E-Paper
Advertisement

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే
Advertisement

MBA vs engineering salary in India| ఒకప్పుడు ఇంజినీరింగ్ డిగ్రీ అంటే మంచి ఉద్యోగానికి బలమైన మెట్టుగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. టెక్నాలజీతో పాటు బిజినెస్ అవగాహన ఉన్నవారికి కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజా క్యాంపస్ ట్రెండ్స్ ఈ మారుతున్న ఉద్యోగ మార్కెట్‌పై ఆసక్తికరమైన సంకేతాలను చూపిస్తున్నాయి.

ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు ఎక్కువ ప్యాకేజీలు

డెలాఇట్ ఇండియా క్యాంపస్ వర్క్‌ఫోస్ ట్రెండ్స్ (Deloitte India Campus Workforce Trends) 2026 నివేదిక ప్రకారం.. ఎంబీఏ గ్రాడ్యుయేట్ల క్యాంపస్ ప్యాకేజీలు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. 2026 ప్లేస్‌మెంట్ సైకిల్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్ల ప్యాకేజీలు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే 52 శాతం ఎక్కువగా ఉన్నాయి. 2027లో ఈ వ్యత్యాసం 59 శాతానికి చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. కంపెనీలు యువ ఉద్యోగుల నుంచి కేవలం టెక్నికల్ నైపుణ్యాలను మాత్రమే ఆశించడం లేదు. బిజినెస్‌ను అర్థం చేసుకునే సామర్థ్యానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

టెక్నికల్ స్కిల్స్ మాత్రమే ఇప్పుడు సరిపోవడం లేదు

Advertisement

భారత్‌లో ఇంజినీరింగ్‌కు ఇప్పటికీ మంచి ప్రాధాన్యత ఉంది. కంపెనీలకు ఇంజినీర్లు, డెవలపర్లు, డేటా నిపుణులు, సెమీకండక్టర్ నిపుణులు అవసరమే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక టెక్నికల్, రిపీటివ్ పనులను వేగంగా నిర్వహిస్తోంది. కోడింగ్, డేటా విశ్లేషణ వంటి పనుల్లో AI వినియోగం పెరుగుతోంది. దీంతో టెక్నాలజీని బిజినెస్ టార్గెట్స్‌తో అనుసంధానించగల ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది.

టెక్నాలజీతో పాటు బిజినెస్ తెలిసిన వారికి అవకాశాలు

ఆధునిక కంపెనీలకు టెక్నాలజీ, బిజినెస్ రెండింటినీ అర్థం చేసుకునే నిపుణులు అవసరం అవుతున్నారు. ఈ అవసరం ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో కనిపిస్తోంది. ప్రొడక్ట్ మేనేజర్లు టెక్నికల్ సామర్థ్యాలతో పాటు కస్టమర్ల అవసరాలను కూడా అర్థం చేసుకోవాలి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిపుణులు టెక్నాలజీ వినియోగాన్ని బిజినెస్ ఫలితాలతో అనుసంధానించాలి.

ఎంబిఏ కాలేజీ కూడా జీతాన్ని ప్రభావితం

Advertisement

ఎంబిఏ చదివితే అందరికీ భారీ జీతం వస్తుందని అనుకోవడం సరైనది కాదు. కాలేజీ స్థాయి, ఫీజులు, రిక్రూటర్లు, అవకాశాలు కూడా కీలకంగా ఉంటాయి. నివేదిక ప్రకారం.. టాప్ 10 బిజినెస్ స్కూళ్ల విద్యార్థుల సగటు ప్యాకేజీ FY26లో రూ.27.4 లక్షలుగా ఉంది. టియర్-3 బిజినెస్ స్కూళ్లలో ఈ సగటు రూ.8.4 లక్షలుగా నమోదైంది. టాప్ సంస్థల బీ టెక్ గ్రాడ్యుయేట్ల సగటు ప్యాకేజీ రూ.18.7 లక్షలుగా ఉంది. టియర్-3 సంస్థల్లో అది రూ.5.75 లక్షలుగా ఉంది.

ఏఐ కారణంగా ఉద్యోగాల్లో నైపుణ్యాలకు కొత్త విలువ

డెలాఇట్ ప్రకారం 86 శాతం కంపెనీలు ఏఐ తమ రిక్రూట్‌మెంట్ విధానాలను ప్రభావితం చేస్తోందని తెలిపాయి. సుమారు 35 శాతం సంస్థలు కొత్త ఉద్యోగాలు లేదా మారుతున్న నైపుణ్య అవసరాలను గుర్తించాయి. ఏఐ, డేటా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు 20 నుంచి 25 శాతం వరకు జీత ప్రీమియం లభించవచ్చని నివేదిక పేర్కొంది. అనలిటికల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా 10 నుంచి 15 శాతం వరకు ప్రీమియం అందించవచ్చు.

ఇంజినీరింగ్‌కు మంచి భవిష్యత్తు

ఎంబీఏ ప్యాకేజీలు పెరగడం వల్ల ఇంజినీరింగ్ విలువ తగ్గిపోయిందని భావించాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ, డేటా, సెమీకండక్టర్స్ వంటి రంగాల్లో ఇంజినీర్లకు ఇంకా బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇంజినీర్లు బిజినెస్ నైపుణ్యాలను పెంచుకుంటే ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ, కన్సల్టింగ్ వంటి రంగాల్లోకి వెళ్లవచ్చు.
అదేవిధంగా ఎంబిఏ గ్రాడ్యుయేట్లు.. ఏఐ, డేటా, డిజిటల్ టెక్నాలజీలపై అవగాహన పెంచుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.

Also Read: ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

విద్యార్థులు ఎంబిఏ లేదా ఇంజినీరింగ్ లో ఏది ఎంచుకోవాలి?

కేవలం ప్రస్తుత జీతాలను చూసి డిగ్రీని ఎంచుకోవడం మంచిది కాదు. విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలు, కెరీర్ లక్ష్యాలను పరిగణించాలి. టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారికి ఇంజినీరింగ్ మంచి ఎంపికగా ఉంటుంది. బిజినెస్, మేనేజ్‌మెంట్, స్ట్రాటజీపై ఆసక్తి ఉన్నవారికి ఎంబిఏ ఉపయోగకరంగా ఉండవచ్చు. భవిష్యత్తులో టెక్నాలజీ, బిజినెస్ నైపుణ్యాలను కలిపి నేర్చుకునే వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.

భవిష్యత్ కెరీర్‌లో నిరంతర అభ్యాసమే కీలకం

ఉద్యోగ మార్కెట్ ఇప్పుడు కేవలం ఎంబిఏ, ఇంజినీరింగ్ మధ్య పోటీగా ఉండడడం లేదు. కంపెనీలు వేగంగా నేర్చుకునే, మార్పులకు అనుగుణంగా పనిచేసే, సమస్యలను పరిష్కరించే నిపుణులను కోరుకుంటున్నాయి. డిగ్రీ కెరీర్‌కు తలుపులు తెరవవచ్చు. కానీ నైపుణ్యాలు, అనుభవం, నిరంతర అభ్యాసం కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తాయి.

Also Read: రెబెల్స్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తలవంచరు

Related News

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎం ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

పతనమవుతున్న బంగారం ధర.. అంతర్జాతీయ పరిణామాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు పరిశీలిద్దాం

Big Stories

Advertisement
×