Best smartphones 2025: ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫ్లాగ్‌షిప్ అంటే రూ. 1 లక్ష పైమాటే ఉండేది. కానీ ఇప్పుడు రూ.70వేల నుంచి రూ.80వేల ధరలోనే ‘అల్టిమేట్’ ఫోన్లు లభిస్తున్నాయి. ఈ ధరలో టెక్ మార్కెట్‌లో పోటీ పడుతున్న వివో ఎక్స్300, వన్‌ప్లస్ 15, ఐక్యూఓఓ 15, ఐఫోన్ 17 ఫోన్ల మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
వీవో ఎక్స్300 (Vivo X300) ధర రూ 75,999
ముందుగా వీవో ఎక్స్300 గురించి మాట్లాడితే, దీని ధర సుమారు రూ 75,999 గా ఉంది. ఈ ఫోన్ యొక్క కెమెరా సెటప్ చాలా ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే ఇందులో 200 ఎంపి టెలిఫోటో లెన్స్ ఉంది. దాన్ని ఉపయోగించి దూరంలో ఉన్న వస్తువు లేదా వ్యక్తిని జూమ్ చేసినా ఫోటోలు స్పష్టంగా డీటెయిల్స్‌తో వస్తాయి. నైట్ ఫోటోగ్రఫీ, రోజువారీ షూటింగ్ అన్నీ చాలా నాణ్యంగా ఉంటాయి. డిస్‌ప్లే సైజు 6.31 అంగుళాలు మాత్రమే అయినా 120 Hz అమోలెడ్ డిస్‌ప్లే స్క్రోల్ చేసే సమయంలో చాలా సాఫీగా అనిపిస్తుంది. పెద్ద 6040 mAh బ్యాటరీ ఒకపూట పూర్తిగా తగినంత బ్యాకప్ ఇస్తుంది. అంతేకాకుండా 90W వేగంగా ఛార్జింగ్ తో త్వరగా ఛార్జ్ అయిపోతుంది. కెమెరా మొదటి ప్రాధాన్యత ఇచ్చే వారికైతే ఈ ఫోన్ చాలాబాగా నచ్చుతుంది.
వన్‌ప్లస్ 15 (OnePlus 15) ధర రూ.72,999
తర్వాత వన్‌ప్లస్ 15 ఇది టెక్ ప్రపంచంలో త్వరగా పేరు సంపాదించింది. దీని ధర సుమారు రూ 72,999గా ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 6.78 అంగుళాలు, 165 Hz ఎల్టీపీఓ అమోలెడ్‌తో వస్తుంది. పెద్ద డిస్‌ప్లే వల్ల వీడియోలు చూడటానికి, గేమ్ ఆడటానికి పెద్దగా అద్భుత అనుభవం వస్తుంది. ఇందులో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ప్రాసెసర్ వల్ల హై-ఎండ్ యాప్స్, హై గ్రాఫిక్స్ గేమ్స్ కూడా సాఫీగా నడుస్తాయి. ఏది మొదటి ప్రాధాన్యత పెట్టుకున్నా పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ పెద్ద 7300 mAh బ్యాటరీ ఉంది, ఇది రోజంతా వినియోగించినా కూడా తగినంత బ్యాకప్ ఇస్తుంది. ఇంకా 120W వేగంగా ఛార్జింగ్ ఉండటం వల్ల కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. దీంతో ఇది ఒక మంచి ఆల్-రౌండర్ ఫోన్‌గా నిలుస్తుంది.
ఐక్యూఓఓ 15 (iQOO 15) ధర రూ.72,999
మరో ఫోన్ ఐక్యూఓఓ 15 కూడా అదే ధర సుమారు రూ.72,999 వద్ద ఉంది. కానీ దీనిని ప్రత్యేకంగా గేమింగ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మాత్రమే కాదు 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా స్మూత్ అనుభవం ఇస్తుంది. ఈ ఫోన్‌లో 7000 mAh బ్యాటరీ ఉంది, దీని వల్ల ఎక్కువ సమయం వరకూ గేమ్స్ ఆడుకోవచ్చు. 100W వేగంతో ఛార్జింగ్ అనేది కూడా డే-టూ-డే ఉపయోగంలో చాలా ఉపయోగపడుతుంది. కెమెరా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది కాని దీని ప్రధాన శక్తి గేమింగ్ పర్‌ఫార్మెన్స్ లోనే కనిపిస్తుంది.
ఐఫోన్ 17 (iPhone 17) ధర రూ.82,900
ఇక ఐఫోన్ 17 విలువ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ధర సుమారు రూ.82,900 కి ప్రారంభమవుతుంది. ఇది డబ్బులు కొంచెం ఎక్కువగా అయినా, ఐఓఎస్ అనుభవం, వీడియో రికార్డింగ్ క్వాలిటీ, క్లిన్ సాఫ్ట్‌వేర్ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో ఆపిల్ ఏ19 చిప్ ఉంది, ఇది పనితీరు పరంగానే కాకుండా బ్యాటరీ లైఫ్ పరంగానూ చాలా బాగా ఆప్టిమైజ్ అయింది. డిస్‌ప్లే పరంగా 6.1 అంగుళాలు సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ సామర్థ్యం కొంచెం తక్కువగా కనిపించినా, ఐఓఎస్ ఆప్టిమైజేషన్ వల్ల రోజంతా సరిపోతుంది.
ఏది బెస్ట్ అంటే?
మీరు మొదటగా సెల్ఫీ లవర్స్ అయితే పెద్ద కెమెరా కోరుకునే వారికి Vivo X300 చాలా మంచి ఎంపిక. పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ, అన్నీ ఒకే ఫోన్‌లో కావాలంటే OnePlus 15 ఆప్షన్. మీరు గేమింగ్ ప్రియులైతే మాత్రం iQOO 15 మీకు సరిపోయే ఫోన్. చివరగా, మీరు ఐఓఎస్ అనుభవం కోరుకుంటే కొంచెం బడ్జెట్ పెంచి iPhone 17 కూడా ఒక ప్రీమియమ్ ఎంపికగా ఉంటుంది. ఇవి మీరు ఎంచుకుంటే ఈ ధరలో మీరు కోరుకునే ఫోన్ మీ చేతిలో ఉంటాయి.