E-Paper
Advertisement

బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్.. వర్షాకాలంలోనూ నో టెన్షన్

బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్.. వర్షాకాలంలోనూ నో టెన్షన్
Advertisement

Best high RPM front load washing machines: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద టాస్క్. బయట ఎండ ఉండదు, ఇంట్లోనేమో ఫ్యాన్ కింద బట్టలు వేస్తే రోజంతా అయినా ఆరవు.. సగం ఆరిన బట్టల నుంచి వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ భరించడం ఎవరికైనా నరకమే. మరి దీనికి సొల్యూషన్ లేదా? అంటే.. కచ్చితంగా ఉంది. బట్టలు ఆరే టైమ్‌ను సగానికి సగం తగ్గించే హై-RPM ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్స్ (High-RPM Front-Load Washing Machines) ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇవి బట్టలను పిండడంలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇంట్లోనే బట్టలు త్వరగా ఆరడానికి హెల్ప్ చేసే బెస్ట్ వాషింగ్ మెషీన్స్ వివరాలు మీకోసం.

హై-RPM ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్స్:

హోమ్ అప్లయెన్సెస్ కేటగిరీలో స్మార్ట్ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ మోడల్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఇండోర్ డ్రైయింగ్ (ఇంట్లోనే బట్టలు ఆరబెట్టడం) కోసం హై-RPM ఉన్న ఫ్రంట్ లోడ్ మెషీన్లను యూజర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Advertisement

అసలు RPM అంటే ఏంటి?
RPM అంటే Rotations Per Minute (నిమిషానికి డ్రమ్ ఎన్ని సార్లు తిరుగుతుంది అనేది). వాషింగ్ మెషీన్ స్పిన్ సైకిల్‌లో ఉన్నప్పుడు RPM ఎంత ఎక్కువగా ఉంటే.. అది బట్టల నుంచి అంత ఎక్కువ నీటిని బయటకు పిండేస్తుంది. సాధారణ మెషీన్లతో పోలిస్తే 1200 నుంచి 1400 RPM ఉన్న ఫ్రంట్-లోడ్ మెషీన్లు బట్టలను దాదాపు 80% వరకు డ్రై చేసి ఇస్తాయి. దీని వల్ల మీరు ఇంట్లో ఫ్యాన్ కింద వేసినా జస్ట్ కొద్దిసేపట్లోనే బట్టలు పూర్తిగా ఆరిపోతాయి.

బట్టలను సగం టైమ్‌లో ఆరబెట్టే టాప్ ఫ్రంట్-లోడ్ బ్రాండ్స్:
LG Direct Drive Front Load (1400 RPM): ఎల్‌జీ లోని సిక్స్‌-మోషన్ టెక్నాలజీ బట్టలను క్లీన్ చేయడమే కాకుండా.. 1400 RPM స్పీడ్‌తో నీటి బొట్టు కూడా లేకుండా పిండేస్తుంది. ఇందులో ఉండే ఇన్-బిల్ట్ హీటర్ ఫీచర్ బట్టలను వేడి నీటితో ఉతికి, త్వరగా ఆరేలా చేస్తుంది.

Advertisement

Samsung Ecobubble with Hygiene Steam (1400 RPM):

ఈ మెషీన్ బట్టల్లోని మురికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో క్లీన్ చేస్తుంది. హై-RPM స్పిన్నింగ్ వల్ల బట్టలు బయటకు వచ్చే సరికే చాలావరకు ఆరిపోతాయి. ఇంట్లో ఆరబెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

IFB Front Load Washing Machine (1200 – 1400 RPM):

ఇండియన్ ఫ్యాబ్రిక్స్‌కు ఐఎఫ్‌బీ పర్‌ఫెక్ట్ సెట్ అవుతుంది. దీని స్పిన్ స్పీడ్ బట్టలు డ్యామేజ్ కాకుండా.. గరిష్టంగా నీటిని తొలగిస్తుంది. వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో బట్టలు ఆరని సమస్యకు ఇది గుడ్ బై చెబుతుంది.

Also Read: పవర్ సేవింగ్స్ ప్లస్ గ్రీన్ టెక్నాలజీ.. ఈ ఫ్రిజ్‌లతో మీ ఇల్లు సూపర్ స్మార్ట్!

Bosch 5 Star Front Load (1400 RPM):

జర్మన్ టెక్నాలజీతో వచ్చే బాష్ మెషీన్లు వాటి యాంటీ-వైబ్రేషన్ డిజైన్‌కు ఫేమస్. హై-RPM లో రన్ అవుతున్నా అస్సలు శబ్దం రాదు, బట్టలు కూడా చాలా ఫాస్ట్‌గా డ్రై అవుతాయి.

ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్స్ వల్ల  లాభాలు:

తక్కువ నీరు, తక్కువ కరెంట్: టాప్-లోడ్ మెషీన్లతో పోలిస్తే ఫ్రంట్-లోడ్ మోడల్స్ చాలా తక్కువ నీటిని వాడుకుంటాయి.

ఫ్యాబ్రిక్ కేర్: హై-RPM ఉన్నప్పటికీ బట్టల క్వాలిటీ పాడవకుండా స్మార్ట్ సెన్సార్లు ప్రొటెక్ట్ చేస్తాయి.

నో బ్యాడ్ స్మెల్: బట్టల్లో నీరు ఎక్కువ శాతం పిండేయడం వల్ల, ఇంట్లో ఆరబెట్టినా వాసన రాదు.

ఈ మాన్‌సూన్ సీజన్‌లో మీ ఇండోర్ డ్రైయింగ్ తలనొప్పులు తగ్గాలంటే.. ఒక మంచి హై-RPM ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను ఇంటికి తెచ్చేసుకోండి.

Related News

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

Big Stories

Advertisement
×