E-Paper
Advertisement

Best Phones Under rs 25,000: మార్కెట్‌లో మోత మోగిస్తున్న బడ్జెట్ ఫోన్లు.. వచ్చే 3 ఏళ్ల వరకు తిరుగులేని బెస్ట్ ఫోన్లు ఇవే..

Best Phones Under rs 25,000: మార్కెట్‌లో మోత మోగిస్తున్న బడ్జెట్ ఫోన్లు.. వచ్చే 3 ఏళ్ల వరకు తిరుగులేని బెస్ట్ ఫోన్లు ఇవే..
Advertisement

Best Phones Under rs 25,000: 2025 చివరి దశకు చేరుకుంటున్న సమయంలో కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఎన్నో ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా బడ్జెట్ ధరలో ఈ సంవత్సరం వేలల్లో ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. కొత్త సంవత్సరం ముందు కొనుగోలు చేసే ఫోన్ కనీసం మరో 2 లేదా 3 సంవత్సరాలు స్టేబుల్‌గా ఉండాలి. డిస్‌ప్లే, పర్‌ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అన్ని విషయాల్లో బ్యాలెన్స్ ఉండాలి. అలాంటి అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇండియా మార్కెట్‌లో రూ.25వేలలోపు కొనడానికి బెస్ట్ ఫోన్‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 (OnePlus Nord CE 5)

Advertisement

వన్‌ప్లస్ నార్డ్ సిఇ5 అనేది క్లిన్ సాఫ్ట్‌వేర్ అనుభవం కోరుకునే వారికి బాగా సరిపడే ఫోన్. ఇందులో 6.77 ఇంచుల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా అనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ వలన డైలీ యూజ్ మాత్రమే కాదు, హెవీ యాప్స్ కూడా ఈజీగా హ్యాండిల్ అవుతాయి. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి 600 సెన్సార్ ఓఐఎస్ సపోర్ట్‌తో వస్తుంది. వీడియో స్టేబిలిటీ కూడా ఈ సెగ్మెంట్‌లో మంచి స్థాయిలో ఉంటుంది. 7100mAh బ్యాటరీ పెద్ద ప్లస్ పాయింట్. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో చాలా తక్కువ సమయంలో చార్జ్ అవుతుంది. ఆక్సిజన్‌ఓఎస్ 16 ఉండటం వల్ల యాడ్స్ లేని క్లిన్ అనుభవం లభిస్తుంది. బ్రాండ్ వాల్యూ, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది సుమారు రూ.25వేలలోపు లభించే అవకాశం ఉంది.

ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో (Infinix GT 30 Pro)

Advertisement

గేమింగ్‌పై ఎక్కువ ఫోకస్ ఉన్నవారికి ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో ఒక స్ట్రాంగ్ ఆప్షన్. ఇందులో 6.78 ఇంచ్ 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 144 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గేమింగ్ సమయంలో స్పష్టంగా తేడా చూపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ చిప్‌సెట్ ఎల్‌పిడిడిఆర్ 5X ర్యామ్, యుఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో కలిసినప్పుడు పర్‌ఫార్మెన్స్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. ఐపి 64 రేటింగ్ వలన డస్ట్ స్ప్లాష్‌ల నుంచి కొంత రక్షణ ఉంటుంది. 5500mAh బ్యాటరీ డైలీ యూజ్‌కు సరిపడే స్థాయిలో ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ సెగ్మెంట్‌లో అరుదైన విషయం. 108 మెగాపిక్సెల్ కెమెరా డే లైట్ ఫోటోగ్రఫీలో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. గేమింగ్, స్పీడ్ ఇష్టపడే వారికి రూ.23వేల బడ్జెట్‌లో పోకో ఫోన్లు గట్టి పోటీ అని చెప్పొచ్చు.

Also Read: Cyber Fraud: ఉచిత గిఫ్టులు, భారీ డిస్కౌంట్లు, అంతా మాయే.. న్యూ ఇయర్ స్కామ్స్‌పై పోలీసుల హెచ్చరిక

పోకో ఎక్స్7 ప్రో (Poco X7 Pro)

పోకో ఎక్స్7 ప్రో అనేది ఆల్‌రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. 6.67 ఇంచ్ 1.5కె ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం మూవీ లవర్స్‌కు అదనపు ప్లస్. మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ఈ సెగ్మెంట్‌లో చాలా స్ట్రాంగ్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ఐపి69 రేటింగ్ ఈ ధరలో చాలా అరుదైన విషయం. 6550mAh బ్యాటరీ 90వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కలిపితే రోజంతా బ్యాటరీ టెన్షన్ ఉండదు. కెమెరా సెటప్ సింపుల్‌గా ఉన్నా, డైలీ ఫోటోగ్రఫీకి సరిపడే అవుట్‌పుట్ ఇస్తుంది. గేమింగ్, స్పీడ్ ఇష్టపడే వారికి రూ.23వేల బడ్జెట్‌లో ఇన్ఫినిక్స్ ఫోన్లు గట్టి పోటీగా నిలుస్తున్నాయి.

రియల్‌మీ పి3 అల్ట్రా (Realme P3 Ultra)

రియల్‌మీ పి3 అల్ట్రా డిజైన్ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. 6.83 ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండటంతో యూజ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటం వల్ల డ్యూరబిలిటీపై నమ్మకం పెరుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ డైలీ యూజ్ నుంచి మల్టీటాస్కింగ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తుంది. ఐపి 69 రేటింగ్ వలన నీరు, ధూళి నుంచి మంచి రక్షణ లభిస్తుంది. 6000mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కలిపితే ఇది చాలా బ్యాలెన్స్‌డ్ ప్యాకేజ్‌గా మారుతుంది. సోనీ ఐఎంఎక్స్ 896 కెమెరా ఓఐఎస్‌తో రావడం వల్ల ఫోటో క్వాలిటీ స్టేబుల్‌గా ఉంటుంది.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro)

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి సరైన ఎంపిక. 6.7 ఇంచ్ పోల్డ్ డిస్‌ప్లే 1.5K రిజల్యూషన్‌తో పాటు 144 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ డైలీ యూజ్‌లో స్టేబుల్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ఐపి 68 రేటింగ్ ఉండటంతో నీటిలో పడిపోయినా భయం ఉండదు. 4500mAh బ్యాటరీ ఉన్నా 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వలన నిమిషాల్లో చార్జ్ అవుతుంది. కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, టెలిఫోటో లెన్స్ ఉండటం వల్ల ఫోటోగ్రఫీ లవర్స్‌కు మంచి అనుభవం లభిస్తుంది. ఫ్రంట్‌లో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా సెల్ఫీ క్వాలిటీని మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో చూసుకుని క్లిన్ సాఫ్ట్‌వేర్ కావాలా, గేమింగ్ కావాలా, కెమెరా ప్రాధాన్యతా అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటే నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. మంచి కెమెరా, కర్వ్డ్ డిస్‌ప్లే ఆశించే వారికి రూ.25వేల ధరలో ఇది ఒక స్టైలిష్ ఎంపిక అనొచ్చు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×