E-Paper
Advertisement

Best Induction Cooktops: ఈ ఇండక్షన్ స్టవ్ మీ ఇంట్లో ఉంటే.. ‘గ్యాస్’ కష్టాలే ఉండవ్, వెంటనే కొనేయండి!

Best Induction Cooktops: ఈ ఇండక్షన్ స్టవ్ మీ ఇంట్లో ఉంటే.. ‘గ్యాస్’ కష్టాలే ఉండవ్, వెంటనే కొనేయండి!
Advertisement

Best Induction Cooktops: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగి, సామాన్యులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. దీనికి తోడు వంట చేసేటప్పుడు గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో అనే టెన్షన్ కూడా ఉంటుంది. ఇలాంటి కష్టాల నుంచి బయటపడాలంటే ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్‌లే దిక్కు. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్టవ్‌లు ఆధునిక సాంకేతికతతో రూపొందించినవే. ఇవి వంటను సులభతరం చేయడమే కాకుండా, సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా చూస్తాయి. ఈ క్రమంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని అత్యుత్తమ ఇండక్షన్ స్టవ్‌ల గురించి తెలుసుకుందాం.

Prestige PIC 20.0 Induction

ప్రెస్టీజ్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయుల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ సంస్థ నుంచి వచ్చిన ఈ మోడల్ చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. దీనిలో ఉన్న ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ కరెంటు హెచ్చుతగ్గుల నుంచి స్టవ్‌ను కాపాడుతుంది. దీనిపై వంట చేయడం చాలా వేగంగా అయిపోతుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిని పూర్తి చేయడమే దీని ప్రత్యేకత.

Philips Viva Collection HD4928/01

Advertisement

డిజైన్ పరంగా, పనితీరు పరంగా ఫిలిప్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ కుక్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇండియన్ వంటకాలకు తగ్గట్టుగా ఇందులో ముందుగానే ప్రోగ్రామ్ చేసిన మెనూలు ఉన్నాయి. అంటే పాలు వేడి చేయడం నుండి కూరలు వండటం వరకు కేవలం ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. ఇది ఎక్కువ కాలం మన్నిక వస్తుంది కాబట్టి.. మధ్యతరగతి కుటుంబాలకు బాగా సెట్ అవుతుంది.

Also Read: ఏఐ ఫీచర్లతో అదరగొడుతున్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మార్చి నెల బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

Bajaj Majesty ICX 7 Induction

Advertisement

బజాజ్ సంస్థ తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో పేరుగాంచింది. ఈ మోడల్ చాలా కాంపాక్ట్‌గా ఉండి వంటగదిలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, టచ్ బటన్లు వాడటానికి చాలా సులువుగా ఉంటాయి. వేడిని కంట్రోల్ చేసుకోవడానికి వేర్వేరు ఆప్షన్లు ఉండటం వల్ల పదార్థాలు మాడిపోయే భయం ఉండదు. ఇది బ్యాచిలర్స్ లేదా చిన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరం.

Pigeon Cruise Induction Cooktop

తక్కువ బడ్జెట్‌లో మంచి ఇండక్షన్ స్టవ్ కావాలనుకునే వారికి పిజియన్ బెస్ట్ ఆప్షన్. ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. అలాగే దీనిపై ఉండే గ్లాస్ ప్యానెల్‌ను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. హై గ్రేడ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ వంటలు చేయాలనుకునే వాళ్లు దీనిని కొనుగోలు చేయొచ్చు.

Usha Cook Joy CJPT 2100 Watts

వంట త్వరగా అవ్వాలనుకుంటే.. ఈ యూషా ఇండక్షణ్ స్టవ్‌ను ఎంచుకోవచ్చు. 2100 వాట్స్ పవర్ ఉండటం వల్ల పెద్ద గిన్నెలతో వంట చేసినా త్వరగా అయిపోతుంది. దీనిలో ఉన్న సేఫ్టీ ఫీచర్లు పిల్లలు ఉన్న ఇంట్లో కూడా సురక్షితంగా వాడుకోవడానికి వీలు కల్పిస్తాయి. మన్నిక విషయంలో ఈ బ్రాండ్ ఎప్పుడూ రాజీ పడదు కాబట్టి.. దీనిని కళ్లు మూసుకుని కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుత గ్యాస్ కష్టాల నుంచి బయటపడాలంటే ఇండక్షన్ స్టవ్‌ను మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదనే చెప్పాలి.

Also Read: మీ ఫోన్ మీ సీక్రెట్స్ వింటోందా? ఈ చిన్న గ్యాడ్జెట్‌తో ఆడియో రికార్డింగ్‌కు చెక్ పెట్టండి!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×