E-Paper
Advertisement

iphone Fastest Delivery : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!

iphone Fastest Delivery : ఐఫోన్ రాక్… కస్టమర్ షాక్.. జెట్ స్పీడ్ లో డెలివరీ!
Advertisement

iphone Fastest Delivery : ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​ 2024 భారత్​ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సేల్స్​లో స్మార్ట్​ ఫోన్స్​, ఇతర ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్​ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రతి ఏడాది ఐఫోన్లు నిమిషాల్లో వేలల్లో అమ్ముడుపోతుంటాయి. అలానే ఈ సంవత్సరం కూడా ఐఫోన్​ స్టాక్స్​ ఎక్కువగా ఉండటం, నిమిషాల్లోనే అమ్ముడుపోవడం చూస్తున్నాం. దీంతోపాటే గూగుల్ పిక్సల్​ 8 సహా ఇతర స్మార్ట్ ఫోన్లను యూజర్స్ కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ స్మార్ట్​ ఫోన్ల డెలివరీని కూడా తొందరగానే అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. ఓ ఐఫోన్ 15ను ఆర్డర్ చేసిన ఫ్లిప్ కార్ట్ కస్టమర్​కు కేవలం 8 నిమిషాల్లోనే దాన్ని అందుకోవడం ఆసక్తికరంగా మారింది. అది ఎలా జరిగింది, ఎవరు ఈ ఐఫోన్​ను అంత త్వరగా అందుకున్నారో తెలుసుకుందాం.

కేవలం 8 నిమిషాల్లో డెలివరీ – బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ ఈ 8 నిమిషాల్లో ఐఫోన్ 15ను అందుకున్నాడు. అతడు ఫ్లిప్ కార్ట్ మినిట్స్ సర్వీస్ ద్వారా ఈ ఐఫోన్​ ఆర్డర్​ పెట్టాడు. అయితే తాను ఆర్డర్ చేసిన ఆ ఐఫోన్ 15ను ఆ కస్టమర్ కేవలం 8 నిమిషాల్లో అందుకోవడంతో హర్షం వ్యక్తం చేశాడు. అద్భుతమైన డెలివరీ ఎక్స్ పీరియన్స్ లభించిందని పేర్కొన్నాడు.
“నేను నా ఐఫోన్​ 15ను ఫ్లిప్​కార్ట్​ నుంచి కేవలం 8 నిమిషాల్లోనే అందుకున్నాను. మీరు ఎక్కడికి ప్రయాణించినా, మీకు ఒకవేళా ఐఫోన్, మ్యాక్​ బుక్ లేదా ఇంకేదైనా తక్షణమే కావాలంటే, మీరు దాన్ని కేవలం 8 నిమిషాల్లో పొందగలవచ్చు. చాలా థాంక్స్ ఫ్లిప్ కార్ట్!” అంటూ తన ఆనందాన్ని తెలిపాడు. కాగా, బ్లింకిట్, జెప్టో వంటి డెలివరీ సేవలు కూడా ఐఫోన్​ను నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అలానే ఫ్లిప్ కార్ట్ మినిట్స్ సర్వీస్​ కూడా తన యూజర్స్​కు సూపర్ ఫాస్ట్ డెలివరీని అందిస్తోంది.

Advertisement

READ ALSO : ఓడియమ్మా ఇదెక్కడి ఆఫర్.. టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై ఏకంగా 65% డిస్కౌంట్..!

ఆ స్మార్ట్ ఫోన్లపై కూడా బోలెడెన్నీ డీల్స్, ఆఫర్లు – ఐఫోన్ 15తో పాటు ఇతర బ్రాండెడ్​, బడ్జెట్​ స్మార్ట్ ఫోన్లు వంటి వాటిపై కూడా ఫ్లిప్​ కార్ట్ బిగ్ బిలియన్ డేస్​ సేల్​లో అదిరే ఆఫర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), గూగుల్ పిక్సెల్ 8(Google Pixes 8), సహా పలు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై, సీఎంఎఫ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ (2ఎ) వంటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో సూపర్ డిస్కౌంట్లతో దొరుకుతున్నాయి.

Advertisement

ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 8 (google pixel) స్మార్ట్ ఫోన్​పై అయితే కళ్లు చెదిరే ఆఫర్​ అందుబాటులో ఉంది. అన్ని ఆఫర్లను కలిపి సుమారు రూ.32,000లకే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్​ అద్భుతమైన సాఫ్ట్వేర్, క్లాస్-లీడింగ్ స్టిల్ కెమెరా, కాంపాక్ట్ డిజైన్​తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పిక్సెల్ 8తో పాటు, ఐఫోన్ 15 వంటి కాంపాక్ట్ డివైజ్ లాంటి స్మార్ట్ ఫోన్​ కోసం ఎదురు చూస్తున్నవారికి గెలాక్సీ ఎస్ 23 బెస్ట్ ఛాయిస్​. 6.1 ఇంచ్​ డిస్ ప్లేతో ఇది వచ్చింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్​ 2 చిప్ సెట్​తో పాటు, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్​ ఫీచర్స్​ కూడా ఇందులో ఉన్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×