార్జింగ్ టెన్షన్ లేకుండా పని చేస్తుంది.

ధర: సుమారు రూ.55,000 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

4. Lenovo IdeaPad Slim 5 / Flex సిరీస్:

బడ్జెట్ ధరలో ఎక్కువ బ్యాకప్ కోరుకునే వారికి లెనోవో ఐడియాప్యాడ్ సిరీస్ పర్ఫెక్ట్. సాధారణ ఆఫీస్ వర్క్ , బ్రౌజింగ్‌కు ఇది ఈజీగా 8 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది.

ధర: సుమారు రూ.48,000 నుంచి లభిస్తుంది.

5. Acer Aspire Lite సిరీస్:

తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే స్టూడెంట్స్ కోసం ఏసర్ ఆస్పైర్ లైట్ చక్కటి ఆప్షన్. ఇది రోజువారీ అవసరాలకు సరిపడేలా బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

ధర: సుమారు రూ.42,000 నుంచి ప్రారంభమవుతుంది.

Related News

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

Big Stories

Advertisement
×