E-Paper
Advertisement

Budget Microwave Ovens: తక్కువ కరెంట్ వినియోగించే మైక్రోవేవ్ ఓవెన్స్.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఇవే

Budget Microwave Ovens: తక్కువ కరెంట్ వినియోగించే మైక్రోవేవ్ ఓవెన్స్.. బడ్జెట్ ధరలో బెస్ట్ ఇవే
Advertisement

Best Budget Microwave Ovens| వంటగ్యాస్ సమస్యతో సతమతమవుతున్న మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ కిచెన్ అప్లయన్సెస్ కోసం వెతుకుతున్నారు. చిన్న కుటుంబాలకు (2–3 మంది సభ్యులు) కాంపాక్ట్ (చిన్న సైజు), ప్రాక్టికల్ మైక్రోవేవ్ ఓవెన్ చాలా అవసరం. ఈ మోడల్ ఓవెన్స్ స్థలం తక్కువ తీసుకుంటాయి. రోజువారీ కుకింగ్, రీహీటింగ్ అవసరాలకు సరిపోతాయి. ఆధునిక మోడల్స్ స్మార్ట్ ఫీచర్లు, ఎనర్జీ సేవింగ్‌తో వస్తున్నాయి.

చిన్న కుటుంబాలకు ఓవెన్ కెపాసిటీ ఎంత ఉండాలి?

20 నుంచి 23 లీటర్ల కెపాసిటీ ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లు చిన్న కుటుంబాలకు బెస్ట్. ఇవి కిచెన్‌లో తక్కువ స్థలం తీసుకుంటాయి. రోజువారీ ఉపయోగానికి సులభంగా ఉంటాయి. రీహీటింగ్, డిఫ్రాస్టింగ్, సింపుల్ కుకింగ్ అన్నీ సులభంగా చేయవచ్చు. మోడరన్ కిచెన్‌లకు కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి.

ఎనర్జీ సేవింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ

Advertisement

ఆధునిక మైక్రోవేవ్ ఓవెన్లలో ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ పవర్ వినియోగాన్ని కంట్రోల్ చేస్తుంది. విద్యుత్ ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుంది. ఎకో మోడ్ స్టాండ్‌బైలో కూడా పవర్ తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లు తక్కువ వస్తుంది. పర్యావరణానికి కూడా మంచిది. ఇది లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుతుంది.

మైక్రోవేవ్ ఓవెన్ల రకాలు

సోలో మైక్రోవేవ్ ఓవెన్లు సింపుల్ టాస్క్‌లకు బెస్ట్. రీహీటింగ్, డిఫ్రాస్టింగ్, సింపుల్ మీల్స్ చేయడానికి సరిపోతాయి.
కన్వెక్షన్ ఓవెన్లు బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్ చేయగలవు.
OTG ఓవెన్లు బేకింగ్, గ్రిల్లింగ్, టోస్టింగ్‌కు మంచివి. మీ రోజువారీ కుకింగ్ అవసరాల బట్టి రకాన్ని ఎంచుకోవాలి.

బడ్జెట్, స్మార్ట్ ఫీచర్లు

Advertisement

సోలో మైక్రోవేవ్‌లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. సింపుల్ కుకింగ్ కావాలనుకునేవారికి బెస్ట్. కన్వెక్షన్ మోడల్స్ ధర ఎక్కువ కానీ అడ్వాన్స్ ఫీచర్లు ఇస్తాయి. ఆటో కుక్ మెనూలు, సెన్సార్ కుకింగ్, వన్-టచ్ కుకింగ్ ఉంటాయి. ఇవి రోజువారీ కుకింగ్‌ను చాలా సులభం చేస్తాయి.

Also Read: ఇంటర్నెట్ లేకున్నా ఫోన్‌లో లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితంగా.. కొత్త ఫీచర్ గురూ

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ మోడల్స్

  • iBELL 25L OTG.. 1600 వాట్ పవర్, బేకింగ్, గ్రిల్లింగ్, రొటిసరీ సపోర్ట్.
  • IFB 24L సోలో.. 69 ఆటో కుక్ మెనూలు, స్టీమ్ క్లీనింగ్, పవర్ సేవింగ్.
  • Panasonic 20L సోలో.. 51 ఆటో మెనూలు, కాంపాక్ట్ డిజైన్.
  • Milton 10L OTG.. చిన్న కిచెన్‌లకు, అడ్జస్టబుల్ టెంపరేచర్.
  • Wipro 28L OTG.. కన్వెక్షన్ కుకింగ్, స్మార్ట్ కుక్ ఫీచర్లు.
  • Cadlec 12L OTG.. బడ్జెట్ బేకింగ్ ఆప్షన్.
  • Morphy Richards 20L సోలో.. సింపుల్ కంట్రోల్స్, సేఫ్టీ ఫీచర్లు.

మీ కుకింగ్ అవసరాలు, బడ్జెట్ బట్టి పైజాబితాలో నుంచి తగిన మైక్రోవేవ్ ఓవెన్ ఎంచుకోండి. ఈ ఎనర్జీ సేవింగ్ మోడల్స్ దీర్ఘకాలంలో కరెంట్ బిల్లు తగ్గిస్తాయి. ఎకో మోడ్, ఆటో కుక్ మెనూలు ఉన్నవి చూడండి. బిల్డ్ క్వాలిటీ, వారంటీ కూడా చెక్ చేయండి. మంచి మైక్రోవేవ్ టైం సేవ్ చేస్తుంది, కుకింగ్‌ సులభం చేస్తుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన మైక్రోవేవ్ ఓవెన్ల ఫీచర్లు, దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచన. ఈ కథనంలో పేర్కొన్న ఓవెన్ల ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ వివరాలు.

Related News

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×