E-Paper
Advertisement

Best Egg Boilers: ఇవి ఉంటే చాలు.. గ్యాస్ లేకుండానే ఎగ్స్ ఉడికించొచ్చు

Best Egg Boilers: ఇవి ఉంటే చాలు.. గ్యాస్ లేకుండానే ఎగ్స్ ఉడికించొచ్చు
Advertisement

Best Egg Boiler: ఇప్పటి ఫాస్ట్ లైఫ్ స్టైల్‌లో చాలా మంది త్వరగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్ తయారు చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎగ్ బాయిలర్ అనే చిన్న కిచెన్ ప్రోడక్ట్ చాలా పాపులర్ అవుతోంది. కొన్ని నిమిషాల్లోనే.. ఎగ్స్ సరిగ్గా ఉడికించే ఈ ఫ్రొడక్ట్స్ స్టూడెంట్స్, ఉద్యోగులు, ఫ్యామిలీలకు చాలా ఉపయోగకరం. మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో పని తీరు, సామర్థ్యం, కస్టమర్ రివ్యూల ఆధారంగా 2025–2026లో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న టాప్ ఎగ్ బాయిలర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ బాయిలర్ అనేది కరెంట్‌తో పనిచేసే చిన్న కిచెన్ ఫ్రొడక్ట్. దీంతో గుడ్లను సాఫ్ట్, మీడియం, హార్డ్ బాయిల్ వంటి పలు విధాలుగా ఉడికించుకోవచ్చు. కేవలం నీరు పోసి బటన్ ఆన్ చేస్తే కొన్ని నిమిషాల్లో గుడ్లు సిద్ధమవుతాయి. గ్యాస్ అవసరం లేకుండా దీనిని సులభంగా వాడుకోవచ్చు. వివిధ రకాల ఎగ్ బాయిలర్స్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Agaro Grand Egg Boiler:
ఇది ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నారు. దీనిలో ఒకేసారి 8 గుడ్లు ఉడికించవచ్చు. అంతేకాదు 4 గుడ్లను పోచ్ చేయడం లేదా కూరగాయలు స్టీమ్ చేయడం కూడా చేయొచ్చు. ఇది 500W పవర్‌తో వేగంగా పని చేస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ బేస్, ట్రాన్స్‌పరెంట్ లిడ్ ఉండటం వల్ల వంట ఎలా అవుతుందో మీరు కూడా చూడొచ్చు.

Kent Super Egg Boiler:
ఈ మోడల్ వేగంగా, సమానంగా గుడ్లు ఉడికించడానికి ప్రసిద్ధి. దీనిలో ఒకేసారి 6 గుడ్లు ఉడికించవచ్చు. సాఫ్ట్, మీడియం, హార్డ్ బాయిల్ వంటి మూడు మోడ్‌లు కూడా దీనిలో ఉన్నాయి. ఆటోమేటిక్ షట్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్ ఉండటం దీని ప్రత్యేకత.

Advertisement

Borosil Electric Plus Egg Boiler:
ఇది అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో వచ్చే మోడల్. ఒకేసారి 8 గుడ్లుద దీనిలో ఉడికించవచ్చు. 4 గుడ్లకు ప్రత్యేక పోచింగ్ ట్రే ఉంటుంది. 500W పవర్‌తో సాధారణంగా గ్యాస్ మీద కంటే వేగంగా గుడ్లు ఉడికిస్తుంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా దీనిలో ఉంటుంది.

Philips 3000 Series Egg Cooker:
ఇది ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్‌గా మంచి పేరు సంపాదించింది. సాధారణంగా ఇండక్షన్ స్టౌతో పోలిస్తే 70% తక్కువ కరెంట్ వాడి ఇది పని చేస్తుందని చెబుతున్నారు. దీనిలో ఒకేసారి 6 గుడ్లు ఉడికించవచ్చు. ఇది గుడ్లు పూర్తిగా ఉడికినప్పుడు సిగ్నల్ టోన్ కూడా ఇస్తుంది.

Elite Cuisine Electric Egg Poacher:

ఈ మోడల్ వాడటం చాలా సింపుల్. గుడ్లు ఉడికించడంతో పాటు పోచ్ కూడా చేయవచ్చు. మెజరింగ్ కప్, హ్యాండిల్స్ వంటి ఫీచర్స్ వల్ల సేఫ్‌గా వాడుకోవచ్చు. మొదటి సారి వాడినప్పటికీ మంచి ఫలితం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఇండక్షన్ స్టౌవ్‌ స్టాక్ అవుటా? అయితే ఈ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ పై ఓ లుక్కేయండి

ఎగ్ బాయిలర్ ఉపయోగాలు:

1.తక్కువ సమయంలోనే ఎగ్స్ ఉడికుతాయి.

2.గ్యాస్ అవసరం ఉండదు

3.సాఫ్ట్, మీడియం, హార్డ్ బాయిల్ ఆప్షన్

4. కరెంట్ వాడకం తక్కువ

5. వాడటం చాలా సులభం

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:
1.కెపాసిటీ (ఎన్ని గుడ్లు ఉడికిస్తుందో)

2.కరెంట్ వినియోగం

3.ఆటో షట్ ఆఫ్ ఫీచర్

4.బ్రాండ్, క్వాలిటీ

5. వారంటీ

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×