E-Paper
Advertisement

Best Lightweight Smartphones: చిన్న సైజులో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు.. 2025లో బెస్ట్ ఇవే..

Best Lightweight Smartphones: చిన్న సైజులో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు.. 2025లో బెస్ట్ ఇవే..
Advertisement

Lightweight smartphones| ఇప్పుడు చాలా మంది యూజర్లు పెద్ద ఫోన్లకు బదులు చిన్నవి, తేలికగా ఉండే ఫోన్లు ఇష్టపడుతున్నారు. ఈ ఫోన్లు పాకెట్‌లో సులువుగా సరిపోతాయి. ఒక్క చేతిలో పట్టుకొని వీటిని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. పెద్ద ఫోన్ల పనితీరు, ఫీచర్లు పవర్‌ఫుల్‌గా ఉన్నా.. అందరి అవసరాలకు అవి సరిపోవు. మరోవైపు పెద్ద స్క్రీన్ అవసరం లేకుండానే టాప్ పెర్ఫామెన్స్, బెస్ట్ ఫీచర్లు ఇవ్వడం వల్ల చిన్న ఫోన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. 2025లో ఇలాంటి లైట్ వెయిట్ ఫోన్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఆ జాబితాను ఒకసారి చూద్దాం.

గూగుల్ పిక్సెల్ 9a – బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ ఛాయిస్

పిక్సెల్ 9a ధర స్టోరేజ్ వేరియంట్‌ని బట్టి సుమారు రూ.44,999 నుంచి మొదలవుతుంది. ఇందులో 6.3 అంగుళాల P-OLED డిస్‌ప్లే ఉంది, చూడడానికి సూపర్. కెమెరా డ్యూయల్ – 48MP మెయిన్ + 13MP అల్ట్రా వైడ్. Google టెన్సర్ G4 ప్రాసెసర్ వల్ల పెర్ఫామెన్స్ స్మూత్, AI ఫీచర్లు అద్భుతం. ఫోటోలు క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా వస్తాయి. బడ్జెట్‌లో బెస్ట్ వాల్యూ ఇచ్చే ఫోన్, లైట్ వెయిట్‌తో రోజువారీ యూజ్‌కి పర్ఫెక్ట్!

వన్‌ప్లస్ 13s – ఆల్ రౌండ్ పెర్ఫార్మర్

Advertisement

ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.47,999 నుంచి మొదలవుతుంది. 6.32 అంగుళాల LTPO AMOLED స్క్రీన్, కలర్స్ వైబ్రంట్, స్క్రోలింగ్ సూపర్ స్మూత్. Snapdragon 8 Elite ప్రాసెసర్ వల్ల ఏ టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. వెనక డ్యూయల్ 50MP కెమెరాలు, ముందు 32MP సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చాలా క్లియర్‌గా వస్తాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Android 15 OS తో వస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ లవర్స్‌కి ఈ ఫోన్ బెస్ట్, తేలికైన బాడీతో చాలా కంఫర్టబుల్!

ఐఫోన్ 16e – ఆపిల్ విడుదల చేసిన మినీ ఐఫోన్

ఈ చిన్న ఐఫోన్ ధర సుమారు రూ.48,990. ఇందులో డిస్‌ప్లే 6.1 అంగుళాల Super Retina XDR OLED స్క్రీన్ ఉంది. A18 చిప్ వల్ల పెర్ఫామెన్స్ టాప్ క్లాస్, లో లైట్‌లోనూ బెస్ట్. మెయిన్ కెమెరా 48MP, సెల్ఫీ 12MP – ఫోటోలు, వీడియోలు అద్భుతంగా తీయొచ్చు. చిన్న సైజ్ వల్ల రోజువారీ యూజ్‌కి చాలా సింపుల్, లైట్ వెయిట్. ప్యూర్ iOS ఎక్స్‌పీరియన్స్ కావాల్సినవాళ్లకి ఐడియల్!

వివో X200 FE – కెమెరా మినీ స్పెషలిస్ట్

Advertisement

వివో ఫోన్ ధర రూ.54,999. ట్రిపుల్ కెమెరా – రెండు 50MP + 8MP, ముందు 50MP సెల్ఫీ కెమెరాలున్నాయి. ఈ కెమెరాలతో పోర్ట్రెయిట్స్ హై క్వాలిటీ వస్తాయి. MediaTek Dimensity 9300+ చిప్‌సెట్ వల్ల పెర్ఫామెన్స్ స్ట్రాంగ్. భారీ 6500mAh బ్యాటరీ కారణంగా రోజంతా సులువుగా ఉంటుంది. 6.31 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, ఒక చేత్తో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్. కెమెరా లవర్స్‌కి ఈ వివో ఫోన్ సూపర్ ఛాయిస్!

శాంసంగ్ గెలాక్సీ S25 – కాంపాక్ట్ ప్రీమియం ఫోన్

ఈ చిన్న శాంసంగ్ ఫోన్ ధర రూ.63,580. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా – 50MP + 10MP + 12MP సిస్టమ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ వల్ల ఫోన్ పవర్ టాప్ లెవెల్‌గా ఉంటుంది. 6.2 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే లో స్క్రీన్ కలర్స్ వైబ్రంట్‌గా ఉంటాయి. పాకెట్ ఫ్రెండ్లీ ఫోన్ సైజ్, చాలా పోర్టబుల్. చిన్న ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లు కావాల్సినవాళ్లకి బెస్ట్!

ఏది ఎంచుకోవాలి?

మీ బడ్జెట్, అవసరాలు చూసుకుని డిసైడ్ చేయండి. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ కావాలంటే వన్‌ప్లాస్ 13s. సూపర్ ఫోటోగ్రఫీ కావాలంటే వివో X200 FE. ప్యూర్ iOS కావాలంటే ఐఫోన్ 16e. ప్రీమియం ఫీచర్లు కావాలంటే శాంసంగ్ గెలాక్సీ S25. బడ్జెట్‌లో బెస్ట్ కావాలంటే గూగుల్ పిక్సెల్ 9a. అన్నీ లైట్ వెయిట్, పవర్‌ఫుల్ గా ఉన్నాయి. మీకు నచ్చింది త్వరగా కొనేయండి!

Also Read:  హెడ్‌ఫోన్స్‌లో సమస్య వస్తే ఫ్రిజ్‌లో పెట్టండి.. వైరల్ అవుతున్న వింత ట్రెండ్

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×