E-Paper
Advertisement

Bitter gourd: ఈ చిన్న చిట్కాలు కాకరకాయలోని చేదును తీసేయండి, పిల్లలు కూడా తింటారు

Bitter gourd: ఈ చిన్న చిట్కాలు కాకరకాయలోని చేదును తీసేయండి, పిల్లలు కూడా తింటారు
Advertisement

కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే చాలా మంది వైద్యులు కూడా వారానికి ఒకసారి అయినా కాకరకాయ తినాలని సూచిస్తుంటారు. అయితే ఈ కూరలో చేదు వల్ల ఎవరూ దీన్ని తినేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు, యువత అయితే కాకరకాయవైపే చూడరు. కానీ కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ పాటిస్తే కాకరకాయలో ఉండే చేదును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

కాకరకాయలో చేదును తగ్గించండిలా
కాకరకాయను కట్ చేసిన తర్వాత ఉప్పు రాసి కొంతసేపు పక్కన ఉంచేయాలి. కాకరకాయను పలుచగా ముక్కలుగా కోసి వాటిపై ఉప్పు బాగా రాయాలి. తర్వాత వాటిని సుమారు 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. కొద్దిసేపటికి కాకరకాయ నుంచి నీరు బయటకు వస్తుంది. ఆ నీటిని చేతితో పిండి పారేస్తే చేదు రుచి చాలా వరకు తగ్గిపోతుంది. ఇది చాలా మంది ఇంట్లో పాటించే సులభమైన పద్ధతి. ఇలా చేసిన తర్వాత కాకరకాయతో చేసే వేపుడు, కూర లేదా పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది.

Advertisement

Also read: Rajma Pulao: రాజ్మా పులావ్.. తింటే రుచే కాదు, పోషకాహారలోపం కూడా రాదు, రెసిపీ ఇదిగో

కాకరకాయలోని గింజలు తీసేయడం వల్ల చేదు తగ్గుతుంది. సాధారణంగా కాకరకాయ లోపల ఉండే గింజలు, తెల్లని పొర ఎక్కువగా చేదుగా ఉంటుంది. అందుకే వంట చేయడానికి ముందు కాకరకాయను మధ్యలో కోసి గింజలు తీసేయడం మంచిది. అలాగే పై తొక్కను కూడా కొంచెం తురిమేస్తే చేదు తగ్గుతుంది. కొన్ని ఇళ్లలో కాకరకాయను పెరుగు లేదా మజ్జిగలో కొంతసేపు నానబెట్టే పద్ధతి కూడా ఉంటుంది. దాదాపు ఒక గంట పాటు నానబెట్టి తర్వాత కడిగి వండితే చేదు చాలా వరకు తగ్గిపోతుంది.

Advertisement

ఉప్పు కలిపిన నీటిలో
అదే విధంగా కాకరకాయను ఉప్పు కలిపిన వేడి నీటిలో కొద్దిసేపు మరిగించడం వల్ల కూడ ఉపయోగం ఉంటుంది. ముక్కలుగా కట్ చేసిన కాకరకాయను వేడి నీటిలో 3 నుంచి 5 నిమిషాలు ఉంచి తీసేయాలి. తర్వాత వాటిని నీటితో కడిగి కూరగా వండితే చేదు తక్కువగా ఉంటుంది. అలాగే కూర వండేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువగా వేస్తే కూడా రుచి మారుతుంది. కొంతమంది చింతపండు రసం లేదా కొద్దిగా బెల్లం వేసి కాకరకాయ కూర చేస్తారు. ఇలా చేస్తే చేదు రుచి తగ్గి కూర తీపి,పులుపు కలిసిన రుచిగా ఉంటుంది.

Also read: Tan Removal tips: వేసవిలో ముఖానికి నల్లటి ట్యాన్ పట్టేసిందా? సింపుల్ గా ఇలా వదిలించేసుకోండి

కాకరకాయ చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఉప్పు రాయడం, గింజలు తీసేయడం, మజ్జిగలో నానబెట్టడం, వేడి నీటిలో మరిగించడం వంటి చిన్న చిట్కాలు పాటిస్తే కాకరకాయ చేదును చాలా వరకు తగ్గిస్తుంది. అప్పుడు ఈ కూరను ఇంట్లో ఉన్నవారంతా ఇష్టంగా తినగలుగుతారు.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×