E-Paper
Advertisement

Best Portable Projectors 2026: అరచేతిలో పట్టేసే పోర్టబుల్ ప్రొజెక్టర్స్.. ఎక్కడైనా సినిమా చూసేయొచ్చు!

Best Portable Projectors 2026: అరచేతిలో పట్టేసే పోర్టబుల్ ప్రొజెక్టర్స్.. ఎక్కడైనా సినిమా చూసేయొచ్చు!
Advertisement

Best Portable Projectors 2026: ఒకప్పుడు ప్రొజెక్టర్ అంటే పెద్ద డబ్బాలా ఉండేది. పైగా దానికి బోలెడు వైర్లు ఉండటంతో సెటప్ చేయడమే పెద్ద టాస్క్. కానీ ఇప్పుడు కాలం మారింది.. ప్రొజెక్టర్ల టెక్నాలజీ మనం ఊహించని రేంజ్‌కు చేరుకుంది. అసలు ప్రొజెక్టర్ ఇంత చిన్నగా కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోయేలా జేబులో పట్టేంత సైజులోకి వచ్చేశాయి.

ముఖ్యంగా ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్స్‌ను చూస్తుంటే, పాతతరం టీవీల అవసరం ఇక లేదేమో అనిపిస్తుంది. ఆకట్టుకునే బ్రైట్‌నెస్, స్మార్ట్ ఫీచర్లు, ఎక్కడికైనా సులభంగా పట్టుకెళ్లే పోర్టబిలిటీ.. ఇలా అన్నీ వీటి సొంతం. ఒకవేళ ఇంట్లో బెడ్‌రూమ్ గోడను సినిమా థియేటర్‌గా మార్చాలన్నా, ఫ్రెండ్స్‌తో కలిసి అవుట్‌డోర్‌లో మూవీ నైట్ ప్లాన్ చేసినా.. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 6 పోర్టబుల్ ప్రొజెక్టర్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తాయి.

1) Xgimi MoGo 4 Laser

Advertisement

ఈ ఎక్స్‌గిమి మోగో 4 లేజర్‌ ప్రొజెక్టర్‌లో వాడిన ట్రిపుల్ లేజర్ టెక్నాలజీ వల్ల కలర్స్ చాలా సహజంగా, కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. దీని 550 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ వల్ల రూంలో వెలుతురు ఉన్నా బొమ్మ క్లియర్‌గా ఉంటుంది. 360 డిగ్రీల అడ్జస్టబుల్ స్టాండ్‌తో దీన్ని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. హార్మన్ కార్డాన్ స్పీకర్లు ఉన్న ఈ మోడల్ ధర సుమారు రూ.59,500 ఉంటుంది.

2) Xgimi MoGo 4

లేజర్ మోడల్ అంత బడ్జెట్ పెట్టలేము అనుకునే వారు ఈ ఎక్స్‌గిమి మోగో 4ను కొనుగోలు చేయొచ్చు. ఇది 450 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ని ఇస్తుంది. దీనిలో ఉన్న సన్‌సెట్ ఫిల్టర్ గదికి ఒక స్పెషల్ లుక్‌ని ఇస్తుంది. నెట్‌ఫ్లిక్స్, గూగుల్ టీవీ వంటి ఫీచర్లు కలిగి ఉన్న ఈ ప్రొజెక్టర్ ధర రూ.40,200తో ప్రారంభం అవుతుంది.

Advertisement

Also Read: రూ.1,499కే 5G ఫోన్.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో నోకియా మాస్టర్ ప్లాన్!

3) Samsung The Freestyle+

శాంసంగ్ ఈ మోడల్‌ను చాలా ఫ్లెక్సిబుల్‌గా డిజైన్ చేసింది. గోడ గరుకుగా ఉన్నా లేదా కలర్ వేరుగా ఉన్నా.. దీని AI ఆప్టిస్క్రీన్ టెక్నాలజీ ఇమేజ్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. దీన్ని 180 డిగ్రీలు రొటేట్ చేసి సీలింగ్‌పై కూడా సినిమా చూడొచ్చు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ శాంసంగ్ ది ఫ్రీస్టైల్ ప్లస్ ప్రొజెక్టర్ అంచనా ధర సుమారు రూ67,000 ఉండవచ్చు.

4) Dangbei Freedo

స్టైలిష్ లుక్‌తో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది. ఈ డాంగ్‌బే ఫ్రీడో ప్రొజెక్టర్ 2.5 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అంటే.. ఒక సినిమా పూర్తయ్యే వరకు హాయిగా చూడొచ్చు. దీనిలో ఉన్న ఆటో ఫోకస్ ఫీచర్ వల్ల బొమ్మ బ్లర్ అవ్వకుండా క్లియర్‌గా వస్తుంది. దీని ధర రూ.50,300.

5. Soundcore Nebula P1

విజువల్స్ కంటే సౌండ్ క్వాలిటీ ముఖ్యం అనుకుంటే.. ఈ ఈ సౌండ్‌కోర్ నెబ్యులా P1 ప్రొజెక్టర్‌ను కొనుగోలు చేయొచ్చు. దీని స్పీకర్లను విడదీసి కూడా వాడుకోవచ్చు. ఇవి 20 గంటల ప్లేబ్యాక్ ఇస్తాయి. 650 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ ప్రొజెక్టర్ ధర రూ.67,100 ఉంటుంది.

6. Aurzen Boom Air

బడ్జెట్ తక్కువగా ఉన్నా.. మంచి క్వాలిటీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్. దీనిని పవర్ బ్యాంక్ సహాయంతో కూడా వాడుకోవచ్చు కాబట్టి.. ట్రావెలింగ్‌కి చాలా బాగుంటుంది. చిన్న గదుల్లో వాడుకోవడానికి అనువైన ఈ ప్రొజెక్టర్ ధర రూ.25,200 మాత్రమే.

Also Read: భారీ 75 ఇంచుల LG స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్.. ధర వింటే షాక్ అవుతారు!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×