Vishnu Priya: విష్ణు ప్రియ పరిచయం అవసరం లేని పేరు. ఈమె బుల్లితెర యాంకర్ గా పలు కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతోమందిని సొంతం చేసుకున్న ఈమె ఇటీవల ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ పేరుతో మరింతమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు
ఇలా ఇంస్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కోసం సబ్స్క్రైబర్లు ప్రతి నెల 399 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.. ఇలా ఈమె సబ్స్క్రిప్షన్ పేరుతో ఉండే ఇంస్టాగ్రామ్ ద్వారా బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు విష్ణు ప్రియకు ఈ సబ్స్క్రిప్షన్ అకౌంట్లో సుమారు 2700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా 2700 మంది ప్రతినెల 399 చెల్లిస్తే విష్ణుప్రియ సుమారు 10 లక్షల వరకు నెలకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ ద్వారా తన బోల్డ్ ఫోటోలను షేర్ చేయడంతో ఈమెపై కేసులు కూడా నమోదు అయిన సంగతి తెలిసిందే.
యాంకర్ విష్ణుప్రియ భీమినేని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు విజయవాడ సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు సంపాదించడం కోసమే విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ లో అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అస్లీలతను ప్రోత్సహించేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అర్ధ నగ ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని వెంటనే ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేయాలి అంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
విష్ణు ప్రియ పై కేసు నమోదు..
ఈ విధంగా విష్ణు ప్రియ పట్ల కేసులు నమోదు అయినప్పటికీ ఈమె మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఈ విషయంపై స్పందించలేదు. ఇలా విష్ణు ప్రియ మాత్రమే కాకుండా మరింత మంది సెలబ్రిటీలు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ పేరుతో వారి బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రతి నెల భారీగా ఆదాయం పొందుతున్నారు. ఇక విష్ణుప్రియ కెరియర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఆట డాన్స్ షోలో ఈమె మెంటర్ గా కొనసాగుతున్నారు. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ విష్ణు ప్రియ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: ప్లీజ్ నన్ను తప్పు పట్టొద్దు..శాపంగా మారుతుందనుకోలేదు కన్నీళ్లు పెట్టుకున్న మంగ్లీ!