E-Paper
Advertisement

Cheapest Portable Blenders: వావ్, అతి తక్కువ ధరకే జ్యూసర్లు.. వీటిని మీతోపాటే ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు!

Cheapest Portable Blenders: వావ్, అతి తక్కువ ధరకే జ్యూసర్లు.. వీటిని మీతోపాటే ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు!

Cheapest Portable Blenders: సెగలు కక్కుతున్న ఈ ఎండలో బయట తిరిగి వచ్చిన వెంటనే ఏదైనా చల్లగా తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపించడం కామన్. అయితే ప్రతిసారీ ఫ్రిడ్జ్‌లోని ఐస్ వాటర్‌ను తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి సమయాల్లో తాజా పండ్ల రసాలను అప్పటికప్పుడు చేసుకుని తాగితే శరీరం చల్లబడటమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉండొచ్చు.

దీనికోసం భారీ మిక్సీలతో పనిలేకుండా, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగే రీఛార్జబుల్ పోర్టబుల్ బ్లెండర్లు ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. కేవలం జిమ్‌కో, ఆఫీసుకో వెళ్లేవారే కాకుండా ప్రయాణాలు చేసే వారికి కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రూ.500 నుంచి మొదలయ్యే టాప్-5 పోర్టబుల్ బ్లెండర్ల గురించి తెలుసుకుందాం..

1) KIVNEX Portable Blender 

తక్కువ బడ్జెట్‌లో మంచి బ్లెండర్ కోసం చూస్తుంటే కివ్నెక్స్ మోడల్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.497 వరకు ఉంటుంది. ఈ జ్యూస్ బ్లండర్ ప్రత్యేకత ఏంటంటే.. దీనితో పాటు రెండు జార్‌లు వస్తాయి. రోజూ ఆఫీసుకి వెళ్లేవారు లేదా జిమ్‌లో ప్రోటీన్ షేక్స్ తాగేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్నగా, తేలికగా ఉండటం వల్ల దీన్ని బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

2) Keiby Citom Portable Juicer 

కేవలం రూ.399కే లభించే ఈ బ్లెండర్‌లో ఆరు బ్లేడ్లు ఉండటం వల్ల పండ్ల ముక్కలను త్వరగా జ్యూస్‌గా మారుస్తుంది. దీని కప్పు 380 ఎం.ఎల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది USB ద్వారా ఛార్జ్ అవుతుంది కాబట్టి.. పవర్ బ్యాంక్ లేదా లాప్‌టాప్‌తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు, బ్యాచిలర్లకు వీటిని గిఫ్ట్‌గా కూడా ఇవ్వొచ్చు.

Also Read: వన్‌ప్లస్ నుంచి శాంసంగ్ వరకు.. ఏప్రిల్‌లో విడుదలయ్యే క్రేజీ ఫోన్ల లిస్ట్ ఇదే!

3) Basic USB Mini Juicer 

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో రూ.299 నుండి రూ.500 మధ్యలో రకరకాల బేసిక్ మోడల్స్ కనిపిస్తుంటాయి. ఇవి చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నా.. ఒక్క వ్యక్తికి సరిపడా జ్యూస్‌ను ఇట్టే తయారు చేస్తాయి. మొదటిసారి పోర్టబుల్ బ్లెండర్ వాడాలనుకునే వారు ఇలాంటి తక్కువ ధర మోడల్స్‌తో మొదలుపెట్టవచ్చు. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభం.

4)  QLECT 45W Blender 

కాస్త పవర్‌ఫుల్ బ్లెండర్ కావాలనుకుంటే.. ఈ క్యూలెక్ట్ మోడల్ బాగుంటుంది. దీని ధర రూ.684 వరకు ఉంటుంది. దీనిలో 1500mah బ్యాటరీ ఉండటం వల్ల ఎక్కువ సేపు ఛార్జింగ్ వస్తుంది. అలాగే మూడు రకాల స్పీడ్ సెట్టింగ్స్ ఉండటం వల్ల పండ్ల రకాన్ని బట్టి మనం వేగాన్ని మార్చుకోవచ్చు. ఇది గట్టిగా ఉండే పండ్లను కూడా మెత్తగా బ్లెండ్ చేయగలదు.

5)  Blendmate Eco/ TR6 Blender 

రూ.699 ధరలో లభించే ఈ బ్లెండర్ కాస్త క్వాలిటీగా అనిపిస్తుంది. ఇది 200 వాట్ల పవర్‌తో పనిచేస్తుంది కాబట్టి.. పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. బ్యాంకు ఆఫర్లు ఉంటే ఇది ఇంకా తక్కువ ధరకే దొరుకుతుంది. నాణ్యతతో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ బ్లండర్ ఇట్టే నచ్చేస్తుంది. ఈ వేసవిలో బయట దొరికే కృత్రిమ పానీయాల కంటే ఇలాంటి బ్లెండర్ కొనుక్కుని తాజా జ్యూస్‌లు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

 

Related News

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

Big Stories

×