Best Air Coolers 2026: ప్రస్తుతం ఎండలు ఎలా ఉన్నాయంటే ఉదయం 9 దాటిందంటే చాలు వేడి సెగలను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో ఇంట్లో కూలర్ ఉన్నా కూడా ఒక్కోసారి వేడి గాలి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా? దానికి కారణం కూలర్ పంప్ సరిగ్గా లేకపోవడమో లేక ట్యాంక్ చిన్నది కావడమో కాదు.. అసలు విషయం ఆ కూలర్లో ఉండే ప్యాడ్లే.
చాలామంది గాలి స్పీడ్‌గా వస్తే చాలు అనుకుంటారు కానీ.. ఆ గాలి ఎంత చల్లగా వస్తుందనేది అందులో ఉండే హనీకోంబ్ ప్యాడ్ల మందం మీద ఆధారపడి ఉంటుంది. ప్యాడ్లు ఎంత మందంగా ఉంటే.. అవి అంత ఎక్కువ నీటిని పీల్చుకుని గాలిని చల్లబరుస్తాయి. అప్పుడే మనకు ఏసీ లాంటి చల్లదనాన్ని అందిస్తుంది. మరి ఈ సమ్మర్‌లో బెస్ట్ కూలింగ్ ఇచ్చే కొన్ని టాప్ డెసర్ట్ కూలర్ల గురించి తెలుసుకుందామా..
పెద్ద హాల్లో కూలర్లను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సింఫనీ స్టార్మ్ మోడల్ చాలా బాగా సెట్ అవుతుంది. దీనిలో మూడు వైపులా మందపాటి హనీకోంబ్ ప్యాడ్లు ఉంటాయి. దీని వల్ల గాలి ఒకే వైపు కాకుండా గది అంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. ఇది 89 లీటర్ల పెద్ద ట్యాంక్ ఉండటం వల్ల రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. దీంతో మధ్యలో లేచి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఈ కూలర్లతో కరెంటు బిల్లు కూడా తక్కువగానే వస్తుంది కాబట్టి.. మధ్యతరగతి వాళ్లకు ఇది మంచి ఛాయిస్.
ఓరియంట్ కంపెనీ ఈ కూలర్‌లో డెన్స్‌నెస్ట్ అనే టెక్నాలజీని వాడారు. దీంతో ప్యాడ్లు చాలా దగ్గరగా, మందంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గాలి తొందరగా వేడెక్కిపోకుండా ఈ ప్యాడ్లు కాపాడతాయి. గాలిని దాదాపు 60 అడుగుల దూరం వరకు విసిరే సత్తా దీనికి ఉంది. 190 వాట్ల కరెంటుతోనే నడిచే ఈ కూలర్ పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా తగ్గదు. హాల్‌లో టీవీ చూస్తున్నప్పుడు దూరం కూర్చున్నా చల్లటి గాలి తగులుతూనే ఉంటుంది.
Also Read: Find X9 Ultra లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ కెమెరా సెటప్ చూస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!
బజాజ్ అనగానే మనకు గుర్తొచ్చేది మన్నిక. ఈ కూలర్లో నార్మల్ బ్లోయర్‌కి బదులు ప్యాన్ వాడారు. అందుకే గాలి ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని హెక్సాకూల్ ప్యాడ్ల డిజైన్ వల్ల నీరు తక్కువ ఖర్చవుతూనే చల్లదనం ఎక్కువగా వస్తుంది. ఎండలు మరీ విపరీతంగా ఉన్నప్పుడు దీనిలో ఉండే ఐస్ ఛాంబర్‌లో కొన్ని ఐస్ ముక్కలు వేస్తే చాలు.. నిమిషాల్లో గది చల్లబడిపోతుంది. దీని మోటార్ కూడా చాలా కాలం వరకు మొరాయించదు.
క్రాంప్టన్ ఆప్టిమస్ కూలర్ చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాదు.. పనితీరులో కూడా బెస్ట్‌గా ఉంటుంది. దీనిలో 100 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. పైగా ఆటోఫిల్ ఆప్షన్ ఉండటం వల్ల నీళ్లు అయిపోగానే దానంతట అదే నింపుకుంటుంది. అలాగే ఈ కూలర్‌లో ఉండే ప్యాడ్లు చాలా సాంద్రత కలిగి ఉంటాయి. ముఖ్యంగా మన దగ్గర నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నా కూడా దీని పంప్ పాడవకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఇది గదిలో ఉండే వేడిని చాలా వేగంగా లాగేస్తుంది.
ఒక్కసారి నీళ్లు నింపితే రోజంతా మర్చిపోవాలి అనుకునేవాళ్ల కోసం కెన్ స్టార్ ఎయిర్ క్రూజర్ ఉంది. దీనిలో ఏకంగా 125 లీటర్ల వాటర్ ట్యాంక్ ఉంటుంది. ప్యాడ్లు కూడా ఆ ట్యాంక్ సైజుకి తగ్గట్టే చాలా మందంగా ఇచ్చారు. అలాగే ఈ కూలర్‌లో ఉండే 18 అంగుళాల పెద్ద ఫ్యాన్ వల్ల గాలి చాలా వెడల్పుగా వ్యాపిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక ఉండాలి, పెద్దగా రిపేర్లు రాకూడదు అనుకునే వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
Also Read: నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!