E-Paper
Advertisement

Gaddar Awards 2025 : నవ్వించలేకపోతే యాక్టింగ్ మానేస్తా… గద్దర్ అవార్డుతో మాట నిలబెట్టుకున్న యంగ్ హీరో

Gaddar Awards 2025 : నవ్వించలేకపోతే యాక్టింగ్ మానేస్తా… గద్దర్ అవార్డుతో మాట నిలబెట్టుకున్న యంగ్ హీరో
Advertisement

Gaddar Awards 2025 : తెలుగు సినిమా రంగంలో తన ప్రారంభ దశలోనే ధైర్యవంతమైన ప్రకటన చేసి, అందరినీ ఆశ్చర్యపరిచిన యంగ్ హీరో కృష్ణ బురుగుల. ఇప్పుడు గద్దర్ అవార్డు వేదికపై నిలిచి మాట నిలబెట్టుకున్నారు. ‘జిగ్రీస్’ సినిమా ప్రమోషన్ల సమయంలో ఆయన నేను ప్రేక్షకులను నవ్వించలేకపోతే నటన మానేస్తాననే మాట అప్పట్లో చాలా మందికి అతిగా అనిపించింది. కానీ ఆ మాట వెనుక ఉన్న ఆత్మవిశ్వాసం, కఠినమైన కృషి ఈరోజు ఫలితం ఇచ్చింది.

‘జిగ్రీస్’తో నవ్వుల దర్బార్

‘జిగ్రీస్’ సినిమాలో కృష్ణ బురుగుల చూపించిన సహజమైన హాస్యం, ఎనర్జీ, సరదా నటన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. సినిమా విడుదలైన తర్వాత ఆయన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే ట్రోల్స్, సినిమా విడుదలైన తర్వాత ఆయన పాత్ర సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ట్రోల్స్, విమర్శలను పట్టించుకోకుండా తన పనితీరుతో సమాధానం చెప్పాడు. ఇప్పుడు కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, గుర్తుండిపోయే సినిమాలు, పాత్రలు చేయడంపైనే ఆయన దృష్టి పెట్టాడు. రాబోయే కాలంలో టాలీవుడ్‌లో టాప్ నటుల్లో ఒకరిగా కృష్ణ బురుగుల్ ఎదగడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

గద్దర్ అవార్డుతో మాట నిలబెట్టుకున్న యంగ్ హీరో

Advertisement

తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో కృష్ణ బురుగులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు దక్కింది. అవార్డు స్వీకరించేటప్పుడు ఆయన ముఖంపై కనిపించిన సంతోషం, ఒకప్పుడు చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఆనందం అందరినీ కదిలించింది. ఈ విజయం గురించి మాట్లాడుతూ కృష్ణ బురుగుల్, నా మాటను నిలబెట్టుకోగలిగాను, ఇది నాకు మాత్రమే కాకుండా, నన్ను నమ్మిన అందరికీ సంతోషమని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన పేరు బాగా వినిపిస్తోంది. వచ్చే రోజుల్లో మరిన్ని అవార్డులు గెలుచుకునే క్రేజీ నటుడు అవ్వడంలో సందేహం లేదని తెలుస్తోంది ఈ నటుడి యాక్టింగ్ చూస్తుంటే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×