BigTV English

Best Gadgets Under 500 In Flipkart : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

Best Gadgets Under 500 In Flipkart : ఇదేం సేల్ అయ్యా బాబు.. మరీ ఇంత చీపా.. రూ.500లోపే ఎన్ని గాడ్జెట్స్​ కొనొచ్చో!

Best Gadgets Under 500 in Flipkart : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సెల్ లో భాగంగా తన కస్టమర్స్ కోసం ఎన్నో ఆఫర్స్ ను తీసుకొచ్చింది. ఈ సెల్ లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ తో పాటు అతి తక్కువ ధరలకే ఎన్నో ఉపయోగపరమైన వస్తువులు లభిస్తున్నాయి. సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సేల్లో ఆర్డర్స్ ఇప్పటికే హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి. లిమిటెడ్ సేల్లో భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న ఫ్లిప్ కార్ట్ లో తక్కువ ధరకే కొనగలిగే అవసరమైన వస్తువులు లిస్ట్ చాలానే ఉంది. ఓ లుక్కేయండి మరి!


ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో ఆఫర్స్ తో కస్టమర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టాప్ బ్రండెడ్ ఎలక్ట్రానిక్స్ తో పాటు ఐఫోన్స్ పై సైతం భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఐఫోన్ 15, 13పై కళ్లు చెదిరే ఆఫర్స్ అందించింది. ఇక ఆపిల్, సామ్ సాంగ్, రియల్ మీ, వీవో బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ ను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్ల సౌకర్యార్ధం డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఇచ్చేసింది. ఈ సేల్లో కొనుగోలు చేస్తే భారీగా పొదుపు చేసే అవకాశం సైతం ఉంది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ సేల్లో రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంతో ఉపయోగకరమైన గాడ్జెట్స్ ను కొనుగోలు చేయవచ్చు.

portable sealing machine ఎంతో చిన్నది కానీ నిత్యం ఉపయోగించే పరికరమే పోర్టబుల్ సీలింగ్ మెషిన్. స్నాక్స్, ఫుడ్ పాకెట్‌లను సులభంగా సీల్ చేయటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కేవలం రూ.300కే ఈ మెషిన్ను కొనుగోలు చేయవచ్చు.


Gadget Cleaning Kit ల్యాప్‌టాప్, ఫోన్, ఇయర్‌ఫోన్స్ శుభ్రం చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ఒక క్లాత్ తో పాటు బ్రష్ కూడా ఉంటుంది. ఇక 20 డిఫరెంట్ టూల్స్ ఉండే ఈ కిట్ను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ నుండి రూ. 499కి నుగోలు చేయవచ్చు.

laptop stand వర్క ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు నిత్యం ఉపయోగపడే సాధనం ల్యాప్ టాప్ స్టాండ్. ఈ స్టాండ్ తో వర్క్ సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్ రాకుండా రోజంతా కంఫర్టబుల్ గా పని చేసుకోవచ్చు. ఈ సేల్ లో ల్యాప్ టాప్ స్టాండ్ అతి తక్కువ ధరకే లభిస్తుంది. రూ.500 లోపే ఎన్నో రకాల స్టాండ్స్ అందుబాటులో ఉన్నాయి.

ALSO READ : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!

mobile ring light stand ఫోటోగ్రాఫర్‌లకు ఉపయోగపడే అద్భుతమైన గాడ్జెట్. అవసరాన్ని బట్టి దీన్ని కెమెరా లైట్‌గా కూడా వాడుకోవచ్చు. ఫొటో, వీడియోలు అద్భుతంగా రావాలంటే దీన్ని ఉపయోగించాల్సింది. ఇక ప్లిప్ కార్ట్ సేల్ లో రూ.500 కంటే తక్కువ ధరకే ఎన్నో ఫీచర్లతో ఈ లైట్స్ అందుబాటులో ఉన్నాయి.

bulbs light బల్బ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్టిఫుల్ పర్పస్ లో ఉపయోగించే కొన్ని రకాల బల్బ్బ్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయ్యెచ్చు. ఇక ఛార్జింగ్ బల్బ్స్ తో పాటూ ఎల్ఈడీ బల్బులు సైతం రూ. 500లోపే అందుబాటులోకి వచ్చేశాయి.

Related News

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Xiaomi Rival iPhone 17: ఐఫోన్ 17కు సవాల్.. రాబోతోంది షావోమీ సూపర్ ఫోన్

Budget iPhone: దసరా పండగ ఆఫర్‌లో టాప్ 5 బడ్జెట్ ఫోన్లు.. రూ.10 వేల లోపే!

SmartPhone Comparison: ఒప్పో F31 ప్రో ప్లస్ vs నథింగ్ ఫోన్ 3ఏ ప్రో.. ఏది కొనుగోలు చేయాలి?

Big Stories

×