E-Paper
Advertisement

జియో సూపర్ హిట్ ప్లాన్.. అపరిమిత 5G, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

జియో సూపర్ హిట్ ప్లాన్.. అపరిమిత 5G, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!
Advertisement

Jio Plan: రిలయన్స్ జియో (Reliance Jio) తన కస్టమర్ల కోసం బడ్జెట్ ధరలో అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకోచ్చింది. ప్రతిరోజూ ఎక్కువ డేటా వాడుతూ ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ ప్లాన్ పూర్తి వివరాలు, అదనపు ప్రయోజనాలు, రీఛార్జ్ చేసుకునే విధానం వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.

రూ. 749 ప్లాన్ బెనిఫిట్స్

జియో రూ. 749 ప్లాన్‌ను 72 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2 GB హై-స్పీడ్ డేటా యూజర్లకు లభించనుంది. అంటే మొత్తం ప్లాన్ కాలానికి గానూ వినియోగదారులు 144 GB రెగ్యులర్ డేటాను యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా ఫ్రీ కాల్స్ మాట్లాడుకునే సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం అందిస్తోంది. డైలీ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా 64 Kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి.

అపరిమిత 5G డేటా

Advertisement

రూ.749 ప్లాన్ కింద జియో మరికొన్ని అదనపు ప్రయోజనాలను సైతం యూజర్లకు అందిస్తోంది. ఈ ప్యాక్‌ రీఛార్జ్ చేసుకునే వారికి అదనంగా 20 GB బోనస్ డేటా ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల మొత్తం డేటా 164 GBకి చేరనుంది. ఒక వేళ మీ ప్రాంతంలో జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉండి మీరు 5G స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే.. ఈ ప్లాన్‌తో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ ట్రూ 5G డేటాను వాడుకునే వెసులుబాటును సైతం జియో కల్పిస్తోంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా వీక్షించవచ్చు.

ఎవరికి ఎక్కువ లాభం?

ఈ ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు, ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌ను ఎక్కువగా స్ట్రీమ్ చేసే వారికి సైతం ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది. ప్రతి నెలా రీఛార్జ్ చేయించుకునే ఇబ్బంది లేకుండా దాదాపు రెండున్నర నెలల (72 రోజులు) పాటు నిశ్చింతగా ఉండాలనుకునే వారికి సైతం ఈ ప్లాన్ సరైన ఎంపిక కానుంది.

Advertisement

Also Read: జియో బంపరాఫర్.. రూ.448 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. మరెన్నో బెనిఫిట్స్!

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

జియో రూ. 749 ప్లాన్‌ను వినియోగదారులు చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్‌లోని మైజియో యాప్ ఓపెన్ చేసి ‘Recharge’ సెక్షన్‌లోకి వెళ్లి రూ. 749 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. లేదంటే జియో అధికారిక వెబ్ సైట్ లోనూ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు గూగుల్ పే, ఫోన్ పే. పేటీఎం వంటి యాప్స్ వినియోగిస్తుంటే అందులోని రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లి కూడా రూ.749 ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: BSNL సూపర్ హిట్ ప్లాన్.. రోజూ 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా జాతరే!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×