E-Paper
Advertisement

Animal Language: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!

Animal Language: మనుషులకే కాదు.. ఈ జంతువులకూ ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్!
Advertisement

Animal Language: కబుర్లు చెప్పుకోవడం కేవలం మనుషులకు మాత్రమే వచ్చు అనుకుంటే మీరు పొరపడినట్లే. మనుషుల్లాగే జంతువులు కూడా ముచ్చట్లు పెడతాయని చాలామందికి తెలియకపోవచ్చు. కాకపోతే వాటి భాష, స్టైల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్ని పాటలు పాడితే.. మరికొన్ని సైగలతోనే మ్యాటరేంటో క్లియర్‌గా చెబుతాయట. అసలు ఏనుగులు, పక్షులు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ప్రకృతిలోని ఈ వింతైన 6 జీవుల సీక్రెట్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి..

ఆఫ్రికన్ ఏనుగు

ఏనుగులు సాధారణంగా గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. వాటి మధ్య బంధం కూడా చాలా బలంగా ఉంటుంది. ఆఫ్రికన్ ఏనుగులు చేసే గీంకారాలు మనకు వినిపిస్తాయి. కానీ వాటి అసలు కమ్యూనికేషన్ మాత్రం మనం వినలేని చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ‘ఇన్‌ఫ్రాసోనిక్’ శబ్దాల ద్వారా జరుగుతుంది. ఈ శబ్దాలు నేల, గాలి ద్వారా కిలోమీటర్ల దూరం వరకు వెళ్తాయి. దాంతో దూరంగా ఉన్న తమ గుంపుతో కూడా ఇవి సులభంగా మాట్లాడుకోగలుగుతాయి. ప్రమాదం దగ్గరపడితే కూడా ఈ శబ్దాల ద్వారానే వెంటనే హెచ్చరికలు పంపుతాయి.

ఇంద్రీ

Advertisement

మడగాస్కర్ అడవుల్లో కనిపించే అరుదైన లెమర్ జాతి ఇదే ఇంద్రీ. వీటి కమ్యూనికేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి మాటలకన్నా పాటలతోనే ఎక్కువగా మాట్లాడుకుంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే రాగంలో కోరస్‌లా పాడటం వీటి ప్రత్యేకత. ఈ పాటలు అడవి అంతా మారుమ్రోగుతాయి. దీనివల్ల తమ ప్రాంతాన్ని తెలియజేయడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య బంధం కూడా బలపడుతుంది.

Also Read: సముద్ర గర్భంలో సంగీత కచేరీ.. పులిలా గర్జించే, డ్రమ్స్ వాయించే వింత చేపల గురించి మీకు తెలుసా?

కాకాపో

Advertisement

కాకాపో అనే పక్షి అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. ఇవి ఎక్కువగా రాత్రివేళల్లో చురుగ్గా ఉంటాయి. ప్రత్యేకంగా సంతానోత్పత్తి కాలంలో మగ కాకాపోలు చాలా లోతైన ‘బూమింగ్’ శబ్దాలు చేస్తాయి. ఈ శబ్దాలు దట్టమైన అడవుల్లో కూడా చాలా దూరం వరకు వినిపిస్తాయి. ఆడ పక్షులు ఆ శబ్దం వినగానే.. తమ భాగస్వామి ఎక్కడున్నాడో సులభంగా గుర్తించగలుగుతాయి.

నర్వాల్

నర్వాల్‌లను చాలామంది ‘సముద్రపు యూనికార్న్’ అని కూడా పిలుస్తారు. ఇవి ఆర్కిటిక్ మంచు నీళ్లలో జీవిస్తాయి. నీటి అడుగున ఇవి చేసే క్లిక్ శబ్దాలు, ఈలలు చాలా వింతగా ఉంటాయి. కానీ అదే వీటి కమ్యూనికేషన్ భాష. ఈ శబ్దాల ద్వారానే ఇవి సముద్రంలో దారి తెలుసుకుంటాయి, ఆహారాన్ని వెతుక్కుంటాయి, అలాగే తమ గుంపులోని ఇతర నర్వాల్‌లతో కూడా సంబంధం కొనసాగిస్తాయి.

ప్రేరీ డాగ్

ప్రేరీ డాగ్ అనే చిన్న జీవులకు జంతు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ‘భాష’ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి కేవలం ప్రమాదం ఉందని చెప్పడమే కాదు.. పూర్తి సమాచారం కూడా అందిస్తాయి. ఉదాహరణకు: అది పక్షినా? లేక మనిషా? వాళ్ల పరిమాణం ఎంత? ఏ దిశలో వస్తున్నారు? ఎంత వేగంగా వస్తున్నారు? ఇలాంటి వివరాలన్నీ తమ ప్రత్యేకమైన శబ్దాల ద్వారా తోటి జీవులకు తెలియజేస్తాయి.

సిఫాకా

మడగాస్కర్‌లో కనిపించే మరో అరుదైన జాతి సిఫాకా. వీటి కమ్యూనికేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇవి కేవలం శబ్దాల మీదనే ఆధారపడవు. బాడీ లాంగ్వేజ్, వాసనల ద్వారా కూడా కమ్యూనికేట్ అవుతాయి. చెట్లపై ఒక చోటు నుంచి మరోచోటికి వెళ్లేటప్పుడు సమన్వయం చేసుకోవడానికి, అలాగే కుటుంబ సభ్యులతో అనుబంధం కొనసాగించడానికి ఈ పద్ధతులను ఉపయోగిస్తాయి.

Also Read: గంటకు 115 కి.మీ వేగంతో దూసుకొచ్చిన వరద.. మధ్యధరా సముద్రాన్ని పుట్టించిన భయంకర ప్రళయం ఇదే!

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×